మసూరి బియ్యమో రామచంద్రా అంటూ అమెరికా లో పరుగులు తీసిన తెలుగు ప్రవాసులు, ఇచ్చి ఆదుకుందాం - General - లోకం తీరు/ News / NRI
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,859,347; 104 తత్వాలు (Tatvaalu) and views 224,278.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Let us support the Telugu expatriates who ran in America for Sona Masuri rice

ఇలా మీరు కూడా తోటి వారికి సందేశాలు పంపి, వారికి అండగా ఉండి, నర సేవ యే నారాయణ సేవ గా, రుజువు చేస్తారు కదూ? పంచ భూతాల్లారా, మా పాపాలు క్షమించి అన్నం దొరికేటట్లు చేయండి, ఇక నుంచి అయినా బుద్ది గా ఉంటాము.

భారత దేశములో నెలకొన్న, పంట తక్కువ పరిస్తితుల కారణం తో, కొన్ని రకాల బియ్యాల ఎగుమతిని నిలిపి వేసారు. అది ఇండియా హక్కు, మనమైనా అంతే కదా, మన ఇంటి లో తింటానికి ఉంటే, ఇంకో ముద్ద పెడతాము ఇతరులకు. విదేశాలలో మన బియ్యం తినే వారి పరిస్తితి, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్న సామెత గా తయారు అయ్యింది.

మన ఆంధ్రులు కూడా, మన వంతు పాపముగా అహంకారముతో, అమరావతి లేదా ఇతర చోట్ల, చుట్టుపక్కలా 3 లేదా 1 పంటల లేదా బీడు పొలాలను నిర్ధాక్షిణ్యముగా కాంక్రీట్ చేసి, భవిష్యత్ తరాలకు అంటే మన మనవళ్ళకు తిండి లేకుండా చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది, ఇంకా చేయాలని, తక్కువ సమయములో కోట్ల ధనం రాబడికి, ఆరాటపడుతున్నది అందరికీ తెలుసు. వీరికి తెలిసిన ధర్మాన్ని కాపాడటం ఇది మాత్రమే.

పంట బియ్యం లేకపోయినా, డబ్బులు నోట్లు చిల్లర నాణాలు పదవి అధికారం తిని బతక వచ్చు అని మన బ్రమ లేదా మన పెట్టుబడి మాత్రమే ఇక్కడ మన కుటుంబాలు విదేశాలలో కదా ఉండేది మనకేమి నష్టం అన్న తెలివి తక్కువ తనం కావచ్చు. కానీ సోనా మసూరి బియ్యమే కావాలని ఆఖరికి ఆంధ్రులు (దక్షిణ భారతానికి చెందిన అందరూ దాదాపుగా), వారి పిల్లలు, మనుమలు కూడా స్వార్ధం తో మనసులు గుభాళించి, సంస్కార పెంపకం పెల్లు బికి, అమెరికాలో పరుగులు తీసారు. ముందు మనము, తర్వాత బతికి ఉంటే ఇతర జనం అన్న వారి ఇంటి సంస్క్రుతిని చాటారు.

ఇక ప్రవాస భారతీయులు, ముఖ్యముగా అమెరికా లో డల్లాస్ వర్జీనియా కాలిఫొర్నియా లాంటి ఎక్కువ భారతీయుల సాంద్రత ఉన్న ఇతర ప్రాంతాలలో, ముఖ్యముగా దక్షిణ దేశస్తులు, ఇక బియ్యము దొరకవేమో అని, ఆఘమేఘాల మీద పరుగులు తీసి, ఎన్ని బస్తాలు దొరికితే అన్ని కొనడానికి ఎగబడ్డారు, తమ చేతిలో ఉన్న అధిక ధనముతో. 20 డాలర్లు ఉన్న బస్తా రేటు 50 డాలర్లకు ఎగబాకి, స్టాక్ మొత్తము మాయం అయ్యింది కొన్ని చోట్ల. ఉత్తర భారతం వారూ, కనీసం కప్పు అన్నం అయినా తింటారు. చక్రాలు దోశెలకు బియ్యం పిండి ఏదో ఒకటి కావాలి.

వరద బాధితులు లేదా కరువు ప్రాంతములో ఆహారం దొరకని వారు, ఆకలికి తట్టుకోలేక ఎలా తపన పడతారో, ఒకరి మీద/ముందు ఒకరు ఎక్కి తొక్కుకుంటూ తోసుకుంటూ అలా, అంతకన్నా దిగజారి సాఫ్ట్వేర్ ఇంజినీర్లము లేదా వ్యాపారస్తులము అని బడాయి చెప్పుకునే వారు కూడా, మన పరువు గంగలో కలుపుతూ, ఉచ్చ నీచాలు మరచి స్వార్ధం పెల్లుబికి శుక్రవారం రోజే, వీలైనన్ని తప్పుడు దోవలలో, తోటి సోదర సోదరీమణులకు ఇక బియ్యము దొరకని పరిస్తితికి తెచ్చారు - అందరూ కొంటున్నది సోనా మసూరి బియ్యం. అది దొరకక పోతే, మిగతా బియ్యం మీద పడ్డారు. ఇతర దేశాల వారికి ఏమి జరుగుతుందో, ఎందుకు ఈ పెద్ద లైన్లో అర్ధం కావడం లేదు.

అందరూ దేవుని సంతానమని, అన్ని అందరికీ పంచాలి అని, వారు మరచి పోయారు. ఇదే అరిషడ్వర్గ బానిసత్వం. వీరు చేసే పూజలు యాగాలు యాత్రలకు ప్రయోజనం లేదు. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని ఇలా అధిక బియ్యం, ఎక్కువ ఇళ్ళు స్థలాలు వ్యాపారాలు కొని, అన్ని గుప్పెట పెట్టుకుని, ఇతరులకు అవి దొరక కుండా చేస్తే, అది మనకు ఇంకా పాపం, మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది. మనము ఇంకో దాంట్లో చిక్కుకుంటాము, పతనము అవుతాము. ఇతరుల ఏడుపు పై, మనము కోటలు కడదామా, ఆనంద పడదామా?

పరిస్తితులు అందరికి అన్ని వేళలా అనుకూలముగా ఉండవు సుమీ, పెద్ద పెద్ద వారే, పంచభూతాల ముందు తల వంచారు. సంస్కారం లేని వారికి ఇది ఇప్పుడు అర్ధం కాదు, మా డబ్బు మా ఇష్టం మా అద్రుష్టం అంటారు. రేపు వీరి భాగస్వామి, పిల్లలు కోడలు అల్లుడు కూడా ఇలాగే జవాబు ఇచ్చినప్పుడు, వీరికి తత్వం అర్ధం అవుతుంది, సంస్కారం అంటే ఏమిటే జ్ఞానోదయం అవుతుంది.

దీనికే నా ఇంత బాధ, గందరగోళం, పరుగులు అరుపులు. ఇంకా ముందు ముందు మనం ఎన్ని కరువు లో, కరోనా లో, త్సునామీ లో, వరద లో, భూకంపం లో చూడాలి. ఇది చాలా చిన్న బాధ, మిగతా రకం బియ్యం గోధుమలు దొరుకుతాయి. ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు, ఇతర దేశాల బియ్యం కూడా దొరుకుతాయి. కాకపోతే గారాబం గా కష్టం సుఖం తెలియకుండా పెరిగి, ఆ సన్న మసూరి నే తినాలి అనే వారికి బాధనే.

కారణం కేవలం మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం మాత్రమే. నిర్లక్ష్యం లెక్క లేని తనం, నక్క పులి పాము ఎన్నిక, మనకు పాపం వడ్డీ తో సహా నడ్డి విరుస్తుంది.

మెత్తని మాటలకు మనం లొంగం, బిజీ సమయం లేదు అంటాం. మరి పంచభూతాల శిక్షణ మొదలు పెడితే, బియ్యం దుకాణం లో కుటుంబం మొత్తానికి, ఖాళీ సమయం ఉంటుంది కదూ?

షాపు కు, ఎప్పుడు లాగానే వెళతాం, దొరికితే దైవ సంకల్పం. ఒకే మాటా, బాట, పాట. దొరకక పోతే కూడా దైవ సంకల్పం, డాక్టర్ బియ్యం వాడకం తగ్గించాలి అంటారు కదా. మనం నిమిత్త మాత్రమే అన్నట్లు గా ఉండాలి. గీత చెప్పింది ఇదే, సుఖ దుఃఖాల లో సమతా స్తితి ఉండాలి అని. మనకు, మన భాగస్వామికి, మన సంతానానికి లేదు అని నిరూపణ అయ్యింది కదా?

జగనన్న ప్రవాస తెల్ల సోనా మసూరి బియ్యం పధకం రావచ్చు ఏమో, 2 నెలలు ఓపిక పట్టండి అంటున్న పుకార్లు, కొంత మంది జోకులు - కేవలం వీసా, పచ్చ కార్డులు, ఆదాయం 75 వేల డాలర్లు లోపు ఉన్నవారికే.

*మరి ఇలా ఇతరులకు సహాయానికి ముందుకు వద్దామా? మీకు వీలైన దోవలో మీరూ ప్రయత్నం చేయాలి.*

గురువు ల కు శిరసు వంచి నమస్కారములు. భగవద్గీత మన కన్నా బలహీనులు కు అండగా ఉండమని చెబుతుంది, ఆచరణలో చూపుదాం, అది మనకు ఎంతో పుణ్యం, యాగం గొప్ప త్యాగం తో సమానం -

ఆధ్యాత్మిక మానవత్వం తో, సజీవ గురువు లేదా పేరెంట్స్ మరియు అత్తమామల సేవతో ఉన్న, సామాజిక ధన వస్తు వాహన సొంత ఇల్లు లేని బలహీనులు కు, మరియు రాజకీయ పార్టీ సంఘ వర్గ అండలేని వారు, ఎవరైనా సోనా మసూరి బియ్యం దొరక్క షాపులు తిరిగి తిరిగి ఇబ్బందులు పడి ఉంటే, దయచేసి చెప్పగలరు, మన సందేశాలు అందుకునే స్పందించే వారిలో మాత్రమే సుమా.

వారికి సోనా మసూరి బియ్యం ఒకటి మరియు బ్రౌన్ సోనా మసూరి బియ్యం ఇవ్వబడును తెచ్చి న బిల్లు ధరకు లేదా ఉచితం, ఆత్మబంధువు సోదర మానవతా చేయూత కింద.

వారికి 6 నెలలు గా ఉద్యోగం ఆదాయం కూడా లేకపోతే, రెండు కూడా ఉచితం, మొహమాటం వద్దు. కష్ట సమయంలో భక్తులు సేవకులకు అండగా ఉందాం, కలియుగ పాపం అలాగే పంచభూతాల శిక్షణ తప్పించుకుందాం. మీ కుటుంబ ఇబ్బందికర పరిస్తితిని బట్టి, పై వాటిలో సడలింపులు ఉంటాయి.

పర్లేదు మనం మాములు ఇతర దొరికే బియ్యం తో సర్దుకుందాం అమ్మ తో పాటుగా. 20 ఏళ్ళు చాప నిద్ర, 190 వారాలు 108 ప్రదక్షిణలు చేసే, గంటలు గంటలు ఇతరుల బాధలు ఉచితం గా విని మానసిక ధైర్యం ఇచ్చిన, మాలాంటి అజ్ఞానులు కు ఇది పెద్ద కష్టమేమీ కాదు. దైవం తో పాటు గా మీ అందరి అండ ఎటూ ఉంటుంది కదూ.

ఇలా మీరు కూడా తోటి వారికి సందేశాలు పంపి, వారికి అండగా ఉండి, నర సేవ యే నారాయణ సేవ గా, మానవ సేవ యే మాధవ సేవ గా, రుజువు చేస్తారు కదూ?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,859,347; 104 తత్వాలు (Tatvaalu) and views 224,278
Dt : 22-Jul-2023, Upd Dt : 22-Jul-2023, Category : General
Views : 224 ( + More Social Media views ), Id : 1848 , Country : USA
Tags : support , telugu , expatriates , america , sona , masuri , rice , usa
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content