Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ శ్రీ గౌతం సవాంగ్ గారికి నమస్కారములు,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకున్న చర్యలను అమలు జరుపుటకు, చిత్తశుద్ధి తో, మీరు రాష్ట్రమంతా అమలు చేస్తున్న కార్యక్రమాలను, ప్రజలలో చైతన్య మును నింపుటకు, మీరు స్వయంగా పాల్గొని తీసుకుంటున్న చర్యలను, మేము విదేశాల నుంచి, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ఫేస్బుక్ పేజీ ద్వారా, ప్రతి రోజూ ఎన్నో మంచి విషయాలను తెలుసుకుంటున్నాము.
చాలా ఆనందిస్తున్నాము, గర్వ పడుతున్నాము. మా చీరాల మండలము లోని, స్నేహితులను బంధువులను దగ్గర వారిని, అప్రమత్తము చేస్తున్నాము, ధైర్యము చెపుతున్నాము.
ఈ వారములో, రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని, ప్రజల ప్రయాణ సమస్యను, చాక చక్యముగా పరిష్కరించారు. అలాగే ఇంకో ప్రాంతములో, ఒక ఎస్సై గారిని వెంటనే సస్పెండ్ కూడా చేసారు, అనవసరముగా బయట తిరిగే వారి మీద, లాఠీ చార్జ్ చేసారు అని.
అది మీరు మా లాంటి సామాన్యులకు ఇచ్చే గౌరవము విలువ మర్యాద, అందుకు ధన్యవాదములు. తప్పు జరిగితే, మన పోలీస్ వ్యవస్థలోని వారినైనా వదిలిపెట్టము అని, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు.
మా వీరకేసరి టంగుటూరి ప్రకాశం జిల్లా , ఎస్పీ కౌశల్ గారు కూడా (చిత్రము 3), ఎంతో కష్టపడుతూ, మీ ఆదేశాలను అమలు పరచాడానికి, నిరంతరము శ్రమిస్తున్నారు. ఒంగోలు పట్టణములో, నడి ఎండలో అర్ధరాత్రి అనక తిరుగుతూ, ప్రజలకు ధైర్యము చెపుతున్నారు.
ప్రకాశం జిల్లా పోలీసు ఫేస్బుక్ పేజీ ద్వారా, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము చూడ గలుగుతున్నాము. కొన్ని సార్లు, మా ప్రకాశం జిల్లా పోలీసు ఫేస్బుక్ పేజీ ద్వారా, మా చీరాల పట్టణ లేదా మండల పొలీసు చర్యల ఫోటోలు కూడా, చూడ గలుగుతున్నాము. కాని తక్కువగా ఎప్పుడో, కొన్ని సార్లు మాత్రమే.
మా తూర్పు సాగర తీర, చిన బొంబాయి, వస్త్ర మహా సామ్రాజ్యం, చీరాలలో కూడా, డీఎస్పీ సుబ్బారెడ్డి గారు కూడా (చిత్రము 4), శ్రద్దగా తన సిబ్బంది తో కలసి, ఎంతో కష్ట పడుతున్నారు, న్యూస్ పేపర్లో లోపలి పేజీ ల్లో చూసాము.
ఇప్పుడు ఈ కరోనా సమస్య వలన, మా చీరాల మండలములో ఏమి జరుగుతుంది, ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు, అని తెలుసుకోవాలి అని భయము ఆవేదన, అందరికీ కలుగుతుంది. అలాగే మా వారికి సమాచారము ఇవ్వాలి అని, తపన ఆత్రము బాధ, విదేశాలలో దూరముగా ఉన్న మా ప్రవాసులందరికి ఉంటుంది. అలాగే మండలములో, ఉన్న వారికి కూడా ఉంటుంది.
అదే విధంగా,
మా చీరాల (వీలైతే మిగతా మండలాలు కూడా) మండలమునకు కూడా ఒక అఫీషియల్ పోలీసు ఫేస్బుక్ పేజీని (లేదా వెబ్సైట్ ను) తయారు చేసి, చీరాల మరియు చుట్టుపక్కల గ్రామాల్లో, మా లోకల్ ఎస్సై, సీఐ, డీఎస్పీ గార్లు తీసుకుంటున్న చర్యలు జాగ్రత్తల ను నిరంతరమూ చూపిస్తూ ఉంటే, మాకు ఇంకా ఆనందంగా ధైర్యముగా ఉంటుంది.
మా మండల పోలీసు సోదరుల సాహస కార్యక్రమాలు కూడా వెలుగులోకి వస్తే బాగుంటుంది.
మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే, మా లోకల్ హీరోలు అయిన, వీరి కార్యక్రమాలు సేవలు త్యాగాలు, ఆ పేజీ లో అప్లోడ్ చేసిన, ప్రజలకు మరియు దూరంగా ఉన్న మాలాంటి వారికి కూడా, ఉత్తేజం ధైర్యము మనశ్శాంతి కలిగిస్తాయి. చీరాల మండల ప్రజలు కూడా, మా పోలీసులు ఇంత కష్టపడుతున్నారా అని తెలుసుకుని, చల్లని మనసుతో ఆశీర్వదిస్తారు, అండగా ఉంటారు.
న్యూస్ పేపర్లు తగ్గి, ఇప్పుడు ఎక్కువ మంది ఆన్లైన్ లోనే వార్తలు చూస్తున్నారు. న్యూస్ పేపరు వారు కూడా, ఈ చీరాల ఫేస్బుక్ పేజీ నుంచే, తేలికగా సమాచారము తీసుకుంటారు. అందరికి సమయము ఆదా అవుతుంది.
ఇది చాలా చిన్న కోరిక, మీరు గానీ, మా ఎస్పీ గారు కాని, మా చీరాల డీఎస్పీ గారు గానీ, సహ్రుదయము తో మంచి మనసు తో, దీని గురించి ఆలోచన చేసి, మా చీరాల మండల ప్రజల కోరిక తీర్చ ప్రార్ధన. మా చీరాల మండల పోలీసుల త్యాగాలు సేవలు, ప్రపంచానికి తెలియాలి, వెలుగు లోకి రావాలి.
మా చీరాల మీద ఉన్న ప్రేమతో అభిమానంతో, రాష్ట్ర సమస్యలు తో బిజీగా ఉండే మీకు, నేరుగా ఈ ఉత్తరము రాసే ధైర్యము చేస్తున్నాము. తప్పు ఉంటే క్షమించగలరు మన్నించగలరు. మా లాంటి వారి ఆవేదన అర్ధము చేసుకుంటారు అని ఆశిస్తున్నాము.
మా అందరి రక్షణ కోసం, మీ నాయకత్వంలో పాటు పడుతున్న రాష్ట్ర, మా ప్రకాశం జిల్లా, మరియు మా చీరాల మండల పోలీసు, సిబ్బంది అందరూ కూ, ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, వందనాలు.
ఇట్లు
పోలీసుల అభిమానులు, చీరాల మండల ప్రజలు మరియు ప్రవాసాంధ్రులు
మెస్సేజ్ టు - ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీ, చీరాల డీఎస్పీ మరియు సీఐ, మండల ప్రజలు
Update : May 3, 2020, sent the following message to Prakasam Collector, Joint Collector, Additional JC, APNRT, చీరాల ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ, ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని, బాపట్ల ఎంపీ సురేష్ గార్లకు కూడా మెస్సేజ్ పంపబడినది.
దయచేసి మీరు చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చేయగలరు. ఇది పోలీసు వారికే గాదు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ వారికి కూడా వర్తిస్తుంది.
మండల రెవెన్యూ అధికారులు అంటే, తహశీల్దార్ గార్లు, మున్సిపల్ కమీషనర్ మరియు గ్రామ పంచాయతీ కూడా, ప్రతి రోజూ తమ వెబ్సైట్ లేదా ఫేస్బుక్ పేజీ లో కరోనా లేదా ఇతర పనుల గూర్చి తీసుకుంటున్న చర్యలు, రెవెన్యూ పంచాయతీ మున్సిపల్ సిబ్బంది త్యాగాల గురించి, కలెక్టర్ గారు చేస్తున్న కృషి ని గురించి కూడా, మండల ప్రజలకు తెలియజేయాలి.
ప్రజలు ఇంకా ఎక్కువగా కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారి ని , పంచాయతీ సెక్రటరీ గారిని అభిమానించాలి. దయచేసి మా మండల ప్రజలకు సహాయం చేస్తారు కదూ.
గూగుల్ లో ఏవో కొన్ని, చీరాల మరియు ప్రకాశం ప్రభుత్వ ఫేస్బుక్ పేజీలు కనపడ్డాయి, కానీ వాటిలో రోజూ వివరాలు ఎక్కించడం లేదు. దీని గురించి, కొంచెం శ్రమ అనుకోకుండా, మా జిల్లా, మండల ప్రజలకు సహాయం చేయ ప్రార్థన. ధన్యవాదములు.
https://twitter.com/prakasamgoap
https://www.facebook.com/prakasamgoap/
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,190; 97 తత్వాలు (Tatvaalu) and views 199,708 Dt : 28-Mar-2020, Upd Dt : 28-Mar-2020, Category : Request
Views : 1076
( + More Social Media views ), Id : 454 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Corona ,
Covid 19 ,
Chirala Mandal ,
Prakasam District ,
Andhra Pradesh ,
DGP ,
SP ,
DSP ,
CI Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments