పాటతో పరమార్ధం- వీణ వేణువైన(భక్తి పేరడీ)- ఇంటింటి రామాయణం- రంగనాథ్, ప్రభ, చంద్రమోహన్, జయసుధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,941,001; 104 తత్వాలు (Tatvaalu) and views 230,662.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit- Veena Venuvaina Sarigama(Bhakti Parody)- Intinti Ramayanam- Ranganath, Prabha, Chandra Mohan, Jayasudha

పాటతో పరమార్ధం- వీణ వేణువైన సరిగమ(భక్తి పేరడీ)- ఇంటింటి రామాయణం- రంగనాథ్, ప్రభ, చంద్రమోహన్, జయసుధ

అయోధ్యలో రాముల వారి ఇంటి వేడుక త్వరలో, ఇంకో 14 రోజులలో, ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నది. ఆ రామయ్యకు మనము క్రుతజ్ఞతలు విశ్వసనీయతతో ఏమి ఇస్తున్నాము? అందరులాగా, ఎవరో రాసినవి పంపడం, లేదా దేవుని బొమ్మలు నింపడం, దేవుని గురించి ఎవరి మాటలో గుమ్మరించడం, అంతేనా? పైసా ప్రయోజనము లేదు, చిత్తశుద్ది వాక్సుద్ది లేకుండా చేస్తే. అవి నాయకుల వాగ్దానం, ఓటర్ల నీతి అమ్మకపు ఓటు విలువ ఉంటుంది. సొంత పాట, మాట, రామకోటి లెక్క రాసి చెపుదామా చిత్తశుద్దితో?

అదే కదా మన ఇంటింటి రామాయణం లో చెప్పుకోవలసినవి? దైవ రాగాల ఉయ్యాల లీవేళలో, వీణ వేణువైన సరిగమ విన్నారా మిత్రమా? తీగ రాగమైన మధురిమ కన్నారా,
మనసు తహ తహలాడాల, చెలరేగాల దైవ భక్తి పాటలు, శ్లోకాలు, మంత్రాలు, పద్యాలతో..

ధ్యానములో మన ఊపిరి నిలిచిన వేళ, మనసు కుడుటపడి మన సాధన కుదిరిన వేళ, మన మానసిక వీణ లో, దైవ వేణువే, పలికే ఓ రాగమాల పాడుదామా?

యెదలో మెదిలే దైవ ధ్యానం యెదుట, మన సాధన ఫలించి మన ఎదుటే తలచిన దైవమా, మీ రాకతొ, మా తోటలో, వెలసే వనదేవతా అని ఆనందముతో ఉప్పొంగి పోలేమా?

Bhakti Parody

వీ.ణ వే.ణువై.న సరిగమ విన్నా.రా..
ఓ.. తీ.గ రా.గమైన మధురిమ కన్నా.రా..
మనసు తహ తహలాడాల, చెలరేగాల, దైవ రాగాల ఉయ్యాల లీవేళలో ||వీణ వేణువైన||

ఊపిరి నిలిచిన వేళ, మన సాధన కుదిరిన వేళ,
మన వీణ లో, దైవ వేణువే.. పలికే. రాగమా.ల.
ఆ...ఆ... ల ల లా....ఆ...
చూపులు నిలిచిన వేళ, ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ,
మన తనువున, అణువణువున, జరిగే.. దైవలీల ||వీణ వేణువైన||

యెదలో ధ్యానం యెదుట, యెదుటే తలచిన దైవమా,
మీ రాకతొ, మా తోటలో, వెలసే. వనదేవతా..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే తలపు కవిత, అది రాతకొస్తే భవిత
మా పాటలొ, మీ పల్లవే, నవత.. నవ్య సమత ||వీణ వేణువైన||

Original

వీ.ణ వే.ణువై.న సరిగమ విన్నా.వా..
ఓ.. తీ.గ రా.గమైన మధురిమ కన్నా.వా..
తనువు తహ తహలాడాల, చెలరేగాల, చెలి ఊగాల ఉయ్యాల లీవేళలో ||వీణ వేణువైన||

ఊపిరి తగిలిన వేళ, నే వొంపులు తిరిగిన వేళ,
నా వీణ లో, నీ వేణువే.. పలికే. రాగమా.ల.
ఆ...ఆ... ల ల లా....ఆ...
చూపులు రగిలిన వేళ, ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ,
నా తనువున అణువణువున, జరిగే.. రాసలీల ||వీణ వేణువైన||

యెదలో అందం యెదుట, యెదుటే వలచిన వనిత,
నీ రాకతొ, నా తోటలో, వెలసే. వనదేవతా..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత, అది కౌగిలికొస్తే యువత
నా పాటలొ, నీ పల్లవే, నవత.. నవ్య మమత ||వీణ వేణువైన||

Singers: S.P. Bala Subramanyam garu, S, Janaki garu; Lyricist: Veturi garu; Composer: Rajan Nagendra; Director: P. Samba siva rao  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,941,001; 104 తత్వాలు (Tatvaalu) and views 230,662
Dt : 08-Jan-2024, Upd Dt : 08-Jan-2024, Category : Songs
Views : 184 ( + More Social Media views ), Id : 1983 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Veena , Venuvaina , Sarigama , Bhakti , Parody , Intinti , Ramayanam , Ranganath , Prabha , Chandra , Mohan , Jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content