పాటతో పరమార్ధం - జగదానంద కారక - శ్రీరామ రాజ్యం - బాలకృష్ణ, నయనతార, ANR, శ్రీకాంత్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,341,541; 104 తత్వాలు (Tatvaalu) and views 253,877.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Jagadananda Karaka - Sri Rama Rajyam - Balakrishna, Nayanthara, ANR, Srikanth, Ilaiyaraaja, Bapu ఇళయరాజా, బాపు

Seeing Rama in Ayodhya and seeing their dream come true after 500 years, the people with happiness singining as - Jagadananda Karaka, Jaya Janaki, Prana Nayaka, good welcome, Priya Paripalaka - thinking of Ramas rule and the fortune of the good-hearted people of that time. You, too, sing with those sweet words given by God, and will encourage family to sing the song.

అయోధ్యా రాముని చూసి, 500 ఏళ్ళ తర్వాత సాకారమైన తమ కలను చూసి, జనమంతా, జగదానంద కారక, జయ జానకి, ప్రాణ నాయక శుభ స్వాగతం, ప్రియ పరిపాలక అని ఆనాటి రామ పాలనను, ఆ నాటి మంచి మనసు గల ప్రజల అద్రుష్టాన్ని తలచుకుని పొంగిపోయారు. మీరూ కూడా, దేవుడు ఇచ్చిన ఆ మధుర పలుకులతో ఓ సారి పాడి వినిపిస్తారు కదూ, ఇంటిల్లి పాదినీ పాడమని ప్రోత్సహిస్తారు కదూ.

జగదానంద కారక, జయ జానకి ప్రాణ నాయక
ఆ ఆ జగదానంద కారక, జయ జానకి, ప్రాణ నాయక
శుభ స్వాగతం, ప్రియ పరిపాలక..- 2 సార్లు

మంగళకరమవు నీ రాక, ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే, ఇక పావనమవు గాక
నీ.. పాలన శ్రీకారమవు గాక, సుఖశాంతులు సంపదలిడు గాక
నీ రాజ్యము, ప్రేమసుధామయమవు గాక ||జగదానంద||

సార్వబౌమునిగ, పూర్ణ ఖుమ్బములు, స్వాగాతాలు పలికే.
రాజ్యమేలమని, ధర్మదేవతే, రాగమాల పాడే..
నాల్గు వేదములు, తన్మయత్వమున, జలధి మారు మ్రోగే.
న్యాయ దేవతై, శంఖ మూదగా, పూల వాన కురిసే.
రాజమకుటమే వొసగెలే, నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశం సింహాసనం, పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మి, ఈ పాద స్పర్శకి, పరవశించే పోయే..||జగదానంద 2||

రామ పాలనము, కామధేనువని, వ్యోమసీమ చాటే.
రామ శాసనము, తిరుగులేనిదని, జలధి బోధ చేసే..
రామ దర్శనము, జన్మ ధన్యమని, రాయి కూడా తెలిపే..
రామ రాజ్యమే, పౌరులందరిని, నీతి బాటనడిపే..
రామ మంత్రమే తారకం, బహు శక్తిముక్తి సంధాయకం
రామ నామమే అమృతం, శ్రీ రామకీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే, లోక రక్షయని, అంతరాత్మ పలికే..

జగదానంద కారక, జయ జానకి, ప్రాణ నాయక
శుభ స్వాగతం, ప్రియా పరిపాలక - 2 సార్లు
మంగళకరమవు నీ రాక, ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే, ఇక పావనమవు గాక
నీ.. పాలనా శ్రీకారమవుగాక, సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము, ప్రేమసుధామయమవు గాక
జగదానంద కారక, జయ జానకి, ప్రాణ నాయక
శుభ స్వాగతం, ప్రియా పరిపాలక  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,541; 104 తత్వాలు (Tatvaalu) and views 253,877
Dt : 02-Feb-2024, Upd Dt : 02-Feb-2024, Category : Songs
Views : 362 ( + More Social Media views ), Id : 1997 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Jagadananda , Karaka , Sri , Rama , Rajyam , Balakrishna , Nayanthara , ANR , Srikanth , Ilaiyaraaja , Bapu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content