ఏ వ్రతమైనా సుఖమయ జీవన విధానానికి మార్గదర్శక సూత్రమే కదా - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పెళ్లి లేదా ఇల్లు గ్రుహప్రవేశం లేదా మంచి రోజులలో సత్యనారాయణ వ్రతం చేయడం మన సాంప్రదాయము. అందరూ కూడా స్తోమత తో నిమిత్తం లేకుండా, ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.

నిజానికి సత్యనారాయణస్వామి వ్రతమే కాదు, ఏ వ్రతమైనా, ఏ పూజయినా, ఏ ఆచారమైనా ఒక సదుద్దేశంతో ప్రారంభించినవే కదా. వాటి ద్వారా మానవాళికి కొన్ని విలువలు నేర్పాలనుకున్నారు. తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు వేయాలన్న తపన, మన పూర్వీకుల ఆలోచనలలో కనబడుతుంది.

ఉదాహరణకు సత్యనారాయణ వ్రతం విషయంలో, ఏ తేడా వచ్చినా, తమకు ఏదో అరిష్టం జరుగుతుందనే భయం ఉంటుంది. భగవానుడికి ఆగ్రహం వస్తే, జీవితం ఇబ్బందులు అవుతుందన్న భయమే, మనిషిని రుజుమార్గంలో నడిపిస్తుందని కావచ్చు.

సత్యనారాయణ వ్రత కథల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. కథ అనగానే అందులో నీతి ఏమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. భక్తితో పాటు సత్యదేవుని వ్రతకథ వెనక ఉన్న నీతిని కూడా అందరూ గ్రహించి దానిని తమ వ్యక్తిగత, భక్తి గత జీవితాల్లోనూ మనసా వాచా కర్మణా పాటించగలిగితే, పరస్పరం విశ్వాసం పెంపొంది ఐకమత్యత కలుగుతుంది.

సత్యదేవుడి వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే, వ్రతమాచరించిన వారికి కష్టనష్టాలు విచారాలు పోతాయని, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని, స్తీలకు సౌభాగ్యం కలుగుతుందని, అన్నిపనుల్లో విజయం సమకూరుతుందని మన నమ్మకము.  వ్రతం తర్వాత పూజా విధానం నిర్వహించిన పురోహితులకు, దక్షిణ తాంబూలాలిస్తారు. బంధువులు అందరికీ ప్రసాదవితరణ ఉంటుంది.

తర్వాత అందరికి భోజనాలు. ఇందువల్ల వ్రతం చేసిన వారికి, చూసిన వారికి ఆనందానికి ఆనందం, పుణ్యానికి పుణ్యం కలుగుతాయన్నది విశ్వాసం. ఇక అన్నింటికీ దేవుడే ఉన్నాడని భరోసా కలుగుతుంది.

అబద్ధాలు ఆడటం, దేవుణ్నే మోసం చేయడం, ఇచ్చిన మాట తప్పడం, మొక్కిన మొక్కును విస్మరించడం వంటి పనులు చేయరాదని బోధిస్తుంది సత్యనారాయణ  వ్రతం! సత్యం వద, ధర్మం చర అనేవి ఎవరైనా ఆచరించాల్సిన, ఆదర్శ జీవన సూత్రాలని నూతన దంపతులకు లేదా అందరుకూ ఎరుక పరుస్తుంది.

ఈ కథల్లో సాధువు, లీలావతి, కళావతి, సాధువు అల్లుడు, చంద్రకేతు మహారాజు వంటి పాత్రల ద్వారా మనుషులు ఎలా తప్పులు చేయకుండా ఉండాలో తెలుస్తుంది. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చెబుతుంది. పశ్చాత్తాపపడడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రేరణ కలిగించే ఈ కథలు మెచ్చదగినవి.

వ్యక్తిత్వ వికాసానికి ఇవి ఉపయోగపడతాయి. అన్ని వ్రతాల్లాగే, సత్యనారాయణస్వామి వ్రతం కూడా శుచినీ, శుభ్రాన్ని అలవరచుకునేట్టు చేస్తుంది. ఈ వ్రతం చేసేవారు రాజయినా, పేదయినా ఒకటే అన్న, సర్వమానవ సమానత్వాన్ని రూపుకడుతుంది. ఎవరినీ, ఏ పనిని నిర్లక్ష్యం చేయకూడదని ఉదహరిస్తుంది.

సర్వార్థ సిద్ధికి ఆడిన మాట తప్పరాదని, మోసాలకు దూరంగా ఉండాలని, భగవంతుడి ముందు పేదా ధనికా భేదం ఉండదనీ తెలియ చెబుతుంది. తద్వారా సామాజిక కల్యాణానికీ దోహదపడుతుంది. అంచేత ఇవన్నీ, ఛాందస సంప్రదాయాలుగా ఎవరూ భావింపనక్కరలేదని పెద్దలు చెబుతున్నారు.

మనసుపెట్టి చూస్తే, వీటిలోని మంచి ఉద్దేశ్యాలను భావనలను అర్థంచేసుకోవచ్చు. అందుచేత సుఖమయ జీవన విధానానికి మార్గదర్శక సూత్రం, ఈ లేదా ఏ వ్రతం అయినా అనడంలో సందేహం లేదు కదా.

సేకరణ మరియు సవరణ  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 15-Dec-2019, Upd Dt : 15-Dec-2019, Category : Devotional
Views : 780 ( + More Social Media views ), Id : 252 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vratam , puja , good life
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content