Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. రాత మనది కావచ్చు, కానీ అసలు జ్ఞానం మూలం సంస్కారం, రుణం తీర్చుకోలేని మన అమ్మది నాన్నది, వారికి జ్ఞానం ఇచ్చిన తెలుగు గురువులది, వారికి జ్ఞానం ఇచ్చిన త్రిమూర్తులది, వారికి జ్ఞానం ఇచ్చిన ఆదిశక్తి ది.
ఈ పరంపర మూలం గుర్తు ఉంటే, రోజూ ఆచరణలో పాటిస్తే, అరిషడ్వర్గాలు మనల్ని ఏమీ చేయవు, కోతి మనసు చెవులు పట్టుకుని చేతులు కట్టుకుని గోడకుర్చీ వేస్తుంది చిత్తం మహాప్రభూ అంటూ, మహా మాయ మన దరిదాపులకు రాదు. జరగబోయేది మనకు స్పష్టం. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి, ఏదీ మనల్ని అంటదు. అలా జరిగిపోతూ ఉంటుంది. కేవలం సాక్షీబూతులం, చిరునవ్వుతో గమనించు, ప్రపంచపు పోకడ, మనుషుల మోహపు ఆటలు.
ఎందుకంటే విష్ణువు శివుడు 2 వైపులా మనకు అండ, మదిలోనే బ్రహ్మ నిండా, అణువణువునా ఆదిశక్తి ఉండ. ఇదే తెలుగు గురువులు బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన గార్లు చెప్పింది, దోవ చూపింది. ఏదీ మనది కాదు, ఏదీ మనతో రాదు, చుట్టూ మాయ, సమస్త అనంత ఆనందం నీ మనసులోనే ఉంది. పొగడ్తలు తెగడ్తలు అన్ని ఆయనవే.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే ఊహించి గ్రహించి స్మరించి, తాళ పత్ర గ్రంథాలలో స్వయముగా రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ, బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పోలేరమ్మ తల్లి చే నిప్పు తెప్పించారు, మరలా క్షమాపణలు చెప్పారు.
ఇలా చెప్పినవారి పేర్లు అనేకం ఉన్నా, ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్. ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం. ఆయన చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లానే మర్మంగా ఉంటాయి.
నేటి యువత కు ఇవి తెలీదు, తమ తాతలను తండ్రులను మరచి, ఆశ్రమాలలో ఇంట్లో ఒంటరిగా క్రుతజ్ఞత మరచి వదిలిన విధముగా, తెలుగు గురువుల గురించి చెప్పడం వినడం మానేసారు.
సరైన అవగాహన, పెంపక సంస్కారం లేని, నేటి యువత, పరాయి భాషల బాబాయి పై, మన బలహీన మనసుల పతనం పెట్టుబడిగా పెట్టి, తెలుగు గురువులకే నిలువ నీడ లేకుండా చేస్తున్న, మన తెలుగు ఆత్మ ద్రోహులు చేస్తున్న (నిర్మించిన), ఊరికి 4 మందిరాల వ్యాపార మోహ సామ్రాజ్యానికి, బానిసలై, తన మన మరచి, అబ్బో అన్ని బ్రహ్మం గారే చెప్పారు అంటా, అని అంటున్నారు.
ఆ లిస్ట్ ఒకేసారి ముందే ఇవ్వండి అయ్యా, అంటూ జోకులు మొదలు పెట్టి, తమ బతుకులే జోకులు చేసుకుంటున్నారు.
తుమ్మితే దగ్గితే ఆసుపత్రి, 10 ఏళ్ళకే కళ్ళ జోడు తెల్ల జుట్టు, కరోనా కు మంచం పొద్దుగూకులు కంచం ప్రతి పనికి లంచం, ఏటి ముందు పెళ్ళి ఏటి తర్వాత మళ్ళి, చదువు ముక్కున బెట్టు పరీక్ష తర్వాత చీదు, తల్లి అల్లం పెళ్ళాం/ ప్రేయసి బెల్లం, నోటికి మంత్రము/ శ్లోకము రాదు, వాక్సుద్ది వక్కపొడి, అరగంట ధ్యానం కు రెప్పలు మూయలేరు, గంట బ్రమల నుంచి బయటకు రాలేరు, ఏదీ ఓ 3 గంటలు మనసుపెట్టి కుదురు గా కూర్చుని శ్రద్ద పెట్టి పని చేయలేరు, ఈ కరోనా వీరులు, వీరి సొంత తాతలను ఎగతాళి చేస్తారు.
అందుకే, బ్రహ్మం గారు అదీ చెప్పారు - వెంపలి చెట్లకు (అంటే చిన్న చెట్లు కు కూడా) నిచ్చెనలు వేసేటి, గొప్ప తెలివిగల వీరులు మున్ముందు వస్తారు అని. అప్పుడే మనము చూస్తున్నాము, కరోనా పుణ్యమా అంటూ, 2 ఏళ్ళు ఊరక పాస్ చేసావు, ఇప్పుడు ఎందుకు చేయవు, మా బతుకులు ఎలా? అని నిలదీస్తున్నారు, కొంచేము కూడా మతి లేకుండా. మీ అమ్మ నాన్నను పెద్దలను ముత్తాతలను అవమానిస్తూ, నువ్వు నవ్వితే, పోయేది నీ జాతి వంశము పరువే, నీకే పతనం అని, ఈ మూర్ఖులు తెలుసుకోరు.
ఆఖరికి మా అమ్మ అంటా నన్ను 9 నెలలు మోసిందట, ఎలా మోసిందో ఇంత మనిషిని, నేను నమ్ముతానా అనేంత, అధిక తెలివికి వచ్చారు, వారి పెద్దలు తెచ్చారు. వారిని అనేకన్నా, ధన సంపాదన మోహములో, వారి బద్దక తల్లి దండ్రులు తెచ్చారు అనడం కరెక్ట్. మనము ముళ్ళ చెట్టు విత్తనాలు వేస్తే అదే మొలుస్తుంది, అదే జామ చెట్టు విత్తనాలు వెస్తే, తినడానికి జామకాయలు ఇస్తుంది కదా.
ఇవి సినిమాలోవి అని తీసి పారేయద్దు. అసలు గ్రంధము లో ఉన్నవే, నేరు గా భవద్గీత శ్లోకములాగా అవి చెపితే అందరికీ ఎక్కవు. కాబట్టి, వాటిని తెలిక మాటలు గా ఇలా చెపితేనే, ఇంకా సగం మందికి అర్ధము కావు సుమా. ఒక్క సారి మనసారా పాడుకుంటూ చదవండి, మన తాతల గొప్పతనము క్రుతజ్ఞతలతో 10 మందికి చెప్పండి.
ఇదే మనము దేవుని చేసే మానసిక నైవేద్యం, దీనికే ఫలితము ఉంటుంది సుమా. ఆర్భాటముగా వండి పెట్టే తిండికి కాదు, ఆయన ఇచ్చిన తిండి ఆయనకు పెట్టడం గొప్పనా? ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన బిడ్డలకు పంచి, చీకటి నుంచి వెలుగుకు తెచ్చే ప్రయత్నమే, మానసిక నైవేద్యం. వాగడం చాలా మందికి తేలిక, కాని మనసుతో మంచి గా తెలుగు లో రాయమనండి, వేళ్ళు కదలవు.
1. హరి హి ఓం….. హరి హి ఓం…….
నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట వేదామయా 2
పాత ఆచారాలు పట్టు తప్పీపోయి, పాతాళ హోమమై పోతాయయా
కపట నాగరికమ్ము స్త్రీ లోకమందున, తలవిప్పుకుని తాండవిస్తుందయా
నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట వేదామయా….!
జుట్టు బొట్టు కట్టు, వ్యవాహరములోన వల్లమాలిన, మార్పులోచ్చేనయా 2
స్త్రీ పురుష బేధాలు, తెలియకుండా పోయి, వింతైన వేషాలు వేస్తారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
నగలుపెట్టుకొనుట, నామోషి అయ్యెను, బోసిమెడలా తోటి తిరిగేరయా
సిగలు జడలూ, చెడ్డ మోటుగా తలచేరు, క్రాఫింగులతో బయటికోచేరయా
నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట వేదామయా….!
కన్నబిడ్డలకు పాలివ్వడం మానేసి, బుడ్డి పాలు పోసి పెంచేరయా
భర్తకూ బిడ్డలకూ, వండి పెట్టుట వదలి, వంట వాళ్లకు అప్పగిస్తారయా
నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట వేదామయా….!
అధిక సంతతి వలన, అందాలు చెడునని, ఎన్నెన్నో బదవలు పడతారయా
మందుమాకులుతిని, ఆరోగ్యములు చెడి, అష్టకష్టాల పాలవుతారయా
నందామయ గురుడ నందామయ, వీరబ్రహ్మం మాట వేదామయా….!
