Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఫోన్ నంబర్లు, దిశా లాంటి ఎన్నో యాప్ లు
* పోలీసుల సేవను చూసి, కన్నీళ్లు పెట్టుకున్న
* ఒక్క శాఖ మాత్రమే, 24 గంటలు నడిరోడ్డుపై
* ప్రకాశం ఎస్పీ, ఒకేసారి 50 మంది
* గుంటూరు ఐజీ త్రివిక్రం మొదటి సారిగా
* స్పష్టంగా స్ధానిక డీఎస్పీ, సీఐ, ఎస్సై పేర్లు కూడా
* డీఎస్పీ, సీఐ స్ధాయిలో స్ధానిక ఫేస్బుక్ పేజీలు?
* జిల్లా పోలీసు కేంద్ర నంబర్లు, ఒక చోట
2 min read time. పోలీసులు అంటే భయపడవద్దు, వారు మన రక్షకులు. ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు ఎస్సై, సీఐ, డీయెస్పీ, ఎస్పీ, జిల్లా పోలీసు, ఐజీ, డీజీపీ అందరి ఫోన్ నంబర్లు, దిశా లాంటి ఎన్నో యాప్ లు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, మన రక్షణ సౌకర్యములకు, వాటిని వాడుకోవాలి.
మా జీవిత కాలంలో, మొదటి సారిగా, రాష్ట్రం దేశం మొత్తం మీద పోలీసుల సేవను చూసి, కన్నీళ్లు పెట్టుకున్న సంవత్సర కాలం (2020), ఒకే ఒకటి ఉంది.
మనందరినీ క్రమశిక్షణలో పెట్టాలని, కరోనా గురువు పెట్టిన పరీక్షా కష్ట సమయంలో, మనమంతా కుటుంబం తో ఇంట్లో దాంకుంటే, కేవలం ఆ ఒక్క ప్రభుత్వ శాఖ మాత్రమే, 24 గంటలు నడిరోడ్డుపై నిలబడి తమ ప్రాణాలు పోయినా, తమ కుటుంబం ఏమైనా, పరవాలేదు అని ధైర్యంగా నిలిచింది, వీరు ఒక్కరు మాత్రమే. శిరస్సు వంచి వందనాలు వారి త్యాగ వీరులకు.
ఆ తరువాత నే డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మిగతా 8 గంటలు గదులలో పనిచేసే వారి సేవలు. మరలా వీరికి రక్షణ కూడా పోలీసు వారే. మన రాష్ట్ర పోలీసు శాఖకు ఎన్నో ఉత్తమ అవార్డులు వచ్చాయి కూడా.
మన ఇంట్లో చెడ్డ వారు ఉన్నట్లే, ప్రతి శాఖలోనూ ఉంటారు. కానీ మనసున్న అధికారులు ఉంటారు, స్పందిస్తారు, మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
ప్రకాశం ఎస్పీ కౌశల్, ఒకేసారి 50 మంది పైగా అధికారులు ను, బదిలీ చేశారు. ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. రాజకీయ వత్తిడి కి లొంగరు.
గుంటూరు ఐజీ త్రివిక్రం గారు మొదటి సారిగా, ధైర్యంగా ఫోన్ నంబరు ఇచ్చారు, ప్రజలకు దగ్గరగా ఉండటానికి. అలాగే సోషల్ మీడియా కూడా ఇవ్వమని కోరాము.
ఎస్పీ నుంచి పై స్ధాయి ఐపీఎస్ అధికారులు, కింది స్ధాయి నాన్ ఐపీఎస్ అధికారులు ను, సరిగ్గా గౌరవించడం లేదని, బాధ చాలా మంది లో ఉంది. అదే బాధ ఐఏఎస్ అధికారులు, కింది అధికారులు ను గౌరవించడం లేదు, అని సివిల్ అధికారులు లో ఉంది కూడా.
అందుకే అన్ని జిల్లా పోలీసు ఫేస్బుక్ పోస్ట్స్ లో, కేవలం ఎస్పీ భజన మాత్రమే గాకుండా, స్పష్టంగా స్ధానిక డీఎస్పీ, సీఐ, ఎస్సై పేర్లు కూడా గౌరవం గా, మరువకుండా పలకరించమని అభినందించమని, పలుమార్లు విన్నవించాము.
అలాగే డీఎస్పీ, సీఐ స్ధాయిలో స్ధానిక ఫేస్బుక్ పేజీలు పెట్టి, వారి సేవలను త్యాగాలను ఎక్కువగా తెలుపమని, 2 ఏళ్లుగా ప్రాధేయపడటం వెంటపడటం మీకు తెలుసు.
అలాగే పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య, ఎమ్మార్వో, విద్యా అధికారులు ను అడిగాము.
మనందరి రక్షణ కోసం, వెంటనే స్పందించడం కోసం, ఆంధ్రా పోలీసులు, ప్రతి జిల్లా కు ఓ వాట్సప్ నంబరు, సోషల్ మీడియా పేజీ కేటాయించారు. అలాగే అందరు అధికారుల నంబర్లు యాప్ లు అందుబాటులో ఉంచారు.
ఆంధ్రా ఐఏఎస్ కలెక్టర్ లు చేయలేని పని, అంటే 13 జిల్లా లలో సోషల్ మీడియా నడపడం చేతగాని పని, ఆంధ్రా ఐపీఎస్ ఎస్పీ లు చేసి చూపించారు. నియమ నిబద్ధత క్రమశిక్షణ లలో, సోషల్ మీడియా తో ప్రజలకు దగ్గరలో, ఐపీఎస్ లే మేటి అని నిరూపించారు. హాట్సాఫ్ ఐపీఎస్ ఆఫీసర్లు.
ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తముగా, ప్రతి జిల్లా లో జరిగే సేవ లేదా కార్యక్రమము లేదా డ్యూటీ గురించి, కనీసము ఒక ఫేస్బుక్ పోస్ట్ పెడుతూ, ముఖ్యమైనవి రాష్ట్ర పోలీసుల వెబ్సైట్ లో నూ పెడుతున్నారు నిబద్దతగా.
అన్ని జిల్లా ల పోలీసు కేంద్ర నంబర్లు, ఒక చోట మీ సేవకై పొందుపరచాం.
link. మీరు విదేశాల్లో ఉన్నా, మీ జిల్లా పోలీసు అధికారులు కు నేరుగా, మర్యాద తో కూడిన సందేశం పంపవచ్చు.
జాగ్రత్తలు సుమా, మర్యాద ధన్యవాదాలు మరువద్దు. తప్పులు ఉన్నా, వారు మన్నించి సరిచేసి దోవచూపి, పబ్లిక్ ను అలాగే మీడియా ను ఉత్సాహపరచాలి.
మన మెసేజ్ కి, వారు కూడా మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు, అంటూ తగిన సమయం కోరుతూ, జవాబు మెసేజ్ పెట్టాలి. వారికి ఎన్ని ఫ్రెండ్లీ పోలిసింగ్ శిక్షణలు ఇచ్చినా, ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు.
మంచి అధికారులు మారుతూ ఉంటారు, ఎప్పుడు కు అయినా అర్థం చేసుకునే, వారూ వస్తారు సుమా.
మీరూ ఉపయోగించుకోండీ అత్యవసర సమయాలలో. కొన్ని మార్పులు తప్పులు ఉండవచ్చు, పేర్లు నంబర్లు లో.
మీకు తెలిసిన మార్పులు తప్పులు ఉంటే, మాకు సాక్ష్యం తో పంపితే, సరి చేయగలము. అలాగే 100, 108 లాంటి నంబరు లు కూడా ఇవ్వబడ్డాయి చూడగలరు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,274,312; 90 తత్వాలు (Tatvaalu) and views 175,281 Dt : 06-Apr-2021, Upd Dt : 06-Apr-2021, Category : General
Views : 575
( + More Social Media views ), Id : 1077 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
andhra ,
ias ,
collectors ,
13 districts ,
social media ,
ips ,
aaps ,
phone ,
fb ,
twitter ,
prakasam ,
sp ,
guntur ,
ig Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments