Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
మీకు రాష్ట్రం మొత్తం లో, అరుదైన ఉపయోగం లేని జిల్లా మంత్రి, అలాగే కలెక్టర్ కాంబినేషన్, ఎక్కడ ఉంటుంది అంటే? మీరు చెప్పగలరా?
మిగతా జిల్లా లు అంతే ఉండవచ్చు ఏమో, మీ మంత్రి ని కలెక్టర్ ను అడగండి.
ఆ సద్భాగ్యం భగవంతుడు, మా ప్రకాశం జిల్లా వాసులకు దయతో కల్పించారు, ఉపయోగం లేని మంత్రి బాలినేని అలాగే ఉపయోగం లేని కలెక్టర్ ని ఇచ్చి.
వారిద్దరూ మాత్రం సఖ్యత గా సహాయం చేసుకుంటూ ఉంటారు, అనుకూలముగా, ఎందుకంటే మంత్రి గారి పనులు కు కాంట్రాక్టు లకు అనుచరులు కు, ఎటువంటి ఇబ్బంది కలుగ కూడదు కదా. కొత్త కలెక్టర్ వస్తే, సాగుతాయో లేదో తెలీదు.
గతంలో కూడా గుర్తు చేశాం, ఇతర జిల్లా అధికారులు పని తీరు చూసైనా, ప్రకాశం అధికారులు కదులుతారేమో, తమ జీతాలు కు న్యాయం చేయడానికి.
అబ్బే, మంత్రి గారి అండ ఉంటే, ప్రధాని కూడా, ఏమీ చేయలేరు, మీ ఖర్మ కు వదిలేస్తున్నాం అని.
పాత సామెత, గుర్రం ను చెరువు దాకా నెట్టుకెళ్ళినా, నీళ్లు తాగించడం కష్టం అని. మా అధికారులు తో పని, జవాబు దారీ తనం అలాగే ఉంటుంది. కంచే చేను మేస్తే లాగుంది, బాలినేని పరిస్థితి.
అధికారులు అంతా, ప్రజాక్షేమం వదలి, కేవలం నాయకుల సేవ లో తరిస్తున్నారు. అందుకే పని చేయని ప్రజాక్షేమం పట్టని అధికారులు కు, జిల్లా స్వర్గధామంలా ఉంటుంది, హాయిగా ఉచిత జీతాలు సౌకర్యాలు, బదిలీ భయం బాధ ఉండదు, అడిగే వాడు ఉండరు.
బాలినేని గారి చల్లని నీడలో, ఇటువంటి నిర్లక్ష్య అధికారులు కు కొండంత అండ, మీడియా కు ప్రజలకు జవాబు చెప్పరు.
లేకపోతే చంద్రన్న హయాంలో సోషల్ మీడియా నడిపి, జగనన్న హయాంలో హఠాత్తుగా ఆపేసే, కలెక్టర్ లేదా సమాచార అధికారులు ఉంటారా?
ఒకవేళ ఉంటే, వారిని మార్చేసి, కొత్త వారితో జగనన్న పధకాలు, ప్రజలకు గ్రామ పట్టణ జిల్లా స్ధాయిలో ఏనాడో అందించేవారు. మనకు ఏం తక్కువ, అనంత జిల్లా కన్నా అని.
మంత్రి చెప్పకుండా, ఆత్మాభిమానం తో, పనిచేసే అధికారులు ఉంటే, మా జిల్లా లో, ఒకరైనా, ఏవండీ, మా శాఖను మాత్రం తప్ప పట్టవద్దు, ఇదిగో మా శాఖ, జిల్లా పట్టణ గ్రామ సమాచారం సోషల్ మీడియా లింకు అనేవారు.
ముందు తెలీదేమో అని మనం గుర్తు చేశాం. తర్వాత, తెలిసీ జిల్లా మంత్రులు అధికారులు అందరూ కలసి కట్టుగా, జగనన్న కు ద్రోహం చేస్తున్నారు, అని అధిష్ఠానం కు విన్నవించాము.
కానీ జిల్లా మంత్రి కి, అధికారులు కు నచ్చ చెప్పే ధైర్యం ఎవరికీ లేదు, వైసీపీ పార్టీలో కూడా.
అనంతపురం జిల్లా లాగా, ఇక్కడ ప్రకాశం జిల్లా అధికారులు కదలరు, బాలినేని కదిలించరు కదిలించలేరు.
జగనన్న కు ప్రచార పరంగా అన్యాయం ద్రోహం జరుగుతున్నా , బంధువు అయిన బాలినేని పట్టించుకోకుండా ఉన్నారు, 2 సంవత్సరాలు గా. అలాగే కలెక్టర్ మరియు జిల్లా అధికారులు, హాయిగా చోద్యం చూస్తున్నారు.
మచ్చుకు ఉదాహరణలు చూడండి
* చీరాల ఒంగోలు ఆసుపత్రి సదుపాయాలు, ఫోటోలు, వీడియో లింకు సోషల్ మీడియా ది ఇవ్వమంటే, ఆరోగ్య శాఖ అధికారులు పలకరు. సంవత్సరం గా చూస్తున్నారు ప్రజలు, కోవిడ్ ఆసుపత్రిలో దుస్థితి. నోటి మాటలే గాని, స్ధానిక ప్రభుత్వ సోషల్ మీడియా సాక్ష్యం లేదు.
* మా కలెక్టర్ ఏమి పని చేస్తున్నారు, లింక్ ఇవ్వండి అంటే, కనీసం జేసీ కూడా పలకరు. కడప, గుంటూరు, అనంత, చిత్తూరు, కృష్ణా కలక్టరేట్ కున్న పరిజ్ఞానం, ప్రకాశం కలెక్టరేట్ కు లేదా? లేదంటే శిక్షణ ఇప్పించాలి కదా, రెండు ఏళ్లుగా.
* మా ఎమ్మార్వో, ఆర్డీవో, డీఆర్వో ఏమి చేస్తున్నారు, సాక్ష్యాలు గా జిల్లా ప్రభుత్వ సోషల్ మీడియాలో లింక్ ఇవ్వండి అంటే, అందరూ వాట్సప్ ఆపేసి, శాఖ మొత్తం, సైలెంట్ అయింది.
* పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు ను, కబ్జా ల మీద పన్నులు వేసి ఆదాయం పెంచి, రాష్ట్ర అప్పులు తగ్గించండి, అంటే ఉలకరు పలకరు. ఆన్లైన్ పన్నులు లేవు. సోషల్ లింక్ లు పెట్టరు.
ఇలా ఎన్నో. దేవుడా నువ్వు అయినా, మా జిల్లా మంత్రి బాలినేని అలాగే కలెక్టర్ మనసు ను మంచి గా మార్చు, లేదంటే బదిలీ లు అయినా చేయించి, మా బతుకుల్లో, జగనన్న కల్పించిన ఆశా కిరణాలు ను వెలగనీయి తండ్రి, అని జిల్లా వాసులు కోటి దండాలు పెడుతున్నారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,485,320; 104 తత్వాలు (Tatvaalu) and views 266,857
Dt : 28-Apr-2021, Upd Dt : 28-Apr-2021, Category : Politics
Views : 993
( + More Social Media views ), Id : 1138
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
prakasam ,
district ,
minister ,
balineni ,
collector ,
bhaskar ,
negligent ,
friendship ,
no ,
development ,
public ,
welfare ,
sluggishness ,
official ,
functions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments