కొత్త కమీషనర్ వచ్చినా ఒంగోల్ మున్సిపల్ పేజీ దుస్థితి, ఎన్నికల ఫలితాలు, అలాగే మిగతా మున్సిపాలిటీస్ - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1113 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

* అంగుళం అభివ్రుద్ది లేకపోయినా, అధికారుల పనితనం కదిలి
* కొత్త కమీషనర్ వచ్చారు, ఇప్పుడు మేయర్
* అభివ్రుద్ది పనులు రోజూ చూడవచ్చు అని
* పని చేయించలేని, అసమర్ధ మంత్రులు ఉన్నత అధికార్లు
* చీరాలా కనిగిరి అద్దంకి కందుకూర్ మార్కాపూర్?
* ఎన్నికలు, వార్డ్ మెంబర్లు గెలిచి, చైర్మన్ మేయర్
* ఎక్కడా సాక్ష్యం గా, ఒక్క ఫోటో ఒక్క రాత?
* డివిజన్ (వార్డ్) వైస్ ఎన్నికల ఫలితాలు?
* ఏ డివిజన్ లో ఎవరి గెలిచారు, మెజారిటి, పేరు, ప్రత్యర్ధి పేరు, ఫోటో?
ప్రకాశం (మరియు ఇతర జిల్లాల) కలెక్టర్, అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజల కు నమస్కరించి వ్రాయునది - ఇప్పుడైనా అంగుళం అభివ్రుద్ది లేకపోయినా అధికారుల పనితనం కదిలి, ప్రభుత్వ సోషల్ మీడియాలో, సాక్ష్యం ఏమైనా కనపడుతుందా ప్రవేట్ పేపర్ కొనని, సామాన్య ప్రజలకు?

OMC FB - కొత్త ఫోటోలు మాటలు ఆలనా పాలనా లేక, అనాధగా వదిలేయబడిన ఒంగోల్ కార్పొరేషన్ ఫేస్బుక్ పేజీ

జవాబు ఇవ్వగలరు, మా జగనన్న, అలాగే వ్రుత్తి, అలాగే ఆత్మ వంచన ఎరుగని, అధికారులు మరియు నాయకులు ఎవరైనా ఉంటే దయచేసి.

గత సంవత్సరం, ఒంగోల్ కార్పొరేషన్ పాత కమీషనర్ గారు వెళ్ళారు, కొత్త కమీషనర్ గారు రానూ వచ్చారు. ఇప్పుడు మేయర్ వచ్చారు.

పాత వారికీ మన విజ్ఞప్తులు పంపాము, సమాధానము కదలిక లేదు.

కొత్త మేయరు, డివిజన్ కార్పొరేటర్లు, బాలినేని, మాగుంట, కమీషనర్ ను ఫోటోలో చూడవచ్చు.

మా ఒంగోలు నగరానికి, అలాగే దాని ఫేస్బుక్ పేజీకి మహర్దశ పట్టి, భాగ్యలక్ష్మి దేవత కళ ఉట్టిపడుతుంది ఏమో అని, అభివ్రుద్ది పనులు రోజూ చూడవచ్చు అని, కలలో ఆశించాము ఆనందపడ్డాము. కానీ కల ఎన్నడూ వాస్తవము కాదు, అని ఇంకోసారి నిరూపితమైనది. పాత విన్నపము

అధికారుల చేత పని చేయించలేని, అసమర్ధ మంత్రులు మరియు ఉన్నత అధికార్లు, మున్సిపల్ శాఖా మంత్రి బొత్స, జిల్లా మంత్రి బాలినేని మరియు కలెక్టర్ భాస్కర్ గార్లు, అధి నాయకులు గా ఉంటే, ఆ జిల్లా పరిస్థితి ఎంత అధ్వాన్నముగా ఉంటుందో, ఆఖరుకి మున్సిపల్ అధికారులు కూడా, వారిని అలాగే ప్రజలను లెక్క చేయరు భయపడరు, అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఇంకో గట్టి దిక్కు లేక, పని చేయని ఉన్న నాయకత్వానికే, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించి, ఈ సారైనా బుద్దిగా మారతారా అని ఎదురు చూస్తున్నారు.

మా ఒంగోలు చీరాలా కనిగిరి అద్దంకి కందుకూర్ మార్కాపూర్ అలాగే మిగతా మున్సిపాలిటీ సోషల్ మీడియా చూడండి. ఏమైనా కదలిక కొత్త వార్తలు వారి పేజీలలో ఉన్నాయా, ప్రజలను గౌరవించి? పాత విన్నపము

అన్ని మున్సిపాలిటీస్ ఎన్నికలు జరిగాయి, చైర్మన్ లేదా మేయర్ ను ఎన్నుకున్నారు. డబ్బు పెట్టి బయట పేపర్ కొన్న వారు ఫోటోలు మరియు వివరాలు చూడవచ్చు తరించవచ్చు.

మరి కొనని వారు, స్థానిక మున్సిపల్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళి చూస్తే, అసలు ఎన్నికలు జరిగి, వార్డ్ మెంబర్లు గెలిచి, చైర్మన్ మేయర్ పదవి చేపట్టారు అని కానీ, ఎక్కడా సాక్ష్యం గా ఒక్క ఫోటో ఒక్క రాత కానీ కనపడదు. లింక్ లో ఒంగోల్ మున్సిపల్ ఫేస్బుక్ పేజీ దుస్థితి చూడండి, కొత్త కమీషనర్ వచ్చిన తర్వాత కూడా. చీరాల మున్సిపల్ ఫేస్బుక్ పేజీ, ఎక్కడైన మీకు కనపడితే లింక్ ఇవ్వగలరు.

దయచేసి ఒంగోల్ కార్పొరేషన్ డివిజన్ (వార్డ్) వైస్ ఎన్నికల ఫలితాలు, ఎక్కడ కనుగొనవచ్చు చూడవచ్చు చెప్పగలరా? ప్రభుత్వ వెబ్సైట్ లో ఉన్నాయా, ఉంటే? లింక్ ఇవ్వగలరా? లేదా పీడీఎఫ్ లేదా డాక్యుమెంట్ ఉందా?

ఏ డివిజన్ లో ఎవరి గెలిచారు, ఎంత మెజారిటి, పేరు, ప్రత్యర్ధి పేరు, ఫోటో తో సమాచారం ఎక్కడ ఉంది, దయచేసి తెలుపగలరు.

కార్పొరేషన్ ఫేస్బుకు లో, ఈ ఫలితాలు పెట్టారా? కొత్త కమీషనర్ గారు వచ్చినాక కూడా, ఫేస్బుక్ లో సమాచారం కనపడ లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. వేరే పేజీ మొదలుపెడితే, కొత్త లింక్ ఉందా?

ఇలా మిమ్మల్ని, మీడియా లేదా ప్రజలు అడగకుండా, మీ అంతట మీరే బాధ్యత గా, అందుబాటులో సమాచారం ఉంచలేరా? పై అధికారులు పట్టించుకోరా సరి చేయరా, కింది అధికారుల నిర్లక్ష్యం ను, ప్రజలకు జవాబుదారీ తనాన్ని.

ఈ ప్రభుత్వ వెబ్సైట్ కూడా పనిచేయడము లేదు, ఏమింది చూడగలరు. గతములో పని చేసింది, ఇప్పుడు సర్వర్ సమస్య ఉందేమో మరి. మున్సిపల్ శాఖ ఒంగోల్ వెబ్సైట్  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1113 General Articles, 47 Tatvaalu
Dt : 05-Apr-2021, Upd Dt : 05-Apr-2021, Category : Request
Views : 76 ( + More Social Media views ), Id : 1075 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : plight , ongole , corporation , social page , election results , commissioner , bhagyalakshmi , chirala , municipalities
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content