Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* 2 బలమైన వర్గాలు తలపడినప్పుడు
* గోగినేని విశ్రాంతి గా, ఎవరి వైపు?
* కొడాలి వర్గము కంప్లైంట్, వీడియో చూడండి
* లెక్కింపులో అన్యాయం, అడ్డ్రెస్స్ ల అవకతవక
* లొసుగులు మరియు పక్షపాతం
* చేరని బాలెట్లు, తిరస్కరణలు
* చంద్రన్న తెలివి కొత్త వర్గము
* రామన్న పోరాటములో, చంద్రన్న
* ఆరోపణలను తిరుగు సమాధానాలను
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. తానా కొత్త నాయకులు, నిరంజన్ గెలుపు కు బాలయ్య అభినందలు తెలియజేశారు అంటున్నారు.
గతములో అనుకున్నదే జరిగింది. 2 బలమైన వర్గాలు తలపడినప్పుడు, అందులో గెలుపు ఓటములు 1000 కి దగ్గరలో ఉన్నప్పుడు, ఓడిన వారు గమ్ముగా ఉండరు. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తారు.
దాని పూర్తి విషయాలు లోగుట్టు బయట పెట్టాలని చూస్తారు, భీకర యుద్దాలు జరగవచ్చు చీలికలు రావచ్చని అప్పుడే అనుకున్నాము కదా. ముసలము మొదలు అయ్యింది.
ఒంటరి అభ్యర్ధి, గోగినేని ఇక విశ్రాంతి గా, ఈ వర్గాల బంతాట చూడవచ్చు, లేక ఎవరి వైపు చేరతారో?
ఎన్నికల ఫలితాలపై, కొడాలి వర్గము కంప్లైంట్ మరియు వీడియో ప్రకారము, బాలెట్ల లెక్కింపులో అన్యాయం జరిగింది అని, అడ్డ్రెస్స్ ల అవకతవకలు, లొసుగులు మరియు పక్షపాతం, ఇంకా చాలా విషయాల తో, తానా బోర్డ్ మరియు ఎలెక్షన్ కమిటీ కు పెద్ద ఉత్తరము రాశారు జూన్ 3 వ తేదీ, కొడాలి వర్గము వారంతా.
అందులో ముఖ్యమైనవి :
1. తానా ఎలెక్షన్ ట్రస్ట్ వారి, స్టాఫ్ట్వేర్, టీం, పై అనుమానం, లెక్కింపు లో అవకతవకలు
2. ఎలెక్షన్ ఆఫీసర్ కూడా, సభ్యులతో సంప్రదించడం, కాంఫ్లిట్ ఆఫ్ ఇంటరెస్ట్
3. బాలట్స్ కొంతమంది కి రాలేదు, ఓటర్ల డాటాబేస్ లో అవకతవకలు ఇంకా తేలలేదు
4. గంట గంట కు ఫలితాలు చెప్పాలి, కాని రాత్రి మాత్రమే చెప్పారు.
5. యంత్ర లెక్కింపు కాకుండా, మనుషులతో లెక్కించాలి
బోర్డ్ ముందుకు వచ్చి, నిష్పక్షపాతము గా, ఈ సమస్యలు సరిచేసి, తిరిగి లెక్కించాలని కొడాలి వర్గము కోరుతుంది.
ముందే అనుకున్నాము, నిరంజన్ వర్గం అంతా, చంద్రన్న అంత తెలివి గల కొత్త వర్గము, మరి వారి కొత్త ఆలోచనల ముందు, పాత ఆలోచనల రామన్న మాటలు మరియు లేఖలు చెల్లుతాయా, లేక చెవిటి వాడి ముందు శంఖ నాదమేనా, అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఆనాడు తెదేపా లో, కొత్త చంద్రన్న, పాత రామన్న పోరాటములో, చంద్రన్న దే పై చేయి అయ్యింది కదా, మరి నేడు అదే జరగబోతుందా?
తానా శ్రేయోభిలాషులు కి అభిమానులకు మనవి, మనకు ఇంతమంది వాలంటీర్లు ఉండి, పెద్ద తెలుగు సంస్థ అయి ఉండి, ఇంతమంది నాయకులు ఉండి కూడా, ఓ ఇద్దరు వాలంటీర్లు సహాయం తో, ఇరువైపులా నాయకులు, తమ ఆరోపణలను అలాగే తిరుగు సమాధానాలను, స్వచ్ఛమైన తెలుగు లో ముఖ్య పాయింట్లు, ఓ పది రాసి, మాలాంటి వారందరికీ ఇస్తే, బాగుంటుంది.
రాత తెలుగు మాటల ఆరోపణలు (వెర్షన్) లేవు అనడం తగదు, సుమా. మనది తెలుగు సంస్థ కాబట్టి, తప్పదు తెలుగు వివరణ ఇంగ్లీషు తో పాటుగా.
ఒకవేళ ఇంగ్లీషు లో మనం పంపితే, మన స్ధానిక జనాలకు, అందరికీ అర్థం కాకపోవచ్చు కదా.
విలేఖరులం, మా ఇతర మసాలా మాటలు, మేము కలిపి అల్లు కుని ఎటూ రాసుకుంటాము, ప్రజల అభిప్రాయాలతో కలిపి .
మేము అంతా సొంతంగా రాసుకుంటే, అసలు ముఖ్య పాయింట్లు మిస్ అవ్వవచ్చు, పూర్తి న్యాయం జరగకపోవచ్చు, సమయం లేటు కావచ్చు.
ఇంకోవైపు వర్గ వివరణలు మాకు అందకపోవచ్చు కూడా, అసలు.
పొద్దున్న రాష్ట్ర పార్టీలకు చెప్పిన ది అదే, ప్రతి పోస్ట్ తో, 4 తెలుగు మాటలు రాయమని.
అందరూ మిత్రులే, సమాన దూరం గౌరవం గోప్యత మేము ఇస్తాము, మీరు గౌరవం ఇవ్వకపోయినా. ఏ సంస్థ అయినా ఒకటే మాకు.
మన సంస్థ కు మంచి జరగాలి, స్ధానిక పెద్ద నాయకులు కు తెలియాలి కూడా, నిష్పక్షపాతంగా.
మంచి చెడు మేము నిర్ణయం చేయం, ఎక్కువ సార్లు చేసే అవకాశం, నాయకులు కు సభ్యులు కు ప్రజలకే ఇస్తాం.
అన్ని పార్టీల అధిష్ఠానాలకు వెళుతుంది సమాచారం నేరుగా, 2 ఏళ్లుగా అని మీకు తెలుసు. అది నమ్మకం గోప్యత, ప్రైవసీ ని కాపాడుతూ.
ముఖ్యంగా, తెదేపా పెద్ద నాయకులు కు కూడా. ఎవరి వివరణలు, ఆలోచన లు, బాణీలు, ఎవరి నెట్వర్క్ నమ్మకం వారిదే కదా.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,270,725; 90 తత్వాలు (Tatvaalu) and views 175,065 Dt : 06-Jun-2021, Upd Dt : 06-Jun-2021, Category : America
Views : 545
( + More Social Media views ), Id : 1192 , Country : USA
Tags :
machine ,
ballot ,
count ,
tana ,
kodali ,
niranjan ,
group ,
fight ,
win ,
allegations ,
telugu అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments