ట్రంప్ దారులు మూత, బైడెన్ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నిక, మొదటి వాక్సిన్ పంపిణీ - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,608; 104 తత్వాలు (Tatvaalu) and views 226,172.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

* అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ, కోర్టుల్లో లా సూట్లు వేస్తూ వస్తున్న ప్రెసిడెంట్ ట్రంప్​కు ఇక దారులన్నీ మూసుకుపోయాయి.

ఇప్పటికే పెన్సి ల్వేనియా, తదితర రాష్ట్రాల్లోని కోర్టులు ట్రంప్ లా సూట్లను కొట్టేయగా, సుప్రీంకోర్టు లోనూ ఆయనకు చుక్కెదురైంది.

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఆయన మద్దతు దారులు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇంకా.

* ప్రజల ఓట్ల తో బైడెన్ మరియు కమలా గెలిచిన విషయం తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్​గా, జో బైడెన్ ను, ఈ నెల 14న ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంది. ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ప్రసంగిస్తున్నారు టీవీలో. మొత్తంగా బైడెన్‌కు 306 ఓట్లు దక్కాయని కాలేజీ పేర్కొంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ 232 ఓట్లతో ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్స్ జనవరి 6 న సర్టిఫై చేస్తుంది, అక్కడ కూడా, నిరసనలు వ్యక్తం చేయవచ్చు, కానీ ఉపయోగం ఉండకపోవచ్చు.

అన్ని బాగుండి ముందుకు వెళితే, జనవరి 20 న ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ ఉత్సవానికి పాత అధ్యక్షుల సాంప్రదాయాన్ని పాటిస్తూ, ట్రంప్ వస్తారని ఆశిస్తున్నారు.

* అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కరోనాతో బాధపడుతున్న దేశానికి ఇక ఉపశమనం లభించనుంది. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు, పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వడంతో, అధికారులు టీకా పంపిణీ ప్రారంభించారు.

టీకా తొలి డోసు ఓ నర్సుకు అందించారు. దీంతో క్వీన్స్‌లోని, లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో, నర్సుగా పనిచేస్తున్న సారాలిండ్సే, అమెరికాలో తొలి టీకా పొందిన వ్యక్తిగా నిలిచారు.

వ్యాక్సిన్ రావడంతో, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు త్రంప్ సోషల్ మీడియా కేంద్రంగా ఆనందం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ వరల్డ్, కంగ్రాట్స్ అమెరికా అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,608; 104 తత్వాలు (Tatvaalu) and views 226,172
Dt : 14-Dec-2020, Upd Dt : 14-Dec-2020, Category : America
Views : 785 ( + More Social Media views ), Id : 857 , Country : USA
Tags : usa , presidential election , trump , biden , pence , kamala , lanes closed , electoral college win , first vaccine distribution

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content