అనంత కోవిడ్ భోజనం భేష్, ప్రకాశం కోవిడ్ అధికారుల నిర్లక్ష్యం, జిల్లా సమాచారం నిద్ర లో - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1203 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1233 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చూడండి, మన ఫేవరెట్ అనంత కలెక్టర్ గారి ఫేస్బుక్ పేజ్ పొస్ట్, కోవిడ్ పేషెంట్లు కి, ఎంత మంచి పౌష్టిక భోజనము ఇస్తున్నారో?

ఆఖరికి, చికెన్ కూర కూడా పెడుతున్నారు, అత్త గారి ఇల్లులా, ఉచిత ప్రభుత్వ సొమ్ము అని. రోగికి అరుగుదల తక్కువ, ఇప్పుడు పొట్ట తేలికగా ఉండాలి, జీర్ణం అవ్వాలి. మరి వారు ఆలోచన చేసి దానిని తీసివేస్తే, బాగుంటుంది. ఆరోగ్యం పెరుగుతుంది, ప్రభుత్వ ధన ఖర్చు తగ్గుతుంది కూడా. link.

ఈ పోస్ట్ తర్వాత పోస్ట్ చూడండి, మొత్తము బెడ్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అని వివరముగా ఇచ్చారు.

ఇలా ప్రజల కు, ఉత్తమ కలెక్టర్ లేదా, జిల్లా మరియు పట్టణ ఆరోగ్యశాఖ సోషల్ మీడియా లో, వివారాలు ఫోటో వీడియో తో ఇస్తే, మీడియా కు, అలాగే ప్రజలకు చాలా నమ్మకము ఉంటుంది కదా, ఆ అధికారుల చిత్తశుద్ది మీద. అలాగె గ్రామ, పట్టణ అధికారులు కూడా, సోషల్ మీడియాలో పెట్టాలి ఆ ఫోటోలు.

ఇప్పుడు ఆ ఆసుపత్రి తరపున, భోజనము సప్లై చేసే కాంట్రాక్టర్ కూడా, భయపడతారు. ఎందుకంటే, ప్రజలు అందరూ నిలదీస్తారు. ఇదిగో మన జిల్లా కలెక్టర్ మరియు పట్టణ అధికారులు పెట్టిన ఫోటో, ఏదీ ఈ సంపూర్ణ సమతుల్య భోజనము ఎక్కడ అని?

ఆసుపత్రి సౌకర్యాలు మందులు సూదులలో, అవినీతి అక్రమాలు తగ్గుతాయి. స్థానిక సోషల మీడియాలో ప్రజలు కూడా పెడతారు, అక్రమాల ఫోటోలు అని భయము తో.

అందుకే 2 ఏళ్ళు గా, అధికారులు అందరినీ, సోషల్ మీడియా పెట్టండి బాబోయ్, కనీసం అనంత జిల్లా ను చూసి. అక్కడ అధికార్లు కూడా, మన లాంటి మనుషులే, కాకపోతే వారికి మానవత్వం బాధ్యత ఉంది, జీతానికి క్రుతజ్ఞతలు చూపుతున్నారు, సంస్కారం ఆత్మాభిమానం తో, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వత్తడం లేదు అంతే తేడా, అని మొత్తుకున్నాము.

మా ప్రకాశం జిల్లా అధికారులు, ఎప్పుడు అలసత్వం వీడి, నిద్ర మేల్కొంటారో? ఇవన్ని ఎప్పుడు జనానికి, పబ్లిక్ గా సోషల్ మీడియాలో పెట్టి, అవినీతి భాగోతాలను అరికడతారో?

ప్రకాశం జిల్లా, సమాచార శాఖ అధికారులు కూడా, ఉచిత జీతాలు తీసుకుంటున్నారు. వారిని గతము లో ప్రశ్నలు అడిగాము, ఇంకా జవాబులు రాలేదు, సంవత్సరము గా. 3 ఏళ్ళ తర్వాత, కొత్త ప్రభుత్వము లో జవాబు ఇస్తారేమో, జనము మిగిలి ఉంటే?

కర్నూల్ జిల్లాలో అనుకుంటా, నేరుగా జిల్లా సమాచార శాఖనే, సోషల్ మీడియా నడుపుతుంది, కలెక్టర్ తో తలనొప్పి మా కొద్దు అని. మరి మా సమాచార అధికారులు కు, అది ఎందుకు చేత కాదో, అసలు వారు ఒంగోల్ ఆఫీస్ లో కూర్చొని, ఏమి చేస్తారో తెలీదు.

2 ఏళ్ళు గా ఇతర జిల్లా ఫేస్బుక్ లింక్ లు, నేరుగా మేమే పంపాము వారికి వెతకడం చూడడం రాదని. అంటే క్రిష్ణ, గుంటుర్, కడప, చిత్తూర్ జిల్లా వి సోషల్ మీడియా చూసి, అయినా కాపీ కొట్టి, పని నేర్చుకోవచ్చు, మనకు సొంత తెలివి లేనప్పుడూ. అదీ చేయమని అంటే ఎలా? అడిగే నాధుడూ లేడు. మన మాటలు, వారికి ఎక్కవు.

సీయెం జగనన్న చల్లని చూపు, మా ప్రకాశం అక్రమాలపై నిర్లక్ష్యం పై, ఎప్పుడు పడుతుందో?

జిల్లా ప్రజల రక్షణ క్షేమం అభివ్రుద్ది, విలువ లేని బంతి లాగా, గత ఉపయోగం లేని తెదేపా మంత్రి సిద్దా చేతి లో నుంచి నేటి ఉపయోగం లేని వైకాపా మంత్రి బాలినేని, చేతిలో పడి, గిల గిలా కొట్టుకుని అల్లాడుతుంది. వారిద్దరు కలసి మెలిసి నవ్వుకుంటూ, హాయిగా భోజనాలు చేస్తున్నారు, పిచ్చి జిల్లా జనాలను హేళన చేస్తూ.

రేపు తెదేపా గెలిచినా, మన బతుకులు ఇంతే. రోగం వస్తే, మన ఎమ్మెల్యే ఎంపీ ఎప్పటిలా హైదరాబాద్ ఆసుపత్రి కి, సామాన్యుడు ఎప్పటిలా ప్రభుత్వ దవాఖానా నుంచి వల్లకాటికి లేదా ఆస్తులు అమ్ముకుని రోడ్ మీదికి, 20 ఏళ్ళ మన సత్ సాంప్రదాయం లో మార్పు రాదు.

దేవ దేవా, కాపాడు మా జిల్లాను, నిర్లక్ష్య రాజకీయ అక్రమార్కుల నుంచి. జిల్లా అధికార్లకు ధైర్యం సంస్కారం ఇచ్చి, రాజకీయ పడగ నుంచి, బయటకు తీసుకొచ్చేది ఎవరు? దేవుడు (జగన్) వరమిచ్చినా, పూజారులు (అధికారులు నాయకులు) అడ్డు పడటం, అంటే ఇదేనేమో?

ప్రకాశం జిల్లాలో కరోనా ఎమర్జెన్సీలో, ఆసుపత్రులు – నోడల్ అధికారుల వివరాలు నంబర్లు ఇచ్చారు. అది కాదు ప్రజలకు కావల్సింది జవాబు దారీ తనం. వారు ఫోన్ ఎత్తరు, జవాబు చెప్పరు. అక్రమాలకు నిర్లక్ష్యం కు, ఫేస్బుక్ సాక్ష్యం ఉండాలి.

మాతో రెవెన్యు పంచాయితీ కలెక్టర్ శాఖ ఫోన్ నంబర్ ఉంది, వారు పలకరు జవాబు చెప్పరు, ఇంక ఆ నంబర్ తో ఉపయోగం ఏముంది?

అందుకే, ప్రకాశం కలెక్టర్ గారు మరియు నీతి గల వైద్య శాఖ అధికారులు, దయచేసి ఒంగోల్ చీరాల పర్చూరు మార్కాపురం కనిగిరి కందుకూర్, స్థానిక ఆరోగ్య శాఖ సోషల్ మీడియా పీజీలు పెట్టి, ప్రజలకు లింక్ లు ఇవ్వండి. సమస్యలు అందులో చెప్పమని చెప్పండి. వెంటనే ఆ సమస్యలపై చర్యలు తీసుకోండి. సోషల్ మీడియా ఉచితమే కదా?

కరోనా సమయములో ప్రజలకు అండగా నిలవండి. రాజకీయ నాయకుల కు కాంట్రాక్టర్లకు, దాసోహం మానండి, బాధ్యత గుర్తెరగండి.

బాధ్యత గల ఎమ్మెల్యేలు, ఓ సామాన్య విలేఖరి, మన అస్సెంబ్లీ స్థాన మరియు జిల్లా ప్రజల క్షేమం కోసం, 2 ఏళ్ళు గా, లక్ష పదాలతో అడుగుతుంటే, ఇలా గమ్మున చేవ చచ్చి కూర్చోరు.

అలాంటి నీతి లేని ఎమ్మెల్యేలను గెలిపించి నందుకు, మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి అని ప్రజలు ఆక్రోశం వ్యక్తము చేస్తున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1233 General Articles, 47 Tatvaalu
Dt : 03-May-2021, Upd Dt : 03-May-2021, Category : Politics
Views : 108 ( + More Social Media views ), Id : 1148 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ananta , kovid , meals , prakasam , negligence , officers , district , info , pr , sleep , jagan , balineni , sidda , collector
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content