మొన్న వారి బాధ, నేడు ఆయన బాధ, రేపు ఎవరు? మరి మాకు రోజూ బాధ, దీనికి అంతం ఎక్కడ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2179 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2214 General Articles and views 2,474,712; 104 తత్వాలు (Tatvaalu) and views 265,885.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మా (మన) నలుగురు పిల్లలు బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన మరియు లక్షలాది ఓటర్లు, అందరికీ ఒకే విధంగా, బుద్ధి గా సంస్కారం గా బాధ్యత గా ఉండమని చెబుతున్నాము. యువతకు ఆదర్శంగా ఉండాలి అని పెంచాము.

ప్రతి శనివారం మంచి మాటలు, మనసు పై పట్టునకు సాధనకు, ఆచరిస్తూ 15 సాధనలు దోవలు పంపుతున్నాము. దైవ నామ స్మరణ, జపం, ధ్యానం చేయనివారు మాత్రమే ఇలా దారుణంగా ప్రవర్తించగలరు, దూషణలు తో హేళన చేయగలరు.

కానీ వారు లెక్క లేకుండా, అధికారంలో ఉన్నప్పుడు, విచక్షణ కోల్పోతున్నారు. రావణ దుర్యోధనుల దర్పం చూపుతున్నారు. అరిషడ్ వర్గాల కు బానిసలై, రాగ ద్వేష పదవీ ప్రమాణాలు మరచారు ఆనాడు, ఈనాడు కూడా.

నేటి అహంకార కర్మ, రేపు మన దుఃఖ ఖర్మ గా మారుతుంది అని, ప్రత్యక్షంగా చూస్తూ కూడా, ఎవరూ మారడం లేదు. బలహీనులు అసహాయులు ఎవరు బాధ పడినా, ఖండించాలి, సానుభూతి చూపించాలి, మానవత్వ ధర్మం తో, గేళి చేయకూడదు. కర్మ వారిని, అలాగే మనల్ని కూడా విడువదు.

కరోనా వంటి గురువు లు వచ్చిన కూడా, ఎంతోమంది ని కబళించడం చూసినా, మన రాతి గుండెల్లో బెరుకు భయం లేదు. ఇంకా పెద్ద పెద్ద ప్రకృతి భీభత్సవాలు కూడా రావాలని, వీరి కోరికనా?

మనుషులు మంచి మాట వినే స్ధితిలో లేనప్పుడు, పంచభూతాలు మాత్రమే, దానికి జవాబు చెబుతాయి.

పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరు ఇతరుల ను దుర్భాషలాడినా, దూషించినా, అది ఆ సంబంధిత పార్టీ నాయకులు అయిన, మా పిల్లలు వీరన్న చంద్రన్న జగనన్న పవనన్న ల కే. కింది అధికారుల తప్పులు కూడా పై అధికారులు, పార్టీ ప్రధాన నాయకులే భరించాలి.

తన మనుషులు ను అదుపు చేయనివారు, సంస్కారం నిబద్ధత ఉన్న నాయకులు కాదు. ఇతరులకు అవమానం జరుగుతుంటే ఆనాడు చంద్రన్న ఈనాడు జగనన్న చూస్తూ గమ్ముగా నవ్వుతూ ఉన్నారు. అంటే తమ భవిష్యత్తు తామే రాసుకుంటున్నారు.

ఇప్పుడు బాధ, ఈ మా నలుగురు పిల్లల గురించి కాదు. పై స్ధాయి లోనే ఇంత భావ దరిద్రం ఉంటే, ఇక మన ఇంట్లో మన పక్కన ఇంట్లో మన బజారు లో ఉన్న, వారి అనుచరులలో, ఇంకెంత దరిద్రం ఉందో ఆలోచన చేయాలి.

ఇద్దరు పిల్లలు బీజేపీ, జనసేన తో ఇబ్బందులు లేదు, నాయకులు అధికారంలో లేరు, అదుపు తప్పలేదు. వారు మనకు ఉన్న సంస్కారానికి నచ్చరు.

