తప్పు ప్రజాస్వామ్యందా? అమెరికా, బ్రిటన్ ప్రజాస్వామ్యం లో, ఇలా వంగి వంగి దండాలు పెట్టరు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1092 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1120 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రభువులు అంటారు. నాయకులు కూడా, ప్రజల నుంచే వచ్చారు. కాబ్ట్టి ప్రజాస్వామ్యం లో లోపం లేదు. అది ఆచరణలో పెట్టే, మన ప్రజల ఆలోచన లోనే, లోపం ఉంది.

పాశ్చాత్య దేశాల్లో, సామాన్య వ్యక్తి, అపాయింట్ మెంట్ తీసుకుని, ఎమ్మెల్యే, ఎంపీలు ను తేలికగా కలుస్తారు. అసలు కలవాల్సిన అవసరం, కూడా లేదు. మా స్నేహితులు విదేశాల్లో ఉన్నారు, 20 ఏళ్లుగా. ఎప్పుడూ నాయకులు తో పని పడలేదు, వ్యవస్థ అంత బాగా పనిచేస్తుంది కదా?

ఎన్నికలలో గెలవక ముందు, అందరూ ముక్యమంత్రి దగ్గర నుంచి వార్డ్ కౌన్సిలర్ వరకు, ఇంటికి వచ్చి మరీ, ప్రజలకు వంగి వంగి అవసరం తో, దండాలు దస్కాలు పెడతారు.

ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి, మంచి వారిని గెలిపిస్తే, ఆ 5 ఏళ్ళు నాయకులు, ప్రజలకు గౌరవం క్రుతజ్ఞలుతో, భక్తితో దండం పెడతారు, బాధ్యతతో అభివ్రుద్ది పనులు చేస్తారు.

కానీ మనం పెడదోవ బట్టి, మన వర్గం అవకాశం ధనం నేరాలు కేసులు అవసరం ను మాత్రమే, చూసి ఓటేస్తున్నాము, దురాశకు అమ్ముడుపోతున్నాము.

కాబట్టి, ఆ తర్వాత ప్రజలు, ఎమ్మెల్యేలు కు అధికారులు కు, దండం పెడతున్నారు భయంతో, అవసరం తో, అజ్ఞానంతో, అవకాశవాదం తో, తప్పనిసరై, తాము చేసిన తప్పుకు చింతిస్తూ ఎన్నో ఏళ్ళుగా. కానీ తమ తప్పు మాత్రము, తాము సరి చేసుకోరు.

అలాగే అదే పద్దతిలో, ఎమ్మెల్యేలు మంత్రులు కు, దండం పెడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి కి దండాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కి దండం పెడుతున్నారు.

చూస్తున్నాము గదా, డిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకున్న కేసీయార్, చంద్రన్న, జగనన్న అని వార్తలు. అధికారం లో ఉన్నప్పుడు అబద్దము అని వీరు అంటారు, కాదు అని వారు అంటారు.

గౌరవం తో పెడితే తప్పు లేదు. కేవలం, అవసరం అవకాశం భయం తో పెడుతున్నారు.

తప్పు, ప్రజాస్వామ్యందా? కాదు కదా? అమెరికా, బ్రిటన్ ప్రజాస్వామ్యం లో, ఇలా వంగి వంగి దండాలు పెట్టరు. అసలు నాయకులు ను జనం పట్టించుకోరు ఎన్నికల తర్వాత, ఆ అవసరం రాదు.

మారాల్సింది మనం. పవిత్ర మైన ఓటు ను, ఉత్తములకు ఓటు వేస్తే, మన గురించి ఆలోచన చేసి, మనకు మంచి చేస్తారు. చదువు కోని వారికి, అర్థం కాని మన ఇరుగు పొరుగు కు, నచ్చ చెప్పాల్సిన బాధ్యత మనదే కదా. వద్దు అనుకుంటే, నష్టపోయేది మనమే, మన ఊరే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1120 General Articles, 47 Tatvaalu
Dt : 17-Dec-2020, Upd Dt : 17-Dec-2020, Category : General
Views : 122 ( + More Social Media views ), Id : 865 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wrong , democracy , american , british , democracy , bending head , wish , need
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content