Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Manava seva madhava seva, Naruni seva narayana seva, Harijan seva harihara seva
*మానవ సేవే మాధవ సేవ, నరుని సేవ నారాయణ సేవ, హరిజనుల సేవ హరిహరాదుల సేవ అన్న వేద పురాణ ఉపనిషత్తులు వాక్యాలు మనకు ఎక్కలేకపోతే, మనకు వాక్సుద్ధి చిత్తశుద్ధి రాతశుద్ది లేదనే కదా? దాని ఫలితం మనకు తెలుసు కదా?*
Manava seva madhava seva, Naruni/ Nar seva narayana seva, Harijan seva harihara seva - by Veda, PuraNa, Upanishad. Don't we understand that? If not, we are agreeing, we don't have Vaksuddi, Chittasuddi, ratasuddi. Correct? Then we know the end result?
బతికి ఉన్న దగ్గర తోటి మనుషుల కు, సజీవ గురువు సేవ చేయకుండా, ధనం తో దైవ సేవనా? ప్రయోజనం?
కపట నటన తప్పుడు వారికి, ఉలకని పలకని దైవం అయితే, మన ఆటలు సాగుతాయనా? మనకు బుద్ది చెప్పరు అనా? ఇంకో మంచి మనిషికి, తల వంచి సేవ, నేర్పరు అనా? అలా సేవ చేయకపోతే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని ఎలా నిరూపిస్తావు?
నోటి మాటలతోనా? గుడి బండలు తుడిచా? మాలలు కట్టా? ధన డొనేషన్ ఇచ్చా, నూనెకు, నైవేద్యం కు, ఉత్సవానికి? ఇవన్నీ మానసిక నియంత్రణలో మొదటి మెట్టు మాత్రమే. అంటే 1-5 వ తరగతి మాత్రమే, ఆధ్యాత్మికములో? ఇంక 10 వ తరగతి ఎప్పుడు? డిగ్రీ ఎప్పుడు, ఆధ్యాత్మికములో? 100 జన్మలకా?
అంటే దేవుడు ధన పక్షపాతి అని మనమే సర్టిఫై చేస్తావా? అలా మోహం లో కన్ను మిన్ను గానని, తమ వంకర బుద్ది నిరూపణ చేసిన రావణ, దుర్యోధన, కీచక, తాటకి, లంఖిణి, మంధర, కైక, పూతన, ఒంటరి రాజరిక అహంకార, మత్తు, మానసిక బలహీన, బతుకు దైవం ఒప్పుకుంటారా?
ఆయన జగన్నాటక సూత్రధారి. హనుమంతుని ముందు కుప్పిగంతులా అన్న సామెత అదే. రేపు ముదుసలి వయస్సు లో కాలు చేయి కదలకపోతే, తోటి మానవ సహాయం వద్దా?
మానవ సేవే మాధవ సేవ, నరుని సేవ నారాయణ సేవ, హరిజనుల సేవ హరిహరాదుల సేవ అన్న వేద పురాణ ఉపనిషత్తులు వాక్యాలు మనకు ఎక్కలేకపోతే, మనకు వాక్సుద్ధి చిత్తశుద్ధి రాతశుద్ది లేదనే కదా? దాని ఫలితం మనకు తెలుసు కదా
మన ఊరు రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ, కాఫీడేఅయ్య, . . . ఇంకా ఎందరో ఆస్తులు అంతస్తులు అంగబలం ఉన్న మహానుభావులు, ఇంతకన్నా పెద్ద పూజలు యాగాలు దానాలు ధర్మాలు సేవలు చేశారు. కానీ చివరకు దక్కేది ఏమిటో, ప్రత్యక్ష సాక్ష్యం చూపారు. మనకు ఇంకా బుద్ది జ్ఞానం రాదా, తల్లి తండ్రులు, స్నేహితులు, బంధువులు ఇవి అర్ధం అయేలా చెప్పరా? చెప్పినా వినని, పెంపక సంస్కార వంశమా?
మన ముదుసలి తల్లి తండ్రులు అత్త మామల లేదా ఇతర పెద్దల, సేవ చేయలేమా? మన ముదుసలి తనములో, మన సంస్కార బిడ్డలు లేదా శిష్యుల/ గురువుల నీడలో, దేవతలు గా పూజింపబడతామని, మన సంస్కార బంధువులు స్నేహితులు తో గట్టిగా, మన జీవిత సార్ధకతను చెప్పలేమా?
అది చెప్పలేనప్పుడు, ఇన్నాళ్ళ మన ప్రాపంచిక వ్యర్ధ మోహ బతుకు, జంతువుల హీన బతుకు కన్నా, మనము నీచం కాదా? జంతువులు ఆపుకోలేక పొర్లాడాయీ, మనము అంతే. అవి కని ఊరిమీద వదిలాయి లేదా మనమే ఆ జంతువుల పిల్లల్ని వేరు చేసేము. మనుషులు గా, మన బతుకు అంతేగా? పెళ్ళి అనే వ్యాపారములో, పశువుని అమ్మినట్లు పిల్లలను అమ్మితే, ధనం ఉన్న వారు కొంటున్నారు. లేదా ప్రేమ అనే మోహములో, ఇంకొకరు వేరు చేస్తున్నారు. శిక్షణ తప్పదు.
జంతువులే నయం కదా, కనీసం కుక్కకు విశ్వసనీయత ఉంది, అదీ మన చదువు, సంధ్య, కుసంస్కార పెంపకం లేకపోబట్టి. లేకపోతే అవీ నాటక కపటాలు నేర్చుకుంటాయి సుమీ. మరి మన ఓ వైపు చంద్ర సూర్య మండలాలు వెళుతూ కూడా, మన మనసులో ఉన్న మురికి భావాల బద్దక పతన మలినాలను వదిలేది ఎప్పుడు మిత్రమా? వదలకపోతే, నష్టం ఎవరికి? మీకా, మాకా, దేవునికా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,382,936; 104 తత్వాలు (Tatvaalu) and views 257,830 Dt : 02-Sep-2023, Upd Dt : 02-Sep-2023, Category : General
Views : 500
( + More Social Media views ), Id : 1903 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Manava ,
seva ,
madhava ,
Naruni ,
Nara ,
narayana ,
Harijan ,
harihara Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments