Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Mahakavi Sri Sri Maro Prapancham Pilichindi - Mahaprasthanam - Madala Ranga Rao, Ranganath, Giribabu
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది - మహాకవి శ్రీశ్రీ కలంనుండి వచ్చిన ఈ గేయం, ఎన్నో రూపాలతో, మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఒక్క సారి, చదివి, విని, మీరూ పాడండి. మాదాల కూడా, అరిషడ్వర్గం ను జయించిన వ్యక్తే అనవచ్చు ఏమో, ఎందుకంటే ఇలాంటి విప్లవ సినిమాలను, తాము నష్టపోయినా, ప్రజలలో చైతన్యానికి, వీరు తీస్తూనే ఉంటారు. ఆ పరంపర, నారాయణ మూర్తి గారు చేస్తున్నారు. మరి కొత్త విప్లవకారులు ఎప్పుడు వస్తారో.
అదేమిటండీ, ఆధ్యాత్మికం నుంచి విప్లవం లోకి ఎందుకు? అంటారా, అదిగో అక్కడనే లింక్ ఉంది. సామాజిక వ్యవస్త లో లోపాలు సరిచేసేది మార్పులు తెచ్చేది విప్లవం, మరి మనిషి/ మనసు/ కుటుంబం లోని లోపాలు మానసిక బలహీనలతలను సరిచేసేది, ఆధ్యాత్మిక విప్లవం.
జనం లో విలువలు పతనమై, ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్తితి లో ఉంటే? ఆవును పూజిస్తూ, నక్క పాము పులికి ఓటేస్తే? ఆత్మను పెళ్ళిలో, వీసాకు ధనంకు ఆస్తులకు అధికారంకు పదవికి అమ్ముకుంటే/కొంటే? వస్తువు/ మనసు కల్తీలతో, తమకు అలాగే ఇతరులకు అన్యాయం/ ద్రోహం చేస్తుంటే? అది కుళ్ళి పోయిన కుటుంబ వ్యవస్తకు చిహ్నం. మరి దానిని ఏ విప్లవం తోనే మార్చాలి? ఆధ్యాత్మిక విప్లవం.
తన బలహీన మనసుపై, తిరుగుబాటు చెయ్యాలి. నేను బానిసను కాదు, నీ మాట వినను, నాకు బుద్ది సిగ్గు శరం మానవత్వం క్రుతజ్ఞత విశ్వసనీయత సంస్కార పెంపకం దైవత్వం ఉన్నాయి, అని మనసుకు ప్రతి రోజూ గుర్తు చెయ్యాలి. అవే మన సందేశాలు, గురువులకు వారం వారం చేరుతున్నవి కదా.
మా ముదుసలి తల్లి దండ్రులను/ వర దానం చేసిన అత్త మామల సజీవ గురువు సేవ వీడము, మా సంస్కార పిల్లల పెంపకం దగ్గర ముదుసలి తనం లో దేవతలు గా ఉంటాము, అనే ధైర్యం రావాలి.
ఆ విప్లవానికి రోడ్ ఎక్కనవసరము లేదు, మనసులోకి పూజ ధ్యానం తపం జపం ల తో, వెళితే చాలు, మనసును నియంత్రణ చేస్తే చాలు. తనను తాను తెలుసుకోవడానికి, తనలో తాను ప్రయాణము చేస్తూ, తన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం గురించి మధనపడి, తన తప్పును తాను సరి చేసుకుంటే, ఇంకా తన కుటుంబం మాయకు దూరముగా ఉంటుంది.
ఇలాగే సమాజములో అన్ని కుటుంబాలు, తమ లోపాలను ఒప్పుకుని సరి చేసుకుంటే, ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటే, ఇంక రోడ్ మీద విప్లవాలతో పని ఉందా? రోడ్ మీద వచ్చిన విప్లవాలు, కొన్ని విజయం అయితే, కొన్ని పరాజయం. ఆ విజయాలు కూడా, కొంత కాలమే. వారి పిల్లలే, ఉద్యోగాల/ వ్యాపారాల కోసం మరలా, పెట్టుబడి దారుల పంచన చేరుతున్నారు.
హరోం హరోం హర, హర హర హర హర, హరోం హరా, అని కదలండి. ధర్మ విరుద్ద, మానసిక దానవ రాజ్యం భోజ్యం, ద్వంసం చేస్తూ, పదండి ముందుకు. మానసిక నియంత్రణ విరోధుల పనిపట్టించగా, ప్రతిజ్ఞ చేస్తూ, పదండి ముందుకు. ఇది మరో మానసిక ప్రపంచపు, మంచితనానికి, మానవత్వానికి, మానవజాతి, మహా ప్రస్థానం.
1. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..
పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి..
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..
2. ఇదే మహా ప్రస్థానం.., ఇదే మహా ప్రస్థానం..,
జీవిత పధాన సమతా గమ్యం, చేరగా..
ఇదే మహా ప్రస్థానం.., భారత జనాల భాదల గాధలు మారగా..
పదండి పోదాం.., కనపడలేదా.., పవిత్ర సుందర నవోదయం
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..
3. దారి పొడుగునా, గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, పదండి ముందుకు
బాటలు నడచి.., పేటలు కడచి.., కోటలన్నిటిని దాటండి..
ప్రజా విరోధుల పనిపట్టించగా, ప్రతిజ్ఞ చేస్తూ , పదండి ముందుకు ..
ధర్మ విదూరుల, దానవ రాజ్యం, ద్వంసం చేస్తూ, పదండి ముందుకు..
కనపడలేదా.., మరోప్రపంచపు, కణ కణ మండే త్రేతాగ్ని..
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..
4. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన, సోమరులారా.., చావండి..
నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా.. రారండి..
హరోం హరోం హర, హర హర హర హర, హరోం హరా, అని కదలండి ..
మరోప్రపంచపు, కంచు నగారా, విరామమెరుగక మ్రోగింది
సల సల కాగే, చమురా.., కాదిది కాదిది.., ఉష్ణ రక్త కాసారం...యువ చైతన్య వికాసం
కనపడలేదా.., మరో ప్రపంచపు, అగ్ని కిరీటపు, ధగ ధగలు..
ఎర్ర బావుటా, నిగ నిగలు, హోమ జ్యాలల, భుగ భుగలు..
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..
5. చీకటి శక్తుల, పీకలు నులిమే, వెలుతురువైపు, మహా ప్రస్థానం
దోపిడీ బుద్దుల, తుదముట్టించే, న్యాయం వైపు, మహా ప్రస్థానం
ఇది మరోప్రపంచపు, మంచితనానికి, మానవజాతి, మహా ప్రస్థానం
మహా ప్రస్థానం....మహా ప్రస్థానం...
మానవుడే నా సందేశం- మనుష్యుడే నా సంగీతం, అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30, 1910లో విశాఖపట్నంలో జన్మించారు. శ్రీశ్రీ ఓ విప్లవ కవి, హేతువాది, అభ్యుదయవాది, నాస్తికుడు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన శ్రీశ్రీ మహాప్రస్థానం 1950లో, పుస్తకరూపం ధరించింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ఓ ప్రభంజనం. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీశ్రీ 1983 జూన్ 15 న మహాప్రస్థాన మొందారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,494,193; 104 తత్వాలు (Tatvaalu) and views 267,483
Dt : 15-Jun-2023, Upd Dt : 15-Jun-2023, Category : Songs
Views : 1414
( + More Social Media views ), Id : 1796
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Maro ,
Prapancham ,
Pilichindi ,
Mahaprasthanam ,
Madala ,
Ranga ,
Rao ,
Ranganath ,
Giribabu ,
Sri ,
Sri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments