చీరాలలో టైగర్ లాగా తిరుగుతూ, కరోనా సమయములో జనానికి ధైర్యం చెపుతూ ఉంటే - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చీరాల ఎమ్మెల్యే శ్రీ కరణం గారికి, నమస్కారములు. మేము మీ అభిమానులం కూడా. ఇంతకు ముందు, ఒక ఆర్టికల్ రాశాము, దయచేసి గెలిపించిన ప్రజల మీద జాలితో, కనీసం 4 రోజులు అయినా, చీరాలలో ఉండరా, అని ప్రజల తరపున వేడుకుంటూ.

కరోనా కష్ట సమయంలో, ప్రజలకు అండగా చీరాల లో ఉండకుండా, శ్రీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ వదలి హైదరాబాద్ లో ఉన్నట్టు గా, మీరు అతిధిగా వచ్చి వెళుతున్నారు అని. చంద్రబాబు గారి కన్నా, మీరు నయమే ఈ విషయములో. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి గారు, 60 ఏళ్ల వయసు లో కూడా, తిరుపతి ప్రజల కు, కరోనా సమయంలో అండగా ఉన్నారు తిరిగారు నగర వీధుల్లో. ఇంకోవైపు వారి అబ్బాయి అభినయ్ కూడా తోడుగా నీడగా ఉన్నారు, ఆర్టికల్ అందరూ చదివారు ఫోటో ల సాక్ష్యం తో.

కానీ మీరు ఊరికి అతిధి అవడము వలన, మీ ప్రత్యర్ధులు కు, మంచి ఆయుధం అందించారు. అలా ఉండకూడదని, మీ మరియు మాలాంటి అభిమానుల ప్రార్ధన, విన్నపము. జవాబు మరియు మార్పు లేదు.

విలేఖరుల ము ఢిల్లీ, హైదరాబాద్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా లో ఉండి కూడా, వార్తలు రాయవచ్చు. ఎందుకంటే మాకు ప్రభుత్వం మరియు ప్రజలు జీతం, సౌకర్యాలు ఇవ్వరు, మేమూ ఆశించము కాబట్టి. మన ఊరు మరియు జిల్లా క్షేమం, బయట ఉండే వారే కోరుతూ ఉంటే, మరి నాయకులు మరియు అధికారులు, ఎంత ఎక్కువ ప్రజల మంచి కోరాలి? ఎంత సేవ చేయాలి? మరి వారి సౌకర్యాలు అనుభవిస్తూ కూడా, కనీసము ఊళ్ళో ఉండరా అద్దెకు?

కానీ మీరు చీరాల ప్రజల తరపున, ఎమ్మెల్యే గా గెలిచి, అధికార హోదా మరియు జీతం మరియు సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అద్దంకి మిమ్మల్ని కాదన్నా పొమ్మన్నా కూడా, చీరాల ప్రజలు, ఆమంచి గారిని ని కాదని, మిమ్మల్ని అక్కున చేర్చుకున్నారు దీవించారు. ఎంత ఋణపడి ఉండాలి మీరు, ఎంత క్రుతజ్ఞత చూపాలి మీరు? దానిని మూణ్ణాల ముచ్చట చేసి, మన అభిమానులు ను నిరాశ పరుస్తారా? ఇలాంటి పనుల వలన, మన యువ నాయకులు వెంకటేష్ బాబు రాజకీయ భవిష్యత్ ను, చీకటి చేస్తారా? ఆలోచన చేయండి.

ఈ రోజు న మీరు ఎమ్మెల్యే గా కలెక్టర్ ను, మంత్రి గారిని, ఇతర అధికారులు ను కలుస్తున్నారు, అంటే అది చీరాల ప్రజల భిక్ష కాదా, అని సవినయంగా ప్రజలు అడుగుతున్నారు. ఇది జగనన్న ఆశయాలు కు, మచ్చ తలవంపు కాదా?

ఇప్పుడు అయినా చీరాలలో ఒక అద్దె ఇల్లు అయినా చూపించి, నాలుగు రోజులు ఉండి, నాలుగు ఫోటోలు పెట్టి, మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్ధన. క్రికెటర్ సచిన్ ఆట ఆడేటప్పుడు, ఆయన కు బదులు గా, వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడితే, జనం మెచ్చరు.

మీరు చీరాలలో టైగర్ లాగా తిరుగుతూ, జనానికి ధైర్యం చెపుతూ ఉంటే, యువ నాయకుడు మన వెంకటేష్ బాబూ, మీ వెంట తిరుగుతూ ఉంటే, కన్నుల పండగ గా ఉంటుంది అని అభిమానుల ఆశ ఆకాంక్ష. మీరు చీరాలలో లేని మిగతా 3 రోజులు, వెంకటేష్ బాబు తోడుగా ఉంటారు మాకు, అని ప్రజల కోరిక.

అలాగే, మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీ స్వాములు గారి, ఇసుక ఆరోపణలు గురించి రాస్తే, ఆయన ధైర్యంగా, డీఎస్పీ గారిని కలిసి, ఆయన జవాబు వీడియో ఫేస్బుక్ లో పెట్టి, ప్రత్యర్ధుల ఆరోపణలను ఖండించారు నోరు మూయించారు. విలేఖరుల ను ఆయన ఏమీ అనలేదు, ఎందుకు అంటే, మేము కేవలం విన్న వార్తలు, రాసే వారిమే కాబట్టి, నిమిత్త మాత్రులము కాబట్టి.

పోతుల సునీత గారి ఇంటి గురించి ఆక్షేపిస్తూ రాయలేము, రాయము కూడా. ఎందుకంటే కొత్తపేట లో ఇల్లు ఉంది అని అందరికీ తెలిసిన సత్యం. నిన్న ఇంట్లో నుండి, బయటకు వస్తున్న వీడియో కూడా పెట్టారు. చాలా బాగుంది వీడియో. ఇంక చీరాలలో ఎన్ని రోజులు ఉంటారు అన్నది ఎమ్మెల్సీ గా వారి ఇష్టం. రేపు మరలా ఆ పదవి పొడగింపు వద్దు అనుకుంటే, ఎక్కువ రోజులు ఇక్కడ ఉండరు కదా.

కానీ ఎమ్మెల్యే గా మీరు ప్రజల మనిషి, చీరాల ప్రజలలో తిరగాలి, ఇక్కడ ఉండాలి. ప్రత్యర్ధులకు సిమ్హ స్వప్నముగా ఉండాలి. ఒకవేళ, పెద్ద వయస్సు తిరగలేక చీరాల ఇంట్లో ఉన్నాను కదా అన్నా తప్పు లేదు.

నిన్న కలెక్టర్ గారి వెబ్సైట్ లో కూడా, మీ ఒంగోలు అడ్రసు చూసాము. ఎలక్షన్ కి ముందు అక్కడ ఆ అడ్రసు ఉన్నా కూడా, ఇప్పుడు దయచేసి చీరాల ఇల్లు అడ్రసు పెట్టి, చీరాల ఓటర్లు ను, అభిమానులు ను సంతోషింప చేయ ప్రార్ధనలు.

ఇట్లు మీ అభిమానులు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 19-May-2020, Upd Dt : 19-May-2020, Category : Request
Views : 693 ( + More Social Media views ), Id : 552 , City/ Town/ Village : Chirala , State : AP , Country : India
Tags : chirala , mla , karanam , tiger walk , confidence , people supporter , corona covid time , venkatesh babu , amanchi , potula , tirupati , bhumana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content