మనం మారందే, మన పిల్లల సంస్కారం మారదు. మనం 10 తప్పులు చేసిన, మన పిల్లలు ఆనందంగా 100 తప్పులు చేస్తారు.

ఏళ్లుగా ఇవన్నీ రోజూ చూస్తూ, కన్నీరుమున్నీరుగా బాధ పడటం తప్ప, 4 మంచి మాటలు చెప్పడము తప్ప, మేమూ చేయగలిగింది ఏమీ లేదు. విలువలు లేని సంస్కారం లేని మనుషులు, ఓటర్లు నాయకులు, అధికారులు తో మన తెలుగు నేల కుళ్ళి పోతుంది.

అలాంటి నేలపై ఇలాంటి మనుషులు మధ్యలో, మన పిల్లల ను అంటే భవిష్యత్తు తరాలను వదులుతున్నాము, ఇంకా ఘోరంగా భయంతో పతనం తో ధూషణలతో బతకమని.

నాయకుల పని తీరుని ఎండగట్టే సామర్థ్యం లేని, మూర్ఖులు చేతకాని దద్దమ్మలు, ఇంట్లో ఆడవాళ్ళు గురించి మాట్లాడుతారు. అలాంటి వారినే మనం దగ్గర ఉండి గెలిపిస్తాము, అంటే ముందు మనకు సంస్కారం బాధ్యత ఉందా?

ఆడవాళ్లు ప్రస్తావన తెచ్చి, ఎక్కువగా అందరూ శునకానందం తో తమ తక్కువ బుద్ధి ని బయట పెట్టినది, పవనన్న విషయంలో. సిద్దాంతం పనులు గురించి మాట్లాడలేరు.

ఇప్పుడు చంద్రన్న విషయంలో కూడా. ఇలాంటి నాయకులు, ఇంక ఆదర్శ ప్రజా రక్షణ సంక్షేమ పాలన చేయగలరా?

మేమూ రోజూ దిగజారిన పరిస్థితి చూసి, కన్నీరు పెట్టిన వాటిలో కొన్ని చూడండి, కర్మ విడువదు కదా.

* చంద్రన్న ను గత రెండు ఏళ్లుగా వీలయినంత స్ధాయిలో అవమానించడం.

అయితే చంద్రన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవి జరిగాయి. అప్పుడు 10 సంఘటన లు ఉంటే , ఇప్పుడు 40 సంఘటన లు ఉన్నాయి, ఇంకా ఇంకా పెరుగుతుంది.

* మోడీ గురించి అవమానముగా మాట్లాడటం

* జగనన్న ను జైలులో పెట్టి, వాళ్ల ను అవమానించడం. ఇంతవరకు ఆ కేసులు వగతెగవు , ఏమీ తేలడం లేదు.

* ఒంటరిగా రాజన్న అకాల మరణం

* వెన్నుపోటు తో గుండె విలవిలాడుతూ నిస్సహాయత తో ఒంటరిగా రామన్న మరణం

* పవన్ కళ్యాణ్ ని అన్ని విధాలుగా తూలనాడడం

* ఇంకా ఎన్నో ఎన్నో . . ., మన తక్కువ బుద్ధి పతనావస్థకు నిదర్శనాలు

ఇతరుల ను అవమానిస్తున్నాం అంటే, మన తక్కువ బుద్ధి ని కుసంస్కారం ను ఆర్భాటంగా ప్రదర్శన చేస్తూ , దైవ నింద చేస్తున్నాము. మరువద్దు మిత్రమా, ఇంకా ఎన్నో కరోనాలు ప్రక్రుతి వైపరీత్యాలు కాపు కాసి ఉన్నాయి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2214 General Articles and views 2,474,712; 104 తత్వాలు (Tatvaalu) and views 265,885
Dt : 21-Nov-2021, Upd Dt : 21-Nov-2021, Category : General
Views : 891 ( + More Social Media views ), Id : 1278 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : suffer , abuse , jagan , pawan , chandranna , viranna , andhra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content