తాకాల్సింది ఎదురు గా ఉన్న విగ్రహాన్ని కాదు, మన మనో నిగ్రహం ను, మన హృదయం మనస్సు ను - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఈ వారంలో గుడి కి వెళితే, కనీసం గురువు గారి హారతులు కూడా, దేవుని పై క్రుతజ్ఞతలు తో,

పుస్తకం లేదా ఫోన్ లో, దేవుడు ఇచ్చిన ఇంకా కనపడే కళ్ళు తో చూసి,

ఇంకా మూగబోని సొంత గొంతు తో పాడే ప్రయత్నం చేయకుండా నే,

మధ్య లో లేదా హారతులు అయిన తర్వాత మాత్రం,

బాబా లేదా ఇతర దేవతల గురువు ల, చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని, లాగుతూ పాముతూ దండాలు దస్కాలు పెడుతూ,

వారిని నానా ఇబ్బందులు పెడుతూ ఇతర జనాలను తిప్పలు పెడుతూ, జనం ఎదురు నటిస్తూ, నానా పాట్లు పడుతున్నారు.

మరి దేని కోసమో అంత నటన అర్థం కాదు, బాహ్య ఆరాటం వలన ప్రయోజనం ఏముంది?

వెంకన్న ను, కృష్ణుని తాకనివ్వరు, అసలు మనమే తాక కూడదు, అంటే మనకు ఆధ్యాత్మిక రక్షణ స్వస్ధత ఉండదా?

ఖచ్చితంగా ఉంటుంది, తాకాల్సింది ఎదురు గా ఉన్న విగ్రహాన్ని కాదు సుమా, కఠిన సాధన తో మన మనో నిగ్రహం ను, మన హృదయం మనస్సు లోతుల ను.

అరిషడ్ వర్గాల ను జయించనిదే, అర్హత సంపాదించనిదే, ఏ గురువు ను లేదా విగ్రహాలు ను, నిత్య పాపాత్ములమైన నిరంతర వ్యసన పరులమైన, మనం తాకకుండా ఉండటమే ఉత్తమం. లేదంటే, ఆ పాపం కూడా అంటుకుంటుంది.

చేదు దోసకాయ ను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్ధాలలో ముంచినా, చేదు పోతుందా? మీరే చెప్పగలరు.

ఆ ఉత్తమ కఠిన సాధన చేతగాని వారు, చేవలేని మూర్ఖులే, బయట దేవుని విగ్రహాలు ను తాకాలని, ఆరాటపడుతుంటారు, ఎగబడుతుంటారు.

మీరు ఎక్కడ అయినా, ఇలాంటి వారిని చూస్తే, ఖచ్చితంగా ఇవి ఊహించుకోవచ్చు ను 90 శాతం ఇలాంటి వారు అని పెద్దలు అంటారు - తమ సొంత తల్లి దండ్రులు అత్త మామలు పాదాలు, వీరు తాకి నమస్కారం చేయరు, వారికి సేవ కూడా చేయరు, ముదుసలి తనం లో దగ్గర ఉంచుకోవడం చేయరు, వారి మీద జాలి దయ ప్రేమ కూడా ఉండవు. ఆఖరికి జీవిత భాగస్వామి పిల్లల ను కూడా, బాధ్యత ప్రేమ సంస్కారం తో చూడరు.

ఎందుకంటే వారికి అవి తెలీదు. సజీవ దైవం గురువు లైన మంచి తల్లి దండ్రులు కే పాద సేవ చేయని వారు, బయట విగ్రహాలు కు సేవ చేస్తారా? రామ రామ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 26-Jul-2021, Upd Dt : 26-Jul-2021, Category : General
Views : 175 ( + More Social Media views ), Id : 1230 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : touch , guru , baba , idol , feet , mental , restraint , inner , heart , mind
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content