Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
దేవాలయాలపై జరుగుతున్న దాడులు పై నిరసన తెలియజేస్తూ, సనాతన ధర్మం పరిరక్షణ కోరుతూ, సెప్టెంబర్ 11 వ తేది శుక్రవారం సాయంత్రం, 5.30 నుంచి 6.30 మధ్య దీపాలను వెలిగిద్దాం అని జనసేన పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.
బీజేపీ జనసేన సమ్యుక్తముగా, వరుస గా రాష్ట్రంలో జరుగుతున్న, హిందూ వ్యతిరేక చర్యలు పై, నిరసన గళం వినిపించారు. ఇటీవల అంతర్వేది లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో, రధం కాలిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
అక్కడ నిరసనలు తెలియజేసే వారిని అరెస్టు చేసిన క్రమంలో, వారిని విడుదల చేయాలని బీజేపీ జనసేన విజ్ఞప్తి చేసాయి. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బిజెపి - జనసేన కూటమి, రాష్ట్రంలోని కలెక్టర్ మరియు RDO కార్యాలయాల ఎదుట, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా కార్యక్రమానికి కూడా, పిలుపునివ్వడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, హిందూ సోదర సోదరీమణులంతా తమ తమ ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
బిజెపి-జనసేన నిరసన దీక్ష, ఛలో అంతర్వేది పిలుపు కార్యక్రమాలతో ఉలిక్కిపడిన వైసిపి ప్రభుత్వం అంతర్వేది విచారణను సిబిఐకి అప్పచెప్పింది.
అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబిఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక, ఎవరు ఉన్నారో సిబిఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న, అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సిబిఐ ఆరా తీసి, ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి.
వీటితోపాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబిఐ ఆరా తీయాలి, అని జనసేన పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.
ఇరు పార్టీలు కూడా, గత మరియు నేటి ప్రభుత్వాలు, ఇతర మతస్థుల విదేశీ దైవిక ప్రయాణాలకు మరియు పూజారులు కు (మత గురువు/ పెద్దలకు) ధన సహాయం చేస్తున్నప్పుడు, ఇటువైపు కనీసం పేద హిందువులకు, కాశీ వంటి పుణ్యక్షేత్రాల సందర్శించడం కోసం, మరియు హిందూ పూజారులు పోషణార్ధం కు కూడా, ధన సహాయం ఎందుకు చేయవని ఇన్నాళ్లు గా, వైకాపా తేదేపా ను నిలదీశారు.
కనీసం దేశీయ హిందూ దేవాలయాలైన తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, బెజవాడ దుర్గమ్మ, సింహాచలం, అంతర్వేది, రామేశ్వరం, కాశీ, కేధారనాధ్, గంగోత్రి, మహా బలేశ్వరం, కలకత్తా కాళీ, బుద్ధుని గయ వంటి ప్రాంతాల సందర్శనకు సహాయం చేసిన బాగుంటుంది అని హైందవ పేద భక్తులు, తెల్ల కార్డులు ఉన్న వారి కైనా సహాయం చేయాలని, అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఇతర మత పాఠశాలలు ఉన్న విధంగా, హైందవ గురు పాఠశాలలు కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయాలని పలువురు అభిలషించారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,770,388; 104 తత్వాలు (Tatvaalu) and views 290,981
Dt : 10-Oct-2020, Upd Dt : 10-Oct-2020, Category : News
Views : 1341
( + More Social Media views ), Id : 689
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
protest ,
temple ,
attacks ,
conservation ,
sanatana dharma ,
light ,
lamps ,
friday ,
janasena ,
bjp ,
virraju ,
pawan ,
Deeksha ,
Dharna
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments