Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మా ఊళ్ళో రెండు వారాలు అన్ని మూత పడ్డాయి. దేవాలయం తెరచి ఉంచినా, మనల్ని లోనికి పోనివ్వక, మన 40 వ వార ప్రదక్షిణలు కు, విరామం అని గురువు లకు తెలుసు. ఇప్పుడు ఇండియా లో కూడా అదే చెపుతున్నారు లాక్ డౌన్, నేను వ్రత రూపాలలో, ప్రతి వారం గుర్తు చేస్తున్న, బాధ్యత గా రెండేళ్ల పైగా, మీరు చదివి నా చదవకపోయినా. జాగ్రత్తలు పాటించాలిఅని ఎన్నొసార్లు అభ్యర్ధించాను.
నిన్న ఒక వాస్తవం లాంటి జోక్ చూసా. మనకు ఏది మంచిది, ఒకటి బతికి హాయిగా ఇంట్లో ఉండటం, రెండు రోగం తో ఆసుపత్రి లో ఉండటము, మూడు చచ్చి ఫోటో లో ఉండటము. ఛాయిస్ మనదే, మిత్రమా.
దేవుడు మన వెంట వైరస్ రూపంలో ఉంటూ, జాగ్రత్తలు నేర్పుతున్నారు, భవిష్యత్ అలవాట్లు కొరకు. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా దోమైనా కుట్టదు అని సామెత ఉంది కదా.
10 మైళ్ల లోపు దూరం, గుడి నుంచి వెనక్కు వస్తా, కూరలు దినుసులు తెచ్చుకోవడం చేసే వాళ్ళం ఎప్పుడూ. కానీ ఇప్పుడు ఊరు దాటకూడదు. 65 పైన వారు లేదా మనమైనా అనవసరంగా తిరగకుండా ఉండాలి అని ప్రభుత్వ నిర్ణయం.
కాబట్టి ఇంటి పక్కన ఉన్న షాపులో నే తెచ్చుకోవడం చేయాలి. సీనియర్ అవర్ అని ఓ రెండు గంటలు పెద్దలు కు పెట్టారు. నా కూతురు (అమ్మ) ను తీసుకుని వెళుతూ, తనకు గ్లౌజులు, మాస్క్ వేసి, ఇండియా షాపు వరకు లోనకు రా. ఏ కూరగాయ గోడలు బల్లలు తాకకుండా, ఏది కావాలో దురంగా ఉండి చెప్పు అని ముందు జాగ్రత్తలు చెప్పాను. మారాం చేసినా, కూరలు తాకినా ఇక బయటకు తాను అని చెప్పాను.
అది ఇది చూపిస్తూ, ఆ కాయ మంచిది ఇది ఎండిపోయింది అని, తాకాలని ప్రయత్నం చేస్తే, గట్టిగా చెప్పాను, వెళ్ళిపోదాం పద, పప్పు చారు లేదా రసం తో, రెండు వారాలు తాగుదాం అని నవ్వుతూ చెప్పాను.
బుద్ధి గా అన్ని దూరంగా ఉండి చూపిస్తే, మా కాకర, నిమ్మ, కరేపాకు, పుదిన, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పనిసరిగా తీసుకున్నాము. వీటితో పాటుగా కూరలు తీసుకున్నాము, ఏ లోటు లేదా ఎక్కువ రేట్లు పెట్టలేదు షాపు వారు. ప్రభుత్వం ఊరుకోరు, రేట్లు పెంచినా లేదా వస్తువులు దాచినా.
బిల్లు వేసే దగ్గర, నవ్వుతూ అడిగారు, ఆమె రాకపోతే ఏమి నష్టము అని? జవాబుగా లేదమ్మా, ఆమె మా యజమానురాలు, మాలాంటి వారు ఏది పడితే అది తెస్తే ఊరుకోరు. చూసి తెచ్చుకోవడం అలవాటు, తర్వాత బువ్వ పెట్టరు. అందుకే తప్పలేదు అన్నా నవ్వు జవాబు తో. అందరూ నవ్వారు. బుట్ట బొమ్మ లాగా అంతా దిగ్బంధనం చేసిన, నా కూతురు కూడా నవ్వింది, ఏదో నవ్వే చురక వేశాడు అని అర్ధము అయ్యి. చెప్పా తెలుగు అర్థం కూడా.
కారు దగ్గరకు వచ్చాక సామాను లోన పెట్టి, కూతురు ను బండి ఎక్కించిన తర్వాత, సబ్బులాంటి దాని తో చేతులు శుభ్రం చేసుకుని, స్టీరింగ్ పట్టా. ఆ షాపు వైరస్ కొంతైనా అక్కడ వదిలేయాలి.
రెండో కొట్టుకు వెళ్లి, కూతురు ను కారు లోనే కూర్చో బెట్టి, లిస్టు లో ఉన్నవి తేవడానికి లోనకి వెళ్ళా. కాలే ఆకు రసం కోసం తీసుకునే సమయంలో, ఆకుతో పాటుగా సబ్బులాంటి నీళ్ళు చేతిలోకి వచ్చాయి. అబ్బో ఈ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అనుకున్నా. జేబులో ఉన్న పేపర్ తో శుభ్రం గా చేతులు తుడిచా. అందరూ దూరం దూరంగా నిలబడ్డారు, చెల్లింపు కోసం. బయట పోలీసు వ్యానులు ఉండాయి జాగ్రత్తలు కోసం.
మరలా కారులో సరుకులు పెట్టి, చేతులు సబ్బు తో కడిగి, ఇంటికి వచ్చాము. అంటే కేవలం పావు మైలు కూడా లేని చుట్టూ బజారే అది. అన్ని ఇంట్లో పెట్టి, ఇద్దరం ముందు మరలా చేతులు కడుక్కుని, అన్ని సర్ది, మరలా చేతులు కడుక్కుని, అప్పుడు భోజనం చేసాము.
అంటే వైరస్ మన పాకెట్లు, కూరలు తో పాటుగా కూడా ఇంటికి రావచ్చు. అందుకే మరలా తాకిన తర్వాత, మరలా చేతులు, కూరలు, కాయలు వేడి నీళ్ళు తో శుభ్రం చేయాలి, ప్రతి కూర కోసే ముందు కూడా. మరలా కోసినాక, చేతులు కడగాలి శుభ్రంగా. అజాగ్రత్తగా ఉండవద్దు. పాత మడి ఆచారం, ప్రతి ఒకరు పాటించాలి, ఇంట్లో కూడా గౌరవం తో. మన సెల్ ఫోన్, బట్టలు తో పాటుగా కూడా అంటుకుని రావచ్చు.
రోగం తగ్గించుకోవడం కన్నా, తెచ్చుకోకపోవడం మంచిది ఉత్తమమైనది అని పెద్దలు అంటారు కదా. ఈ నెలాఖరు దాకా కనీసం, జాగ్రత్తలు గా ఉండాలి. సర్వేజనా సుఖినోభవంతు
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,282; 104 తత్వాలు (Tatvaalu) and views 256,970 Dt : 23-Mar-2020, Upd Dt : 23-Mar-2020, Category : General
Views : 1077
( + More Social Media views ), Id : 435 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
corona virus ,
covid 19 ,
vegetable shopping Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments