Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఏవండోయ్ మీరు చెప్పే కర్మ సిద్ధాంతం వెంటనే కనిపిస్తుందా? మాకు కనపడలేదు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఊరకనే మమ్మల్ని ఊరక భయపెడుతున్నారు.
గురువు గారు, పూర్వ జన్మ సుక్రుతం కొంతమంది ని, కాపాడుతూ ఉంటుంది కొంతకాలం, అంటే ఇంకా మారతారు అని, సమయం ఇస్తుంది, కానీ మారరు కదా.
దుర్యోధనుడు, రావణుడి అరాచకం కూడా చాలా రోజులు సాగింది. కానీ ఎప్పటికైనా, సమయం వచ్చింది కదా. కొంచెం ముందు వెనుక కు, కానీ ఫలితాలు తప్పదూ.
ఇప్పుడు వర్తమానం మన కళ్ళు ఎదురు గా జరుగుతుంది చూద్దాం.
కాంగ్రెస్ పార్టీ, మన తాతల కాలం నుంచి ఉంది. కాంగ్రెసు భవన్ లో మీటింగ్ జరిగితే, చాపల మార్కెట్ లాగా, పక్కన వారికి ఏమీ వినపడదు, గోల గోల అరుపులు లో. ఇప్పుడు చూడండి, ప్రశాంతంగా హయిగా ఉంది, జనం లేరు, ఈగలు తప్ప. బిజేపి వచ్చిన తర్వాత, ఇంకా ఘోరంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఆంధ్రా లో అడ్రసు గూగుల్ లో కూడా దొరకదు.
మన రామన్న, మ్న చంద్రన్న చేతిలో ఏ విధముగా అవమానాలు పడ్డారో చూసాం. రాజన్న, జగనన్న చేతిలో చంద్రన్న మర్యాదలు చూసాం చూస్తున్నాం.
రేపు మరలా చంద్రన్న గెలిస్తే, మరలా అటు ఇటు మర్యాద లు జంపింగ్ లు జరుగుతూనే ఉంటాయి. అంటే చర్య ప్రతి చర్యలు, సాధారణం. మరి ఫలితాలు చూస్తూ, జరగడం లేదు అంటారు.
మన చుట్టూ పక్కన ఇళ్లు లో, కూడా ఎన్నో చూస్తున్నాం. అత్తను మోసం చేసిన అల్లుడు. తల్లి ని గోడకు కొట్టిన కూతురు. ఆస్తి లాక్కుని, తల్లి దండ్రులు ను, ఆశ్రమం లో వేసిన కొడుకు కూతురు.
ఇంక మన గురువు ల దగ్గరకు వస్తే కొత్త సినిమా, నాన్ వెజ్, బయట తిండి, చెడు తిరుగుళ్ళు, చెడు సాంప్రదాయం వద్దు వద్దు అని, నెత్తి నోరు మొత్తుకున్నా రెండు ఏళ్లుగా కొంతమంది కి, పదేళ్ల కు పైగా మిగతా వారికి.
ఇప్పుడు వైరస్ అక్క వలన, మనకు తెలిసిన గురువు లే గాక, దేశ దేశాలు కూడా, మంచి సాంప్రదాయం పాటించాలి అని, ఆత్రం పడుతున్నారు.
అంటే కర్మఫలం తప్పదు. ఇంతకన్నా ఋజువు ఏమి కావాలి గురువు గారు. ఇవన్నీ తగ్గిన తర్వాత, మరలా నీతి తప్పుతారు, మరలా వైరస్ అక్క 2 వస్తుంది, మనకు సినిమాలు రోబో 2 ఈగ 2 బాహుబలి 2 వచ్చినట్లుగా.
పాప ఫలితం, మంచి జనం కు, కన్నీళ్ళు తెప్పించిన ఫలితాలు తప్పవు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,602; 104 తత్వాలు (Tatvaalu) and views 227,064 Dt : 10-Mar-2020, Upd Dt : 10-Mar-2020, Category : General
Views : 818
( + More Social Media views ), Id : 394 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
karma siddantam ,
doctrine of karma Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments