చీరాల పోలీసులకు, ఆమంచి చేతుల మీదుగా, బులియన్ మర్చంట్ అసోసియేషన్ వారి వితరణ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,210,212; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఈ రోజు, దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్రములోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లోను కాకుండా, వారి కనీస అవసరాలు తీర్చే విధముగా, ప్రభుత్వము ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, వైయస్సార్సీపీ నాయకుల ద్వారా ఆయా ప్రాంతాలలో, సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఆదేశాలమేరకు, ప్రతి చోట రాష్ట్ర స్థాయిలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

అదే విధముగా, చీరాల నియోజకవర్గములో కూడా, వైయస్సార్సీపీ ఇంచార్జి, ఆమంచి కృష్ణమోహన్ గారి పిలుపు మేరకు, అన్ని ప్రాంతాలలో, వైయస్సార్సీపీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, బియ్యము, కూరగాయలు పంపిణీ చేయుచున్నారు.

కరోనా మహమ్మారి వలన, రాత్రి పగలు కస్టపడి పనిచేయుచున్న, పోలీసుల కు, ఈ రోజు చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు, 11 రకాలైన కూరగాయలు, వారము రోజులు సరిపోయే విధముగా, చీరాల నియోజక వర్గము లోని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ నందు గల, 400 మంది పోలీసులకు, మహిళా పోలీసులకు, ఆమంచి గారి చేతుల మీదుగా, చీరాల బులియన్ మర్చంట్ అసోసియేషన్ వారి సహకారముతో, ఉచితముగా పంపిణీ చేయటం జరిగినది.

ఈ సందర్భంగా, లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి, కరోనా ని కట్టడి చేయటంలో ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ గారి సారధ్యంలో, ప్రకాశం పోలీస్ మరీ ముఖ్యంగా చీరాల పోలీస్, చేసినటువంటి కృషిని కొనియాడారు.

ఈ కార్యక్రమములో వన్ టౌన్ సిఐ నాగమల్లేశ్వర రావు గారు, టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు గారు, రూరల్ సిఐ ఫిరోజ్ గారు, ఎస్సైలు మరియు పోలీస్ సిబంది పాల్గొన్నారు.

ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగొరీ గారు, డైరెక్టర్ కనపర్తి బజ్జిబాబు, పట్టణ కన్వీనర్ యడం రవి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు మరియు ఇతర వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,210,212; 104 తత్వాలు (Tatvaalu) and views 244,575
Dt : 20-Apr-2020, Upd Dt : 20-Apr-2020, Category : News
Views : 1168 ( + More Social Media views ), Id : 511 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chirala Police , amanchi , one town , two town , rural police , Bullion Merchant Association

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content