ఉమ్మడి కుటుంబంలో, కాపురం చేయక, వేరు పడుటకు దార్లు వెతికేరయా
అత్తలు కోడళ్ళు, జుట్లు జుట్లూ పట్టి, కాపురంలో చిచ్చు పెడతారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
మగవారి పెత్తనం, దిగజారి పోయెను, మహిళా సమాజాలు లేచేనయా
మహిళా సమాజాలు లేచేనయా
మగని నెత్తిన, ఇంత మట్టి చల్లేసి, విడాకులకు సిద్ధమేనంటారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా
ఆస్తిలో మగవాడికాధిక్యమేమని సమతకై ఘర్షణలు జరిపేరయా
ఉద్యోగమ్ములు చేసి ఊళ్లేలవలేనని, స్వేచ్చకై పధకాలు వేస్తారయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేరు, మద్యమాంసాలు విధులమ్మేరయా
వైశ్యుండు చెప్పులా వ్యాపరుమునకుదిగు, సూద్రుండు పందులూ పెంచేనయా
నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయా….!
2. హరి హి ఓం…. హరి హి ఓం….హరి హి ఓం….
వినరా వినరా ఓ నరుడా……!
బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల ఙ్ఞానం కల్ల గాదురా
వినరా వినరా ఓ నరుడా……!
చదివాం చదివాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారు
మూధత్వంతో మూగజీవులను, రాళ్ళకు ఎందుకు బలి ఇస్తారు…
వినరా వినరా ఓ నరుడా……!
ఒరుల పచ్చనకు ఒర్వగలేరు, ఒళ్ళు వంచి పనిచేయగలేరు ..
తేరగ వస్తే తిందామంటూ, తిన్నింటివాసలె లెక్కపెడతారు…
వినరా వినరా ఓ నరుడా……!
ప్రభుత్వమ్ములే మారెను, ప్రజా రాజ్యమే వచ్చేను
చట్టాలెన్నో తెచ్చేను, జనులను తికమక పెట్టేను
వినరా వినరా ఓ నరుడా……!
బ్రహ్మం మాట పొల్లుబోదురా కాల ఙ్ఞానం కల్లగాదురా
వినరా వినరా ఓ నరుడా……!
సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు చేస్తే వేడుక పన్ను
కాలం తీరి చచ్చాడంటే. . , ఉన్నది ఊడ్చుకు పోయేపన్ను
వినరా వినరా ఓ నరుడా……!
ఎక్కువ బిడ్డలకనడం తప్పని వితండవాదం చేస్తారు, పిచ్చి శాసనాల్ చేస్తారు…
పచ్చగ పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరితీస్తారు
వినరా వినరా ఓ నరుడా……!
భూమికి చట్టం పరిమితి పెట్టి, ఉన్నది ఊడగొడతారు
రైతే వెన్నెముకన్న దేశాన, ఆ రైతుకే ఘోరి కడతారు
వినరా వినరా ఓ నరుడా……!
బ్రహ్మం మాట పొల్లుబోదురా కాల ఙ్ఞానం కల్లగాదురా
వినరా వినరా ఓ నరుడా……!
అప్పెగొడ్డం తప్పుకాదని, అధికారంగా చెబుతారు..
అప్పులు పుట్టక పేదసాద, అలో లక్ష్మణ అంటారు
వినరా వినరా ఓ నరుడా……!
గోదావరి తీరమ్మునందు, ఒక బాల సన్యాసి వెలసెను
అన్నహారలేవి ముట్టక, ఆశ్చర్యము కలిగించెను
వినరా వినరా ఓ నరుడా……!
పెను తుపానులతో భుకంపాలతో, ధరణి దద్దరిల్లి పోయేను
మత కలహాలతో కుల వైరాలతో, నెత్తుటేరులు పారెను
వినరా వినరా ఓ నరుడా……!
ఆదోనిలో అద్భుతమ్ముగా, కప్ప కోడివలె కూసేను
శ్రీశైలంలో రాతి బసవయ్య, కాలు దువ్వి రంకేసేను
కాలు దువ్వి రంకేసేను…
3. హరిహి ఓం … హరిహి ఓం…. హరిహి ఓం… హరిహి ఓం
శివ గోవింద గోవింద… హరి గోవింద గోవింద….
ఉత్పాతములు ఎన్నో ఉత్పతిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను
అంతు పొంతూ లేని ఆపదల దేశంబు, అల్లకల్లోలమై పోయెను
శివ గోవింద గోవింద…….
హంపిలో హనుమంతుడాగ్రహమ్మున లేచి, ఆర్బాటముగా కేక వేసేను
ఆ కేకలకు జనులు అదరిపోయేను, ఆకు రాలినయట్టు రాలిపోయేను…
శివ గోవింద గోవింద…….
హైదరాబాదును మూసి మాహానది, వరదతోటి ముంచి వేసేను
బావులు చెరువులు నీళ్ళు లేక ఎండి, క్షామ దేవత తాండవించెను
శివ గోవింద గోవింద…….
