సినిమా లో విలన్, జీవితములో హీరో, సోనూ సూద్ ప్రజలకు అండగా - హీరో, ఎమ్మెల్యే, ఎంపీ కన్నా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,954; 104 తత్వాలు (Tatvaalu) and views 226,217.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* హీరోలు ఏమైనా, లక్షలు ప్రజలకు దానము చేసారా, సేవా కార్యక్రమం లో

* వీధి నాటకాలు లో వరుస 3 గంటల పాత్ర ధారులు కష్టం ముందు గాత్ర పటిష్టత ముందు

* ఎమ్మెల్యేలు, ఎంపీలు అఫిడవిట్ లో కోట్లు ఆస్ధులు, బాంకు ల నుంచి అప్పులు వ్యాపారం జన ధనము తో

* ప్రాంత భాషా బేధాలు లేకుండా. ఓట్లు కు సంబంధం లేదు, సాయం పొందే జనానికి
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మన చుట్టూ పక్కల, సినిమా హీరోలు అంటే, చెవులు ముక్కు వేళ్ళు కోసుకునే ఆస్తులు అమ్ముకునే, అర్థం లేని అభిమానులు వందలు వేలు ఉంటారు. హీరో ని ఒక్క మాట అంటే, ఊరుకోరు. ఎందుకు ఆ హీరోని ఆరాధిస్తారో, వారికే సరిగ్గా తెలియదు. హీరోలు ఎమైనా, లక్షలు ప్రజలకు దానము చేసారా, సేవా కార్యక్రమం లో పాల్గొన్నారో కూడా చూడరు.

మరలా తమ సొంత తల్లి దండ్రులు ను, పట్టించుకోకుండా తిరుగుతారు. వీధి నాటకాలు లో వరుస 3 గంటల పాత్ర ధారులు కష్టం ముందు గాత్ర పటిష్టత ముందు, సినిమా హీరో కష్టం తక్కువ అని వారికి తెలీదు. ఏదైనా అదంతా నటన, యాక్టింగ్ అని తెలుసు, కానీ ఏవో పిచ్చి భ్రమలో ఉంటారు.

వారు కేవలం రీల్ హీరో, నిజ జీవితంలో హీరో కాలేరు. సినిమా లో ప్రాణాలు ఒడ్డి, జనానికి సాయం చేస్తారు. అదే బయట జన సహాయము అంటే భూతద్దంలో వెతకాలి, సాయం కు మచ్చుకి కనపడరు, కోట్లు జనాల మీద సంపాదించినా.

అలాగే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అఫిడవిట్ లో చూడండి, కోట్లు ఉంటాయి ఆస్ధులు అప్పులు ఎంతో ఉంటాయి. వేలు విదిలిస్తారు తమ నియోజకవర్గ జనాలకు సేవ అని, కేవలం ఓట్లు కోసం. మిగతా ఖర్చు కోసము, చందాలు డొనేషన్లు అవసరాల జనం దగ్గర నుంచి సేకరణ, బాంకు ల నుంచి అప్పులు తో వ్యాపారం జన ధనము తో. గుడ్డిగా అనుచరులు అదే గొప్ప అని, పాలాభిషేకం పాదాభివందనం.

అక్కడ ఇక్కడ అంతా మాయాజాలం, నటన. వీరంతా గొప్ప హీరోలు, మాయలో ఉన్న మనకు. వీరి కోసము ప్రాణ త్యాగాలు.

కరోనా కష్ట కాలంలో విలక్షణ నటుడు, సినిమా లో విలన్, నిజ జీవితములో హీరో, సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచాడు. అరుంధతి సినిమాలో మాంత్రికుడు, నిన్ను వదల బొమ్మాళీ అంటారు చూడండి, ఆయనే ఈయన. షుమరుగా ఆయనకు ఉన్న 130 కోట్ల ధనములో, ఇప్పటి వరకు ఇలాంటి తెలియని ఇతరుల సహాయమునకు, 10 కోట్లు ఖర్చు చేసారు.

ఆపదలో వున్నవారిని, వారి వారి గమ్య ప్రాంతాలకు చేర్చాడు. తానున్నాననే అభయం ఇస్తున్నాడు, చాలా విషయాలలో, ప్రాంత భాషా బేధాలు లేకుండా. ఓట్లు కు సంబంధం లేదు, ముంబైలో ఉండే తనకు సాయం పొందే జనానికి, సంబంధం లేదు అసలు.

తాజాగా చిత్తూరు జిల్లా రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ని అందించారు. ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలన్నింటినీ, గుర్తు చేసుకుంటూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, నెటిజన్లు ఇంటర్నెట్ లో. దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు, మోరు మ్రోగుతుంది.

ప్రభుత్వము, ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోనప్పుడు, ఇలాంటి మంచి మనుషులే పట్టించుకోవాలి. మరి అది మనకు చిన్నతనము కదా, ఆలోచన చెయ్యాలి.

మన చుట్టుపక్కల కూడా, కోట్లు, జనం నుంచి దోచుకున్న వారు, ఉన్నారు. అదృష్టం కలసి వచ్చి, ధనలక్ష్మి అండతో వెలుగుతున్న వారు, ఉన్నారు. కానీ సంబంధంలేని జనాలకు గాని, ఇతర బంధువులు కు కానీ, ఉచితంగా రూపాయి వెచ్చించరు.

మంచి పనులు కు సాయం చేయరు. చివరకు ఉచితంగా, ఎవరికో వదిలేసి వెళతారు, పాపభారం తో.

మనకి ఉన్న వాక్కు అయినా, సంపద అయినా, జ్ఞానం అయినా, పలుకుబడి అయినా, అంతా దేవుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి, భగవంతుని బిడ్డలు అయిన అందరికీ అంతో ఇంతో నిస్వార్థంగా పంచనిదే, అది చివరి దాకా రాదు మిత్రమా. బంధువులో, బిడ్డలో దానిని భ్రష్టు పట్టిస్తారు, కడకు ఊరోళ్ళ పాలు.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,954; 104 తత్వాలు (Tatvaalu) and views 226,217
Dt : 28-Jul-2020, Upd Dt : 28-Jul-2020, Category : General
Views : 774 ( + More Social Media views ), Id : 617 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : villain , movie , real life hero , sonu sood , help people , more than , movie hero , mla , mp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content