ఆత్మ పరమాత్మ సంగమం - శివైక్యం చెందిన వారి బంధువులు స్నేహితులు కి ప్రగాఢ సంతాపం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,569; 104 తత్వాలు (Tatvaalu) and views 226,171.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి భగవద్గీత 2-27

పుట్టినవానికి మరణం తప్పదు, మరణించినవానికి పుట్టుక తప్పదు, తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో దుఃఖించడం తగదు.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? అని యక్షప్రశ్నలలో యక్షుడు యుధిష్టరుడిని అడుగుతాడు.

చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తూనే ఉన్నా, నేను మాత్రం చావను, అనుకుంటాడు మనిషి. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం! అని జవాబిస్తాడు ధర్మరాజు.

చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి, ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి.

చావు అన్నదే లేని ఇంటి నుంచి, కొన్ని ఆవగింజలు తెస్తే, వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు.

ఇంతేనా, వెంటనే తెస్తా అదెంతపని, అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి, తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది, అప్పుడు ఆమెకు ప్రాపంచిక బ్రమలు మాయలు తొలిగి, సత్యం అర్ధం అవుతుంది.

మరి మనకు? 30, 60, రోగం, చివరి దశలోనా? ఎప్పుడు జ్ఞానం వస్తుంది, ఎప్పుడు గీత ను ఆచరణలో చూపుతాము, మనలో దైవత్వముతో స్వార్ధం వీడి?

ఏ క్షణంలో నైనా చావు రావచ్చు, కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి, ఈ క్షణమే చివర అనుకుని, మంచి కొసం ప్రయత్నం సాధన చేసే వాడే, వాడే బ్రహ్మజ్ఞాని.

మన రాకలు, మన పోకలు కర్మలు రాతలు, మన చేతుల్లోనే వున్నాయి. వాటికి మనమే సృష్టి కర్తలం, కర్త కర్మ క్రియ.

సందేశం -

మన వారి గురించి ఇప్పుడే వార్త చూసాము, దేవుని పిలుపుతో, శివైక్యం చెందారని, ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాము. ఆ బాధ ఎలా ఉంటుందో లోక జ్ఞానం ఇచ్చిన కన్న తండ్రిని పోగొట్టుకున్న, 77 ఏళ్ల తూలిపడే సజీవ గురువు తల్లి సేవ 8 ఏళ్లుగా చేసుకుంటూ ఉన్న పిల్లలు కే బాగా తెలుస్తుంది, పోగొట్టుకున్న వ్యక్తుల జీవిత విలువ అండ. వారు ఉన్న నాడు, జీవితం విలువ అర్థం కాదు, ఇంకొకరు చెప్పిన కూడా వినము మాయలో.

దేవుని దయవలన వారికి, సద్గతులు మరియు ఉత్తమ జన్మలు కలగాలని ఆశిస్తూ,

బతికి ఉన్న మనము కూడా, మన పెద్దల తాతల గురువుల నుంచి వచ్చిన సత్ గుణ కర్మల ద్వారా, ఇప్పుడైనా ప్రాపంచిక విష్యాలు భోగాలు పరుగులు అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు వీడి, త్రికరణ శుద్ది తో, ఉత్తమ మంచి పనులు చేస్తూ, మంచి వారికి అండగా ఉంటూ, మంచి ని పెంపొందిస్తూ ప్రోత్సాహం చేస్తూ, గత పాపాలను తప్పు లను ఒప్పుకుంటూ పశ్చాత్తాపం పడుతూ, ధన సంబంధం కాని, పుణ్యం పెంపుదల లో నిమగ్నం అవుదాం,

పదిమంది కి గట్టిగా మన జీవిత అనుభవం తో, చివరి దశలో, ఉత్త చేతులతో పైకి వెళ్ళే మనకు, తోడు వచ్చే ది, కేవలం పుణ్యం గుణం త్యాగం నిస్వార్ధం మాత్రమే అని, అవే ఉత్తమ జన్మలను సద్గతులను ఇస్తాయని, ప్రాపంచిక మోహాలు నేటి జన్మలో పతనము నకు మరియు వచ్చే జన్మలో దారుణ పరిస్తితికి దోవ అని, చెబుదాం, అని మనస్ఫూర్తిగా బాధా నిండిన మనసు తో, తోటి మానవత్వం ఉన్న మనిషి గా కోరుతూ.

మీ శ్రేయోభిలాషి, ఆత్మబంధువు, భగవత్ సోదర సోదరీ సంతానము

Atma Paramatma Sangam sadgati best next birth - Deepest condolences to the death people relatives  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,569; 104 తత్వాలు (Tatvaalu) and views 226,171
Dt : 10-Oct-2022, Upd Dt : 10-Oct-2022, Category : General
Views : 373 ( + More Social Media views ), Id : 1578 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : atma , paramatma , sangam , sadgati , birth , deepest , condolences , death , people , relatives , friends
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content