అనంతపురం జిల్లా ఆరోగ్య శాఖాధికారులు, కర్తవ్యంతో బాధ్యతతో, ఫేస్బుక్ లో, పౌరుల కు సమాచారము - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1281 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1311 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అనంతపురం జిల్లా ఆరోగ్య శాఖాధికారులు, కర్తవ్యంతో బాధ్యతతో ఆత్మాభిమానం తో, తమ ఫేస్బుక్ లో, తమ జిల్లా పౌరుల కు ఇచ్చిన సమాచారము ఇది - పై ప్రాంతాలతో పాటు పిహెచ్సీ లు, సిహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల నుండి కూడా, కోవిడ్ శాంపిల్స్ సేకరించనున్నారు. Link.

ఈ అవకాశాన్ని వినియోగించు కోవలసిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ గారు ఇంకో అడుగు ముందుకు వేసి, ఇన్స్టాగ్రాం లో కూడా, ఫోటోలు పెడుతున్నారు, ఎప్పుడు నుంచో. గతములో కూడా, మనము చంద్రుడు గారిని, పొగుడుతూ ఆర్టికల్ రాశాము - అనంతపురం కు చంద్రుడి లాగా, గంధపు వాసనల ప్రజా పనులతో - మొదటి డిపార్ట్మెంట్ సోషల్ మీడియా. link.

అలాగే, మున్సిపాలిటీ, ఎమ్మార్వో, పంచాయితీ, గ్రామ సచివాలము కూడా సోషల్ మీడియాలో పెట్టాలి. మీ ప్రాంతము లో, ఇవి ఇప్పటికే ఉంటే లింక్ ఇవ్వండి, అందరికి ప్రచారము చేద్దాము, ఇతర అధికారులు నేర్చుకోవాలి.

మాకైతే, ఎంతో సంతోషముగా ఉంది, అనంతపురం జిల్లా పోస్ట్ చూసి. ఇతర జిల్లాలు కూడా, జగనన్న ప్రభుత్వం ను గౌరవించి, 2019 ఆగష్టు లో ఆపిన, సోషల్ మీడియాలను తిరిగి చిత్తశుద్ది తో, మొదలు పెడతారు అని ఆశిస్తున్నాము, ప్రజల తరపున అర్ధిస్తున్నాము.

ఒక రకముగా ఇది, ఆ అధికారులకు కూడా ప్రచారమే, అయినా వారు ఇష్టపడటము లేదంటే, ఇక వారి వలన, ప్రజలకు, ప్రభుత్వానికి మంచి జరుగుతుందా? వారు బదిలీ కోసం కావాలని, రాష్ట్రం ను జగనన్న ను అవమానిస్తూ ఉన్నారా, ఇలాగ సోషల్ సమాచారం పెట్టకుండా? విచిత్రం.

మీరు చెప్పండి, జగనన్న లేదా ఏ ప్రభుత్వానికైనా సరే, ప్రభుత్వ పధకాల సమాచారం ను, ప్రజలకు అందుబాటులో ఉంచే అధికారులే గదా, ఉత్తములు, సన్నిహితులు, ప్రజా బంధువులు. ఈ రోజుల్లో 10 వ తరగతి పిల్లవాడు కూడా, సోషల్ మీడియా వాడుతున్నారు, స్నేహితుల లేదా సినిమా కోసమో. మనం, జీతం సౌకర్యాలు పొందుతూ చేయకపోతే ఎలా? ఎమ్మెల్యే ఎంపీ జగనన్న, అడిగితేనే చేస్తామా?

కలెక్టర్ గట్టి వారు, నిజాయితీ పరులు అయితే, జిల్లా అధికారులు అందరూ అదే బాట పడతారు. నాయకుడే, ప్రభుత్వం ను లెక్క చేయను, జగనన్న పధకాల అమలును, జిల్లా అధిపతిగా, నేనెందుకు పెట్టాలి అనుకుంటే, ఆ జిల్లా అధికారులు అంతా, అంతేగదా?

ఇది ప్రతి ప్రభుత్వ అధికారి ఆత్మాభిమానమునకు, పని తనానికి టెక్నాలజీకి పరీక్ష, నేను నిబద్దతతో పని చేస్తున్నా, నా ప్రజలుకు నేను చెప్పాలి, ఇది నా కర్తవ్యము అని, ప్రతి అధికారి తనే అనుకోవాలి, గ్రామం నుంచి పట్టణ ,జిల్లా, రాష్ట్రం వరకు. పై అధికారులు, బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, చెప్పక్కరలేదు.

గ్రామ సచివాలయాలకు కూడా, సోషల్ మీడియా ఉండాలి. వారి సేవలు, ప్రతి వ్యక్తికి తెలియాలి. ఇది గొప్పలు చెప్పుకోవడము కాదు, ప్రజలకు సమచారం ఇవ్వడము, తప్పదు. ప్రపంచం అంతా ఇలాగే చేస్తుంది.

మా ప్రకాశం జిల్లా తో పాటుగా 7 జిల్లాల అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారో ఇవి? ఎప్పుడు మేల్కొంటారో, మొదలు పెడతారో? అందుకే మేము అడిగేది, మంచి జిల్లా అధికారులను డిప్యుటేషన్ మీద తెమ్మని, వీరి ట్రైనింగ్ కి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1311 General Articles, 47 Tatvaalu
Dt : 07-Oct-2020, Upd Dt : 07-Oct-2020, Category : Request
Views : 357 ( + More Social Media views ), Id : 740 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : anantapur , district , health , officers , facebook , information , citizens , gandham , chandrudu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content