ఉదయగిరిలో ఒక కాన్పుకే ఒక భామ, ఏడ్గురు పిల్లల్ని కంటుంది
సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి, గ్రామాలనే మార్చివేస్తుంది
శివ గోవింద గోవింద…….
ఉన్నవాళ్లు, లేనివాళ్ళు, ఒక్కటే అని, సామ్యవాదము పైకి వస్తుంది
బంగారమే కంటికగుపడక మాయమై, ఇత్తడికి ఆధిక్యమోస్తుంది
శివ గోవింద గోవింద…….
శ్రీ గిరి మల్లయ్య దేవాలయమ్ములో, పట్ట పగలే ముసళ్ళు దూరెను
తిరుపతి వెంకన్న, గుడి నాల్గురోజులు, పూజలేక మూతపడెను
శివ గోవింద గోవింద…….
తిరుపతి కొండపై జలధార పుట్టి, అందరికి ఆధారమయ్యేను
అమెరికా దేశాన భుకంపములు పుట్టి, పట్టణాలకే చేటు వచ్చేను
శివ గోవింద గోవింద…….
ఆరేండ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా, మగచిన్నవాడు జన్మించేను
వేప చెట్టుకు అమృతబిందువుల రీతిగా, పాలు కారే రోజు వచ్చేను
శివ గోవింద గోవింద…….
ధరణి పట్టని జనం, తల్లకిందులుగా పెరిగి తిండి, గుడ్డ చాలకుండెను
తెరమీద బొమ్మలే, పరిపాలనకు వచ్చి, అధికారమును చేలయించెను 2
శివ గోవింద గోవింద…….
కంచికి పడమర, గాండ్లవారి ఇంట, కామధేనువు ఒకటి పుట్టెను
పల్నాటి సీమలో ప్రజలవంచన చేసి, ద్రవ్యమంతా ఒకడు దోచెను
శివ గోవింద గోవింద…….
గండికోటను, మందుగుండు ప్రేలిపోయి, జన నష్టమే సంభవించెను
కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడేను, నెల్లురునకు ముప్పు వచ్చేను
శివ గోవింద గోవింద…….
వొంగుతు లేచేటి, ఈత చెట్టుని చూచి, లోకులంత పూజ చేసేరు
వెనుక జన్మములోన, జరిగిన కథలన్నీ, మూడేళ్ళ బాలుడు చెప్పేను
శివ గోవింద గోవింద…….
యాగంటి బసవయ్య, అంతకంతకు పెరిగి, కలియుగాంతమున రంకె వేసేను 2
వీరభోగ వసంత రాయుడుగ నేవచ్చి, దుష్ట శిక్షణ అపుడు చేస్తాను
4. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ,
గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః
నరుడా.. నా మాట నమ్మరా., సద్గురుని బోధ, మనసులోన మననం చేయరా
సూర్య చంద్రులు నిలచేవరకూ, చుక్కలు మింట మొలిచేవరకూ
మనిషి చేసిన మంచి ఒక్కటే, చెరిపివేసినా చెరగబోదురా
నరుడా.. నా మాట నమ్మరా., సద్గురుని బోధ, మనసులోన మననం చేయరా
పరమాత్ముని పూజించు . ., నిరుపేదల ప్రేమించు.
పెద్దల సేవించు . ., బుద్దిని అదుపులో ఉంచు .
హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం
హింసను విసర్జించు, శాంతిని ఆశ్రయించు
ధర్మము పాటించు, నీతిని పాలించు
హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం
నడవడి దిద్దుకో, ధాన్యం నిలుపుకో - హరిహి ఓం, హరిహి ఓం
జ్ఞానము పెంచుకో, సత్యము తెలుసుకో - హరిహి ఓం, హరిహి ఓం
మరల జన్మ మెత్తకుండ, మార్గము కని పెట్టు
వీర గురుడు దాచకుండ, వివరించును ఈ గుట్టు
హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం
జ్ఞానం శరణం శరణం, సంఘం శరణం శరణం, ధర్మం శరణం శరణం
మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.
veerabrahmendra-swamy-charitra-nandamaya-guruDa-vinara-vinara-onaruda-sivagovinda-govinda-naruda-namata-nammara
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,479; 104 తత్వాలు (Tatvaalu) and views 253,856 Dt : 15-Jul-2022, Upd Dt : 15-Jul-2022, Category : Songs
Views : 1439
( + More Social Media views ), Id : 1464 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
madvirat ,
brahmendra ,
brahmam ,
swamy ,
charitra ,
movie ,
ntr ,
nandamaya ,
guruDa ,
vinara ,
onaruda ,
sivagovinda ,
govinda ,
naruda ,
namata ,
nammara Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments