Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Nee Sukhame Ne Koruthunna (Parody) - Murali Krishna - ANR, Jamuna, Gummadi, Haranath
హైందవ మతము, సనాతన ధర్మము మాత్రమే, సర్వే జనా సుఖినోభవంతు అని చెప్పింది. మన సమాజము బాగుంటే, మనము బాగుంటాము. మన చుట్టూ చెడిపోతే, మనము ఒక్కరము బాగుండలేము. అడవి తగల బడుతుంటే, మనము మాత్రం మధ్యలో చల్లగా బతక గలమా? కానీ కలికాలములో పాపాతములకు అది ఎక్కదు, చివరి ఫలితాలు వచ్చినదాకా, ఎందుకంటే పెంపక సంస్కారం లేదు. అందుకే మనము అందరి క్షేమము కోరాలి.
మన బంధు మిత్రులు ఇరుగు పొరుగు, ఎవరు ఎక్కడ ఉన్నా, ఏది ఏమైనా అంటే మనల్ని గౌరవించినా తూలనాడినా, మనమెవరికి వారై వేరైనా సరె, మీ సుఖమే, మేం కోరుతున్నాం, మీరు మము వీడి బ్రమలతో దూరముగా వెళుతున్నా సరే అని, మన మంచితనాన్ని మాత్రమే చూపాలి.
మంచి మనము చేద్దాము అనుకున్నా, వారికి ఉన్న అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో మంచిని గ్రహించలేరు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదనీ ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచి కనీ అనుకోవడమే మనిషి పనీ అని సంత్రుప్తి పడదాము.
అందరినీ పసి పాపల వలె ఒడి చేర్చినాము, కనుపాప వలె కాపాడినాము. గుండెను గుడిగా చేశామూ, కానీ మొహం వ్యామోహములో, మీరుండ లేననీ వెళ్ళారు, భవిష్యత్ ను మనము ఆపలేము కదా, ఎలా జరగాలో అలాగే జరగాలి, కేవలం మంచి చెప్పడం వరకే మన పని.
అందరికీ మంచిని పంచుట తెలిసిన మా మనసునకు, అందరిని మరచుట మాత్రము తెలియనిదా? పది మందికి బతుకు ఇచ్చినదే, నిజమైతే, వారిని వారి తప్పులను మన్నించుటయే, ఋజువు కదా?
మీ మంచి కలలే, కమ్మగ పండనీ. చల్లని దైవ తలపే, మీలో ఎల్లకాలం నిండనీ. కలకాలం మీరు చల్లగ ఉండాలనీ, దీవిస్తున్నాం, మా ఆత్మ స్వరూపులారా/ జీవులారా.
Parody
ఎక్కడ ఉన్నా, ఏమైనా..
మనమెవరికి వారై, వే.రై.నా
మీ సుఖమే, మేం కోరుతున్నాం.. 2
మము వీడి బ్రమలతో వెళుతున్నా ||మీ సుఖమే||
అనుకున్నామని, జరగవు అన్నీ
అనుకోలేదనీ, ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచి కనీ.., అనుకోవడమే మనిషి పనీ ||మీ సుఖమే||
పసిపాపవలె, ఒడి చేర్చినాము
కనుపాపవలె, కాపాడినాము
గుండెను గుడిగా.., చేశామూ.. 2
మీరుండ లేననీ వెళ్ళారు ||మీ సుఖమే||
పంచుట తెలిసిన, మా మనసునకు
మరచుట మాత్రము, తెలియనిదా..
బతుకు ఇచ్చినదే, నిజమైతే..
మన్నించుటయే.., ఋజువు కదా.. ||మీ సుఖమే||
మీ. కలలే, కమ్మగ పం.డనీ.
దైవ. తలపే, మీలో నిండనీ.
కలకాలం. చల్లగ ఉండాలనీ..
దీవిస్తున్నాం, మా జీవులారా.. 2
ఎక్కడ ఉన్నా ఏమైనా, ఎవరికి వారై వేరైనా ||మీ సుఖమే||
Original
ఎక్కడ ఉన్నా, ఏమైనా..
మనమెవరికి వారై, వే.రై.నా
నీ సుఖమే, నే కోరుతున్నా..
నిను వీడి అందుకే వెళుతున్నా ||నీ సుఖమే||
అనుకున్నామని, జరగవు అన్నీ
అనుకోలేదనీ, ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచి కనీ.., అనుకోవడమే మనిషి పనీ ||నీ సుఖమే||
పసిపాపవలె, ఒడి చేర్చినాను
కనుపాపవలె, కాపాడినాను
గుండెను గుడిగా.., చేశానూ.. 2
నువ్వుండ లేననీ వెళ్ళావు ||నీ సుఖమే||
వలచుట తెలిసిన, నా మనసునకు
మరచుట మాత్రము, తెలియనిదా..
మనసిచ్చినదే, నిజమైతే..
మన్నించుటయే.., ఋజువు కదా.. ||నీ సుఖమే||
నీ. కలలే, కమ్మగ పం.డనీ.
నా. తలపే, నీలో వా.డనీ.
కలకాలం. చల్లగ ఉండాలనీ..
దీవిస్తున్నా, నా దేవిని.. 2
ఎక్కడ ఉన్నా ఏమైనా, ఎవరికి వారై వేరైనా ||నీ సుఖమే||
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2192 General Articles and views 2,441,196; 104 తత్వాలు (Tatvaalu) and views 263,056
Dt : 27-Oct-2023, Upd Dt : 27-Oct-2023, Category : Songs
Views : 467
( + More Social Media views ), Id : 1942
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Nee ,
Sukhame ,
Koruthunna ,
Parody ,
Murali Krishna ,
ANR ,
Jamuna ,
Gummadi ,
Haranath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments