Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. చూడండి, మా ఇంటి నాలుగు వైపులా రాత్రి పూట కాపలా కాస్తున్నాము రెండు ఏళ్లుగా. మామయ్య స్ధలం, మా ఇంటి వెనుక, పక్కన ఇల్లు సందు, ముత్యాల ఎదురు రోడ్డు.
అప్పుడు అప్పుడు, ఓ 5 నిమిషాలు చూస్తాము. ఓ రాత్రి పూట 11 గంటలకు కారు వచ్చింది, ఒకరు దిగి, కాలేజీ అబ్బాయి తో మాట్లాడి వెళ్ళారు. అంత రాత్రి అవసరమా తెలీదు, మనకెందుకు లేండి. కానీ ఆగింది, మన చెట్టు ముందు.
పగలు అయితే చెట్లు, ఇంటి రంగులు తెగిపోయిన కర్టన్లు, మా బజారు లోని మనుషులు, వాకింగ్ వెళ్ళే వాళ్ళు, అందరూ కనపడతారు. నిన్న అక్క పిన్ని, మాటలు కూడా చూసాము.
మరి రాత్రి పూట, మనం నిద్ర పోతుంటే, మనకు కాపలాగా ఉన్నారు అని, ఎవరైనా అక్కడకు వచ్చినప్పుడు, కనీసం అర్థ రూపాయి చాక్లెట్ ఇచ్చారా?
అందుకే మనల్ని దేవుడు మెచ్చితే చాలు. మన మంచి పని, మనం కొనసాగించాలి, ఎవరేమి అన్నా కూడా. ఎప్పుడూ తిట్టేవాళ్ళు, పొగిడే వాళ్ళు ఇద్దరూ ఉంటారు కదా. రెండు ఏళ్లుగా, మా బజారు ఉచిత కాపలా వ్రతం కూడా చేస్తున్నాము.
మరి మామయ్య, బాబాయి, ముత్యాల కుటుంబం, అపార్ట్మెంట్ వారు మంచిగా సహకరిస్తారా? 5 ఏళ్లుగా లేనిది, ఇప్పుడు వస్తుందా ఆ సహకారం అంటారు. పగటి కలలు కనొద్దు అంటారు, అంతే కదూ.
చెప్పండి దూరంగా ఉండి, జన్మ భూమి కి కాపలా ఉంది ఎవరు, ఎంత మంది అలా ఉంటారు? ఇంటర్నెట్ కెమెరాలు, లేకుంటే నష్టమా మనకు? అక్కడ ఏముంది, అంతా చుట్టాలు, బాంకు లు, స్ధలం లో ఉంటుంది కదా. ఇల్లు తీసుకుని పోయినా, దొంగలు స్ధలం తీసుకుని వెళ్ళలేరు కదా? అని మోహం లో ఉన్న వారు అనుకుంటారు.
కళ్ళు తెరిచి చూస్తే ఆలోచన చేస్తే, మా ఊరు జనానికి ఓ రూపాయ అయినా ఇవ్వాలి ఇస్తూ ఉండాలి. కరెంట్ కు ధనం కట్టాలి. నన్ను తిట్టేవాళ్ళు ను పొగిడే వాళ్ళ ను, మా ఊరి జనాన్ని అందరినీ చూడాలి.
గుర్తు ఉంది కదా, పోయిన సారి ఖాళీ ఇంటికి రంగులు, స్లాబు ఎందుకు? 2 లక్షల ఖర్చు ఎందుకు, బాబాయిని పీడించి మరీ తీసుకుని?
మా ఊరి జనం కోసం, వాళ్ళ రుణం తీర్చుకోవడం లో అది ఖర్చా లేదా మనకు ఉపయోగమా అని ఆలోచన చేయకూడదు. దేవుడు ఇవ్వాలి, ఇంకో వైపు వదలాలి.
మరి మనల్ని కూడా మోసం చేసేవారు ని ఏమి చెయ్యాలి? దేవుని కే వదలి వేయాలి, మీరే చూస్తున్నారు కదా కర్మ ఫలితాలు వదలవు.
ఈ రెండు నెలల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. గత పది ఏళ్లుగా ఎన్నొ ఉదాహరణలు ఉన్నాయి. కర్మఫలం విడువదు గాక విడువదు.
ఎవరైనా నన్ను, పదేళ్ల క్రితం తిట్టావు కదా అంటే, దండం పెట్టి, క్షమాపణ చెబుతా అంతే. సాక్ష్యం తో 500 బాకీ ఉన్నావు అంటే, క్షమాపణ చెప్పి, 1000 ఇచ్చి పంపుతా. వాళ్ళ కన్నీళ్ళు కు మనం ఏనాడూ కారణం కారాదు. మీకు తెలుసు, రూపాయి అప్పు లేదు దేవుని దయవలన.
అందుకే, ఇప్పుడు దేవుడు రమ్మన్నా నవ్వుతూ వెళతా. నన్ను ఏ బాంకు లేదా మనిషి, ఎగకొట్టారు అనదు అనకూడదు. అప్పు ఉంటే, పూర్వ జన్మ మూట వెంట పడుతుంది కదా.
మీ అందరికీ రెండు నుంచి పదేళ్ళు గా చెబుతోంది అదే. మనం మోహం లో చూసే కోణం ఫలితాలు వేరు, దేవుని ఆలోచన కోణం ఫలితాలు వేరు.
దయచేసి బుల్లి కరోనా చెల్లి ని తిట్టకండి, మన రాక్షస బుద్దులు అలవాట్లు, సరిచేయడానికి వచ్చిన దూత ఆమె.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,393; 104 తత్వాలు (Tatvaalu) and views 253,853 Dt : 24-Mar-2020, Upd Dt : 24-Mar-2020, Category : General
Views : 977
( + More Social Media views ), Id : 439 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
native place ,
help people ,
night watchman Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments