Have power to buy bed but sleep on floor mats? in our country? believe! That much mind control? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,974; 104 తత్వాలు (Tatvaalu) and views 226,376.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Have the power to buy bed but sleep on floor mats? Is it here in our country? We do not believe! That much mind control?*
*మంచాలు కొనే శక్తి ఉండి, నేల చాప నిద్రనా? అది ఇక్కడ మన దేశములో? మేము నమ్మము గాక నమ్మము! అంత మానసిక నియంత్రణా?*

*Response* - Message we received on Feb 11, 24 - Today there is a program for seniors here in the temple, whether you are coming there for God's darshan, or for voluntary work, we are blessed to meet the best punya folks like you. let's see God wish.

*స్పందన* - ఫిబ్రవరి 11, 24 న మాకు వచ్చిన సందేశం - ఈ రోజు సీనియర్ ల కార్యక్రమం ఉంది ఇక్కడ దేవాలయములో, మీరు అక్కడకు వస్తున్న దేవుని దర్శనం కోసం, లేదా వాలంటరీ పని కోసం అయినా, అక్కడనే మీలాంటి ఉత్తములను కలసే భాగ్యం/ పుణ్యం మాకు కలుగుతుంది. చూద్దాం ఈశ్వరేచ్చ అన్నారు.

It was sent to us along with everyone else. Oh, there is a good program going on, so told those close to him, but before we thought, they sent us just for information.

ఇది అందరితో పాటుగా మాకు పంపారు. ఓహో ఏదో మంచి కార్యక్రమం జరుగుతున్నది కాబోలు దగ్గరి వారికి చెప్పారు లే, సమాచారం కోసం మాకు పంపారు అనుకున్నాము ముందు.

But then there is something more to it. We are abroad, in another state, in another direction (east/west/north/south), far away. And why did they send us knowing that, we will not come? There is only 4 hours to complete the program. Missing any, divine work Satsang?

కానీ తర్వాత ఇందులో ఏదో గూఢార్ధం ఉన్నది. మనము ఉన్నది విదేశం లో, ఇంకో రాష్ట్రం లో, ఇంకో దిక్కు లో (తూర్పు/ పడమర/ ఉత్తర/ దక్షిణం) లో, చాలా దూరముగా. మరి మనము రాలేమని తెలిసి కూడా ఎందుకు పంపారు? 4 గంటలు మాత్రమే సమయం ఉన్నది, కార్యక్రమం పూర్తికావడానికి. ఏదైనా, దైవ కార్య సత్సంగం మిస్ అవుతున్నామా?

Thinking if we will have an hour class tomorrow in the slavery of Arishadvarg Ashtavyasan again, then the idea struck.

రేపు మరలా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఉన్నామా, అని మనకు ఓ గంట క్లాసు ఉంటుందేమో అని ఆలోచిస్తే, అప్పుడు ఐడియా తట్టింది.

We are also sending the Saturday sadhanas that you send, to our friends, near you. They don't believe our words.

మేము మీకు దగ్గర లో ఉన్న, మా మిత్రులకు, మీరు పంపే శని వార సాధనలు పంపుతున్నాము కూడా. వారు మా మాటలు నమ్మడం లేదు.

Are there any crazy people these days who do over 200+ weeks, 108 pradakshina, even in the cold? Are there, those who hold the hand of an 78+ years old mother and do a living guru Seva for 10+ years, instead of turning around holding a girl's hand? We should not eat meat, but we are eating it, but they able to eat it and not eating it?

ఈ రోజుల్లో ఇలా 200+ వారాల పైగా, 108 ప్రదక్షిణలు, చలిలో కూడా చేసే పిచ్చి వారు ఉన్నారా? అమ్మాయి చెయ్యి పట్టుకుని తిరగకుండా, 78+ ఏళ్ళ ముదుసలి అమ్మ చెయ్యి పట్టుకుని, 10+ ఏళ్ళు సజీవ గురువు చేసే వారు ఉన్నారా? మేము మాసం తినకూడదు, అయినా తింటుంటే, వారు తినగలిగి ఉండి, తినడం లేదా?

Have the power to buy bed but sleep on floor mats, 20+ years? Is it here in our country? We do not believe! That much mind control? They said that absolutely we can't believe. Is he playing with own mind? But we are played by our mind, lol.

మంచాలు కొనే శక్తి ఉండి, నేల చాప నిద్రనా, 20+ ఏళ్ళు? అది ఇక్కడ మన దేశములో? మేము నమ్మము గాక నమ్మము! అంత మానసిక నియంత్రణా? మేము నమ్మము గాక నమ్మము అన్నారు ఇన్నాళ్ళు. ఆయన తన మనసుతోనే ఆడుకుంటున్నారా? మరి మనము మన మనసుతో ఆడుకోబడుతున్నాము కదా, హ హ.

We said that when the time comes, we will show them to you, and then you will believe. Must show, said that our children will get the fortune of showing a good role model mother. We have said in the past that they have known us for years, all of our friends. Now there are 2 families near the temple you are going to.

సమయం వచ్చినప్పుడు వారిని, మీకు స్వయముగా చూపిస్తాము, అప్పుడే నమ్ముదురు లే అని చెప్పాము. తప్పక చూపించండి, మా పిల్లలకు మంచి ఆదర్శ తల్లిని చూపే భాగ్యం దక్కుతుంది అని అన్నారు. వారు మాకు ఏళ్ళు గా తెలుసు అని గతములో చెప్పాము, మా స్నేహితులు అందరికీ. ఇప్పుడు 2 కుటుంబాలు, మీరు వెళుతున్న దేవాలయం దగ్గరలో నే ఉన్నాయి.

Immediately, we called them and told them that if you go to that temple in 4 hours, they will appear. They said they will definitely go, it will be ready in 2 hours. We told them clearly that there is a program and mom's responsibility to take care of it, no other words except hey bye. They said ok.

వెంటనే, వారికి ఫోన్ చేసాము, మీరు 4 గంటలలో ఆ గుడికి వెళితే, వారు కనపడతారు అని చెప్పాము. వారు తప్పకుండా వెళతాము, 2 గంటలలో తయారు అయి అని అన్నారు. వారికి స్పష్టముగా చెప్పాము, అక్కడ కార్యక్రమం మరియు అమ్మ బాధ్యత చూసుకోవాలి, ఊరికే హయ్ బాయ్ తప్ప వేరే మాటలు వద్దు అని చెప్పాము. వారూ సరే అన్నారు.

We informed you immediately, send a photo and you said no problem, you can meet them along with everyone. They came and wished you. You also bowed, showed Mom. They bow and sit away, not bothering you.

మీకు వెంటనే తెలియ చేస్తే ఫోటో పంపి, పర్లేదు, అందరితో పాటూ అక్కడ పలకరించవచ్చు అన్నారు. వారు వచ్చారు, మీకు విష్ చేసారు. మీరూ నమస్కారముతో అమ్మను చూపారు. వారు నమస్కరించి దూరంగా కూర్చున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా.

They have seen clearly, how you bring food to mother, take her to the bathroom and again by holding hand. Even if we could not come, our friends got a direct example of humanity, gratitude, loyalty, endurance, patience and sacrifice.

అమ్మకు మీరు భోజనం తెచ్చి ఇవ్వడము, బాత్ రూం కి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి మరలా తేవడము అన్ని చూసారు ప్రత్యక్షముగా. మేము రాలేకపోయినా, మా స్నేహితులకు, మానవత్వం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, ఓర్పు, సహనం, త్యాగం, ప్రత్యక్ష ఉదాహరణ చూపించారు.

Later you sent the link and also said that we have called everyone to testify that even those with children are seeing their old parents and in-laws. Hmm, your messages make a lot of sense. Think in 10 ways. And divine Sadhana, friendship with Panchabhut, should be those sattvic thoughts. Thank you and greetings.

తర్వాత మీరు లింక్ పంపుతూ, పిల్లలు ఉన్న వారు కూడా, తమ ముదుసలి తల్లి దండ్రులను అత్త మామలను చూస్తున్నారు అన్న సాక్ష్యం కు అందరినీ పిలిచాము అని కూడా చెప్పారు. అమ్మో, మీ సందేశాలకు చాలా అర్ధం ఉన్నది. 10 రకాలుగా ఆలోచన చెయ్యాలి. మరి దైవ సాధన అంటే, పంచభూతాల తో మిత్రత్వం అంటే, ఆ మాత్రం సాత్విక ఆలోచనలు ఉండాలి. ధన్యవాదములు, నమస్కారములు.

Answer - Thank you. You have proved that devotion/ respect/ admiration should be in action, not in words. Other friends also sent, their friends. They spoke for only 1 minute, even mother did not understand who greeted her and why.

జవాబు - ధన్యవాదములు. భక్తి/ గౌరవం/ అభిమానం ఆచరణలో ఉండాలి, పై పై మాటలలో కాదు, అని మీరు నిరూపించారు. ఇంకో మిత్రులు కూడా, ఇలాగే తమ స్నేహితులను పంపారు. 1 నిమిషమే మాట్లాడింది, అదీ అమ్మ కూడా అర్ధం కాలేదు, ఎవరు ఎందుకు పలకరించారు అని.

Please remember one thing, we don't want people to know us. It is enough to know our works. Due to their cultured upbringing, they are confident and believe good.

దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు మనము తెలియనక్కరలేదు. మన పనులు తెలిస్తే చాలు. వారి సంస్కార పెంపకం బట్టి, వారికి నమ్మకం కలుగుతుంది.

These three do not leave us in life - 1. Those who know themselves, practical devotees 2. Those who do Seva for their older parents and in-laws 3. Those who are gods and worshiped by their children, in their old age.

ఈ ముగ్గురు మనల్ని జీవితము లో వదలరు - 1. తమను తాము తెలుసుకున్న వారు, ఆచరణ భక్తులు 2. తమ ముదుసలి తల్లి దండ్రుల అత్త మామల సేవ చేసే వారు 3. తమ బిడ్డల దగ్గర, తమ ముదుసలి వయసులో, దేవతలు గా ఉండి, పూజింపబడే వారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,974; 104 తత్వాలు (Tatvaalu) and views 226,376
Dt : 05-Mar-2024, Upd Dt : 05-Mar-2024, Category : Devotional
Views : 168 ( + More Social Media views ), Id : 2047 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : buy , bed , sleep , floor , mats , country , believe , mind , control
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content