Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *పతన దోవ విడువని చంద్రన్న? మరలా దగ్గుబాటి, నటుడు మోహన్ బాబు తో దోస్తీ పుకార్లు? మరలా కొడాలి? - రాజకీయం/ పాలిటిక్స్*
మాట తప్పడం, మడమ తిప్పడం లో మన జగనన్న ఎటూ, విజయ వంతము గా ముందుకు వెళుతున్నారు. ఐతే, తెలివిగా ప్రతి అడుగు వేస్తున్నారు, దానిని మెచ్చుకోవాలి. ఆయన సొంత తప్పులకు తోడుగా, జిల్లా నాయకులు చేసే తప్పుడు పనులను, చిన్నగా సరి చేస్తున్నారు. కేంద్రం తో సఖ్యత గా ఉన్నారు. రాష్ట్ర బీజేపీ తిడుతున్నా, కేంద్ర అండగానే ఉంది.
జనం కూడా, పాము కన్నా, పులి నే బెటర్ అనుకుంటున్నారు. పులి చెప్పి నేరుగా దెబ్బ కొడుతుంది, పాము లా ప్రతి క్షణం క్షణం భయముతో ఏ సందులో నుంచి చాటుగా వెన్నుపోటు తో వస్తుందో అని కుమిలి చావకుండా.
ఆవు వేస్ట్ మనల్ని పూర్తి గా పతనం చేయలేదు కదా తొందరగా, అనుకునే మత్తు స్తితిలోనే ఉన్నారు, మరి ఇంకా ప్రక్రుతి వైపరీత్యాలు వస్తేనే, ఆవు వైపు చూస్తారేమో.
వయస్సు పై బడుతున్న చంద్రన్న, తనను ఇతరులు పతనం చేసే అవకాశం ఇవ్వకుండా, తనకు తానే, స్వయం పతన దిశలో ప్రతి అడుగు, జాగ్రత్త గా చూసి చూసి వేస్తున్నారు. లేకపోతే, పై ఉత్తమ నాయకులతో మరలా వెళతారా? ఒకవేళ పుకారు నిజమైతే, ఎందుకు వెళుతున్నారు?
ఓటమికి భయపడా? పోనీ వారితో ఉపయోగం ఉందా, ఇది తెలివి తక్కువ నిర్ణయమా? చెడా మడా తిట్టిన వారే చివరకు దిక్కా? మరి ఇప్పుడు, ఎవరు నీతి, నిబద్దత, విలువలు లేని వారు? వారా? మనమా? వారి పుస్తకాలు అబద్దమా? వారి ఆరోపణలు నీతి లేనివా? వారు ఒప్పుకున్నారా బహిరంగముగా? లేదు దొంగలము దొంగలము, ఎప్పుడు అయినా ఒకటే, అనుకుందామా?
ఎవరైనా చంద్రన్న కు చెబుతారా, అంత దిగజారుడు పతనం వద్దు అని, అది చిన బాబు భవిష్యత్ కు దెబ్బ అని? అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
మనం పెంచి పోషించి, మనమే వాంతి చేసుకునే విధముగా తిట్టించుకున్న, కొడాలి రేపు
వస్తున్నా కూడా, ఓకేనా, అవ్వ, రామ రామా? ఇది వర్గ అభిమానమా? గెలుపుకు, ఇంత దిగజారుడు అవసరమా? అని ఆశ్చర్యపోతున్న అభిమానులు.
తన అర్ధం లేని పనులతో, లోకేష్ భవిష్యత్తును పాడుచేస్తున్నారా, అని ముక్కున వేలేసుకుంటున్న చంద్రన్న అభిమానులు.
నాయకులను తయారు చేసే నాయకుడు, నేడు తయారు చేసుకోలేక చతికిలబడి, తన నిస్సహాయతను ఒప్పుకుంటూ భయముతో, మనల్ని తిట్టినవారినే చేతులు పట్టుకుని బతిమాలి లేదా వారే సిగ్గువిడిచి వస్తున్న, దిగజారి తలవంచవచ్చునా?
పార్టీ ప్రతిష్ట విలువలు ఇంకా పతనం చేయవచ్చునా? మన సొంత పార్టీ పెట్టుకుంటే, మన ఇష్టం గదా? మామ పార్టీని ఇంకా ఎంత బ్రష్టు పట్టించాలి, అని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు.
అభిప్రాయ బేధాలు తో వేరు అయిన వారు రావచ్చు, తప్పు లేదు. కానీ మన పై చెడుగా పుస్తకాలు రాసి, రాజకీయాలకు దూరముగా ఉండి, మీడియాలో మోసగాడు అని ఏకి పారేసిన వారిని కూడా, వెనక్కి తీసుకునే స్తాయికి, మన ఎంటీయార్ తెదేపా పడిపోయిందా అంటున్నారు తెదేపా అభిమానులు.
రామయ్య సోమయ్య ను బండబూతులు తిట్టి పుస్తకాలు రాసి, కంపెనీ కూడా లాక్కున్నాడు అని, ఫీజ్ రీయింబర్స్మెంట్ లు రాలేదు అని పిల్లలు తో రోడ్ మీద ధర్నా చేసి, అసలు రామయ్య మనిషే కాదు మమ్మల్ని నిలువునా ముంచాడు, అని ఇన్నాళ్ళు రోడ్ ఎక్కి తూలనాడిన తర్వాత, మరలా రామయ్య సోమయ్య కలుస్తుంటే, ఎవరిది తప్పు?
సోమయ్య తిట్టాడు దూరముగా ఉన్నారు అంటే, పై విధముగా, రామయ్య ది తప్పు అనే కదా? పోనీ, నేను తాగిన మైకములో పుస్తకం రాశాను, అబద్దాలు చెప్పాను అని చెంపలు అందరి ముందు వేసుకున్నారా? లేక, అసలు రామయ్య సోమయ్య ఇద్దరూ, నీతి మాలిన వాళ్ళేనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళా? రామన్న ఆత్మాభిమానం విలువలు అన్ని ఏనాడో పోయాయి అని మరలా నిరూపణ నా? అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
పోనీ వారితో విలువ ఉందా, జనములో మంచి పేరుందా?
దగ్గుబాటి వారి ఇంట్లో, ఏ పార్టీ లో ఎవరు ఎన్ని రోజులు ఉంటారో, ఎవరికీ తెలీదు. ఉన్నా, వారితో ఆ ఊరికి, జనానికి ఉపయోగం ఏమిటో కూడా తెలీదు. జన బలం లేదు. ఎంటీయార్ వెన్నుపోటు సమయములో, ఎంటీయార్ కు దూరంగా ఉన్నారు. మొన్న వైసీపీ లో కొడుకు బదులు పోటీ చేసి పర్చూరు లో ఓడిపోయారు. మరలా ఇప్పుడు చీరాలనా? మధ్యలో విశ్రాంతి, రాజకీయ సన్యాసం, మరలా రాజకీయం, తన రాజకీయ పతనం తనే చేసుకున్నారు. అలాంటి వ్యక్తి అండ, చంద్రన్నకు ఈనాడు కావాలా? అని అభిమానుల సూటి ప్రశ్న.
మోహన్ బాబు, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఏ ఒక్కరితో సరిగ్గా ఉండరు. అవసరానికి, ఎటైనా, దూకుతారు, ఎంత మాటైనా, ఎక్కడైనా ఎవరినైనా అంటారు. విలువలు అసలు నచ్చవు. సినీ మా ఎన్నికలని ఎంత బ్రష్టు పట్టించారో అందరికీ తెలుసు. ఖరీదైన ఎన్నికలు గా మార్చారు, విమానాలలో ఓటర్లను తెచ్చి. పేద పిల్లలకు ఉచిత చదువు అంటూ, ఫీజ్ రీయింబర్స్ మెంట్ ప్రభుత్వ దగ్గర నుంచి. అది రాలేదు అని మరలా గొడవ. జగనన్న దగ్గర సైలెంట్. జగనన్న అందుకే దూరం పెట్టరు.
ఇప్పుడు కాలేజీ వ్యాపారం బాగోలేదని, లాభసాటి దేవుని వ్యాపారం మొదలు పెట్టారు. రాయలసీమ చిత్తూర్ వ్యక్తిగా, వేమన రాఘవేంద్ర బ్రహ్మం గారి తెలుగు బోధనలు నచ్చలేదు అర్ధం కాలేదు అంట, వారికి గుడి కట్టరు, ప్రచారం చేయరు అంట. ఇతర భాషా గురువుల పై వ్యాపారం బాగుందని, వారి భాషలో సాహిత్యం చదివి నచ్చి, మందిరం కట్టారు. ఇలాంటి వారి, అండకై, చంద్రన్న ప్రాకులాడాలా? అని తెదేపా అభిమానుల సూటి ప్రశ్న.
గెలిచినా ఓడినా, మన పతన మార్గాలు, పాపము మనల్ని వీడదు. చంద్రన్న, ప్రతి అడుగు ఆచి తూచి, విలువలతో ముందుకు నడచి, లోకేష్ భవిష్యత్తు ను బంగారు బాటలో ఉంచాలని అభిమానుల మనవి.
patana dova viduvani chandranna marala daggubati cini mohanbabu to dosti pukarlu marala kodali
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,412; 104 తత్వాలు (Tatvaalu) and views 253,853 Dt : 20-Sep-2022, Upd Dt : 20-Sep-2022, Category : Politics
Views : 522
( + More Social Media views ), Id : 1524 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
patana ,
chandranna ,
daggubati ,
movie ,
cini ,
mohanbabu ,
dosti ,
pukarlu ,
kodali Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments