Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Join the group. Talked to elders/ leaders, as honorary members. More publicity and respect for what you do?
*ఏమండీ మీరు మా సంఘము/ సమూహం/ పార్టీ లో చేరండి. పెద్దలతో/నాయకులతో మాట్లాడాము, గౌరవ సభ్యులుగా ఉండవచ్చు, అంగీకరించారు. మీరు చేసే పనులకు ఇంకా ఎక్కువ ప్రచారం, గౌరవము అందుతుంది, పెద్దల పరిచయం ఉంటుంది. మీలాంటి చిత్రమైన ఉదాహరణ, ఆదర్శం, ఆచరణ, మాకు ఎక్కడా దొరకడం లేదు, సమాన స్తితిలో, స్తిరముగా, 9 ఏళ్ళుగా. మాకు, కనీసం ఒక్క మంచివారికి అయినా అవకాశం ఇచ్చాము అని, ఆత్మ సంత్రుప్తి ఉంటుంది. మీకు మనస్పూర్తి గా ఇష్టమైతేనే సుమా. ఎందుకంటే, మీ రచనలు సూటిగా హ్రుదయాన్ని తాకుతున్నాయి. ఇవి జనం పాటిస్తే, ఇంక 3 పాదాల పైన ధర్మం ఉంటుంది. ఈ కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటులు ఉండవు. పిల్లలకు/ యువతకు అర్ధాంతర పతనాలు, అలాగే పెద్దలకు ముదుసలి వయసు కష్టాలు ఉండవు.*
జవాబు - ధన్యవాదాములు, మీ మనసుకైనా కొన్ని మాటలు హత్తుకున్నందుకు, మీ అభిమానం చూపించినందుకు. దేవుడు మీకు మంచే చేస్తారు, మీరు మన బాటలోకి మారి ఆచరణలో చూప గలిగితే. కానీ మన్నించాలి.
చాలమంది చెపుతారు, మీవి చదివాము/ చదవలేదు, బాగున్నాయి/ బాగోలేదు అని. ఎన్నో సార్లు ఎంతో మందికి చెప్పాము, మీకు పంపేదాని అర్ధము మీకు తెలియడం లేదు. మా గురించి మంచా చెడు నా, మీరు చదివారా చదవలేదా అన్నదానికి, అసలు విలువ లేదు. మరి దేనికి విలువ ఉంది?
మీరు ఆచరణలో గత 1-5-10 ఏళ్ళుగా మీ గురించి మీరు, ఆత్మ జ్ఞానం సంస్కారం దైవ భీతి తో, సొంతగా ఏమి చెప్పారు, ఏమి చేసారు అన్నదానికే విలువ - అంటే మీ స్పందన జవాబు కూడా 1. మా ముదుసలి తల్లి దండ్రులకు 5 ఏళ్ళుగా సజీవ గురువు సేవ చేస్తున్నాము, 2. 108 ప్రదక్షిణాలు చేస్తున్నాము, 3. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదు ఇవి 5 ఏళ్ళ ఉదాహరణలు, 4. లక్షల రామకోటి రాశాము, 5. శనివార నియమం 5 ఏళ్ళు గా ఉంది, 6. అప్పు/ ద్రోహం/ మోసం/ కపటం/ నటన/ 2 నాల్కలు లేదు, 7. శాఖాహారం తింటున్నాము, 8. చాప నిద్ర చేస్తున్నాము, 9. మందులు వాడే అవసరం లేదు, 10. మా సంస్కార పిల్లల దగ్గర, మా ముదుసలి తనం దేవతలుగా పూజింపబడుతున్నది, 11. మానసిక బలం ఉన్నది, అని చెప్పే, గుణ సంస్కార ధైర్యం మీకు ఉందా లేదా?
మరి ఇంకో 10 ఏళ్ళు కైనా, మిత్రులు, బంధువులు కు, చెపుతారా? చెప్పకపోతే, ఎవరికి నష్టం? మీకా, మాకా? రేపు ముదుసలి తనం లో అయినా, మీరు వీటికి జవాబు చెప్పాలి చెప్పి తీరాలి, అవే మీ వెంట పడతాయి, ఎటూ తప్పించుకోలేరు.
రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ లాంటి గొప్పవారు, మన ఇంట్లో అలాగే మన చుట్టుపక్కల వారు - వీరంతా పంచభూతాలకు, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే వెళ్ళారు. మీరు మేము తప్పించుకోగలమా, ఆత్మకు జవాబు చెప్పకుండా? ఆత్మ ద్రోహం ఒప్పుకోకుండా?
నేడు మాకే అంటే మిత్రులు బంధువులుకు చెప్పలేనప్పుడు, దేవుని ఎదుట మీరు చెప్పగలరా? మరి ఎన్ని జన్మలకు మనకు ఆ ధైర్యం వస్తుంది అన్నది, ప్రతి ఆత్మ, తనకు తాను ప్రశ్నించుకోవాలి.
ఇంకో మాట కూడా చెపుతాము, మీరు మా మోహములో, మేము మీ మోహములో కూడా పడకూడదు అని. మమ్మల్ని, మోహములో పెట్టే ప్రయత్నము కూడా, మీరు చేయవద్దు అని. ఎందుకంటే అది మీకు ఇంకా ఎక్కువ పాపం. తా చెడ్డ కోతి వనమెల్ల చెడిచింది అన్న సామెత లెక్కన ఉంటుంది. అంటే మనకు మానసిక బలం నియంత్రణ లేదు, అది ఉన్నవారిని కూడా బలహీనం చేస్తాము అన్నది రాక్షస ఆలోచన. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ వంశాన్ని విడువరు కదా?
మేము ఇలాగే మా దోవలోనే ఉంటే, మీకు లేదా ఇతరులకు నిస్వార్ధంగా ఉపయోగపడగలం, మీ భవిష్యత్ పంచభూతాల శిక్షణ చెప్పగలము. కానీ మేము దోవతప్పితే, మీకు ఎటూ ఉపయోగం లేదు కదా? దానివలన మీరు సాధించేదేమి ఉంది? శూన్యం, అని అందరికీ నచ్చ చెపుతాము.
మీరు చేస్తున్నది, మీరు ఉన్నది, ప్రాపంచిక మోహ/ వ్యామోహ పదవిలో. వాటిని పొందే అర్హత మాకు లేదు, అవసరం లేదు, దానికి మేము తగము, తగిన న్యాయం చేయలేము. దేవుడు మమ్మల్ని శిక్షిస్తారు. ఎందుకంటే, మాకు అవసర అవకాశాలను బట్టి మాటలు మార్చడం చేతకాదు, కళ్ళ ఎదురు జరుగుతున్న తప్పును ఎత్తి చూపకుండా ఉండలేము, అది 80 శాతం మందికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడితే, మీకే రేపు ఇబ్బంది. కాబట్టి మీ మోహ పద్దతిలో మీరు ఉంటూ, మా ఆధ్యాత్మిక పద్దతిలో మేము ఉండటమే, ఇరువురికి ఉత్తమము.
ఒకవేళ మేము చేరితే, మీ సమూహ సభ్యులను కూడా, అప్పుడు నేరుగా అడుగుతాము - ఏది మీ సజీవ గురువు సేవ అని, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ ఏది అని. ఓరి నాయనో, మనమే కోరి కొరివిని తెచ్చుకున్నామా, అవి అంటే ఆ బానిసత్వమే లేకపోతే అసలు మన సమూహమే ఉండదే, ధన పంపిణీ లోగుట్టు వ్యవహారాలు ఉండవే, ఇప్పుడు మన ముదుసలి అమ్మ నాన్న అత్త మామను తెమ్మంటే సేవ చెయ్యమంటే మనమేమి చెయ్యాలి అని, నటీ నటుల రాజకీయ నాయకుల సేవ వద్దు అంటే ఎలా అని, మీలో అభధ్రతా భావన బయలు దేరుతుంది. అది మీలో 80 శాతం మంది తట్టుకోలేరు, భరించలేరు.
పిలిచిన అన్ని సమూహాలలో మేము ఉండలేము, అదొక తలనెప్పి మరలా. మీ కన్నా మీ సమూహములో పెద్దలతోనే, మాట్లాడుతున్నాము అని, మీకు తెలియకపోవచ్చును. మరి వారు గమ్ముగా ఉన్నారు కదా?
కాబట్టి, మేము మీ సమూహములో, పదవి కి పనికి రాము, మాకు ప్రాపంచిక వ్యామోహ అర్హత లేదు, మేము అనర్హులం, తగిన న్యాయం చేయలేము. మాకున్న ఆధ్యాత్మిక అర్హత, మీ సమూహానికి, ఈ రోజు ఈ వయసులో పనికి రాకపోవచ్చును. కానీ భవిష్యత్ లో తప్పక కావాలి.
మీ మంచితనముతో మీరు ఆహ్వానించినా, మన అవసరము అక్కడ లేదా ఎక్కడా ఉండకూడదు. మన్నించాలి అందుకే. అది దైవ నిర్ణయం కాదు. మన పనులు మాత్రమే, అందరికీ తెలియాలి, వారి ఆత్మను వెలిగించాలి, ముదుసలి వారికి అలాగే సంస్కార పిల్లలకు అండగా ఉండాలి. మన గురించి కాదు ప్రచారం కావలసింది. అందుకే మీరు ఎక్కడ కూడా, మన ఫోటో కానీ, పేరు కానీ చూడరు, ఉండదు, అవసరము లేదు.
ఒక దీపం తో ఇంకో దీపం వెలిగించి, ప్రతి ఇంట్లో/ సంఘములో/ పార్టీలో ఆ దీపాన్ని అనుసరించి మిగతా దీపాలు వెలగాలి. అదే వికేంద్రీకరణ. అంటే, మీకు మా మాటలు అర్ధం అయ్యి, అవి మీరు మీ కుటుంబ/ సంఘ/ పార్టీ సభ్యులకు చెప్పి, వారి చేత ఆచరణలో చేయించగలిగితే, ఇంక మాతో పని ఏముంది?
మీ సంఘమే, మీ మనసులే, శుద్ది అవుతుంది. అలాగే మిగతా సంఘాలు, తమకు తాము శుద్ది చేసుకుంటే? కాబట్టి, మా బదులుగా, మీరే ఆత్మ జ్యోతిని వెలిగించుకుని, మీ సమూహములో మిగతా ఆత్మ జ్యోతులను వెలిగించే ప్రయత్నము చెయ్యండి. అప్పుడు మీతో మేము మరియు దేవుడు ఉన్నట్లే. అది మీకు ఆత్మ సంత్రుప్తే కదా. నమస్కారములు, ధన్యవాదములు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,477; 104 తత్వాలు (Tatvaalu) and views 254,484 Dt : 20-Aug-2023, Upd Dt : 20-Aug-2023, Category : General
Views : 380
( + More Social Media views ), Id : 1885 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Join ,
group ,
Talked ,
leaders ,
honorary ,
member ,
publicity ,
respect Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments