పాటతో పరమార్ధం - ఆడువారి మాటలకు(పేరడీ) - మిస్సమ్మ - ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,863; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Avunante Kaadanile Aaduvari Matalaku (Parody) - Missamma - NTR, ANR, SVR, Savitri, Jamuna

పాటతో పరమార్ధం - అవునంటే కాదనిలే, ఆడువారి మాటలకు(పేరడీ) - మిస్సమ్మ - ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున

అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు, అర్దాలే వేరులే అని ఆనాడు పాట రాశారు.

ఆడువారైనా పాడువారైనా మగవారైనా, కపట నటన 2 నాల్కల లక్షణాలు అలాగే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేకపోతే, ఎప్పుడూ వారి మాట మరియు బాట ఒకటే. అంటే. అవునంటే అవుననిలే, కాదంటే కాదనిలే, మంచివారి మాటలకు, అర్దాలే బాగులే అర్దాలే నేరులే.

మా పెద్దాడు బీజేపీ, 2వ వాడు తెదేపా, 3 వ వాడు వైసీపీ, 4 వ చిన్నోడు జనసేన. అందరూ మా (మన) పిల్లలే. అందరికీ మన దీవెనలు కావాలి, అలాగే మనము బుద్ది కూడా చెప్పాలి. వింటారా వినరా, వారి ఖర్మ. మనము వాళ్ళ ఇంట్లో ఉండం, వారితో తిరగం.

పెళ్ళిళ్ళు అయ్యి వారి వేరు కాపురాలు, కాబట్టి వారి పాపాలతో పుణ్యాలతో, మాకు సంబంధం లేదు. మా పిల్లలు 4 గురు చేసే తప్పుడు వాటిని సమర్ధించము, 4 గురు చేసే మంచిని పొగుడుతాము. మనల్ని తిట్టుకున్నా, మనము వారి మంచి కోరి, ఉన్నది ఉన్నట్లు గా చెప్పాలి అంతేనా. ఇప్పుడు ఇంక జీవిత పాటలు పాడుకుందాము, పాఠాలు నేర్చుకుందాము.

మనము చేసే పనులు నచ్చక, అలగి తొలగి ఉన్నది ఉన్నట్లుగా మొఖము మీద అరచినచో, భవిష్యత్ కష్టాల కన్నీరు మనకు వద్దనిలే. అలా కాకుండా మన మాటలకు చేష్టలకు, చొరవ చూపి నవ్వినచో, ఇక మనకు ఎప్పుడూ మనశ్శాంతి వచ్చునులే.

మన జీవితములో ప్రతి విషయము రోజూ/ వారమూ/ నెలా వింటూ, మన పొరపాట్లు, విసిగి నసిగి చెప్పినచో, వాటిని మనము వెంటనే సరి చేసుకున్నట్లయితే, ఇక మన జీవితము ఎల్లకాలము భద్రములే. మన పనులు మోహ బ్రమల నిర్లక్ష్యము తో ఉన్న, తరచి తరచి వద్దనినా, మన కపటమింక చాలనిలే, భవిష్యత్ లో పంచభూతాల శిక్షణ తప్పదనిలే.

మనం నిజాయితీగా ఉంటే, మనకు నిజాయితీ గా ఉండే బంధాలు, స్నేహాలు దొరుకుతాయి, మనల్ని కాపాడతాయి. మనము కపటముగా ఉంటూ, ఇతరులు మాత్రం నిజాయితీ గా ఉండాలి అంటే కుదరదు.

కపట నటన 2 నాల్కల వారిని ఎలా తెలుసుకోవాలి అంటే, చాలా తేలికా - 1. ఎప్పుడు కూడా, తమ ముదుసలి తల్లి తండ్రి అత్త మామ ల సజీవ సేవ గురించి మాట్లాడరు, కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. 2. అప్పులతో ఆడంబరాలు సరదాలు భోగాలు లేకుండా బతకలేరు 3. తమ సొంత సంస్కార బిడ్డల దగ్గర తమ ముదుసలి తనములో దేవతలు గా పూజింప బడతామని బల్లగుద్ది సాక్ష్యాలతో చెప్పలేరు.

ఇకనైనా మనుషులు గా మారదాము, నీతి నిజాయితీతో, జీవహింస తిండి లేకుండా, అప్పుల వైభోగం లేకుండా, సొంత కష్టార్జితముతో, పచ్చడి చాప పాక అయినా, సింపుల్ గా ఉందాము. మంచిని పంచుకుందాము, మనశ్శాంతి పెంచుకుందాము. ఇదే ధర్మాన్ని కాప్డు అది మనల్ని కాపాడుతుంది అంటే మిత్రమా.

Parody

అవునంటే అవుననిలే, కాదంటే కాదనిలే 2
మంచివారి మాటలకు, అర్దాలే బాగులే
అర్దాలే బాగులే., అర్దాలే బాగులే

అలగి తొలగి అరచినచో 2 కష్టాల కన్నీరు వద్దనిలే
చొరవ చూపి నవ్వినచో 2 మనశ్శాంతి వచ్చునులే ||మంచివారి ||

విసిగి నసిగి చెప్పినచో 2 మనజీవితము భద్రములే
తరచి తరచి వద్దనినా 2 కపటమింక చాలనిలే ||మంచివారి ||

అవునంటే అవుననిలే, కాదంటే కాదనిలే 2
మంచివారి మాటలకు, అర్దాలే బాగులే
అర్దాలే బాగులే., అర్దాలే బాగులే

Original

అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే 2
ఆడువారి మాటలకు, అర్దాలే వేరులే
అర్దాలే వేరులే., అర్దాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో 2 చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో 2 మరియాదగా పొమ్మనిలే ||ఆడువారి||

విసిగి నసిగి కసిరినచో 2 విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన 2 సరసమింక చాలనిలే ||ఆడువారి||

అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే 2
ఆడువారి మాటలకు, అర్దాలే వేరులే
అర్దాలే వేరులే., అర్దాలే వేరులే  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,863; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 28-Sep-2023, Upd Dt : 28-Sep-2023, Category : Songs
Views : 219 ( + More Social Media views ), Id : 1930 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Avunante , Kaadanile , Aaduvari , Matalaku , Parody , Missamma , NTR , ANR , SVR , Savitri , Jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content