అనవసర రాజధాని గొడవలో, అమాయక ప్రజలపై చంద్రన్న, జగనన్న మాయాజాలం భ్రమలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,355; 104 తత్వాలు (Tatvaalu) and views 225,056.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇవన్నీ మనసు ఉంటే తప్పులు సరిచేసుకోవడానికి మాత్రమే, తూలనాడటానికి కాదు మిత్రమా. నిన్న మనం చెప్పిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఆంధ్రా ఆసుపత్రి ఎందుకు ఉపయోగించరు, నమ్మకం లేదా అన్న విషయం ను, తెదేపా పట్టాభి గారు, సీపీఐ రామక్రిష్ణ గారు నిలదీశారు.

చూసారు కదా, ఆంధ్రా లో 5 ఏళ్లుగా, నిమ్స్ మరియు అపోలో వంటి ఆసుపత్రి లేక నే గదా ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో, కరోనా ట్రీట్మెంట్ కు వెళుతున్నారు? అంటే ఇదేగా 5 ఏళ్లుగా చంద్రన్న, 1 ఏడాది గా జగనన్న చేసిన అభివృద్ధి కి, సాక్ష్యం ఇదే కదా? మంగళగిరి లో ఏదో పెద్ద ఆసుపత్రి కట్టారు అన్నారు, మరి మన ఎమ్మెల్యేలు కు ఎందుకు ఆనలేదు ఆ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి, అది కూడా ఉత్తుత్తి ప్రచారమేనా ఆనాడు? మరి వైసీపీ వాళ్ళు ఎందుకు ఎత్తి చూపరు దీన్ని?

ఏమిటో పచ్చని 3 పంటల భూముల పైన కాంక్రీటు వేసి, మహా నగరం నిర్మిస్తా అని భారీ ఎత్తున రియల్ ఎస్టేట్, వ్యాపారం లేవదీశారు, పక్కనే దగ్గర లో విజయవాడ నగరం ఉంది కదా, మరలా అక్కడే ఎందుకు రాజధాని. పక్కనే దొనకొండ లేదా ప్రకాశం జిల్లా లో ఎంతో ఖాళీ ఉన్నా. పోనీ పూర్తి చేసారా, అదీ లేదు, అన్ని తాత్కాలిక భవనాలు కట్టారు.

ఇప్పుడు జగన్ వచ్చి 3 రాజధానులు వికేంద్రీకరణ అంటారు. వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి జరిగిన ప్రాంతం, దాని బదులుగా రాజమండ్రి, విజయ నగరం, శ్రీకాకుళం కొత్త రాజధాని గా డెవలప్ చేయవచ్చు, కదా? కానీ ఆల్రెడీ మెట్రో సిటీ అయిన వైజాగ్ మాత్రమే కావాలి, అర్థం అయిందా అందులో కిటుకు? ఎవరి మాటల మాయ, ఎవరి అవసరం వారిది, జనం ను పిచ్చి వాళ్ళ ను చేయడం. మనం కూడా, మన వర్గం వారు ఏమి చేసినా ఎంత నష్టం చేసినా, కరెక్టే అని తలవంచుకుంటాము.

కేవలం మన దేశంలో నే, రాజధాని అంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అంత పెద్ద నగరం లో ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్ బిల్డప్ ఉండాలి అని ఒక అర్థం పర్ధం లేని ఆలోచన. లేకపోతే మన తాతల, మనవళ్ల పరువు పోతుంది అని ఎవరి స్వార్థం కు వారు, ఏదేదే చెపుతున్నారు.

అసలు రాజధానికి అంత నగరాలు, బిల్డింగ్ లు, బిల్డప్ అవసరమా? దాని బదులు, మండలం కో ఆసుపత్రి, మంచి ఉచిత చదువు పాఠశాలలు, రోడ్లు, నీళ్లు , ఇతర ప్రజోపయోగ పనులు చేయవచ్చు, కట్టవచ్చు అన్ని చోట్లా అన్ని జిల్లా లలో. కానీ చేయరు, మనవళ్ళ రాజ్యం వచ్చే దాకా, మనమూ అడగము.

ఉదాహరణకు అమెరికా లోని రాష్ట్రాలలో పెద్ద మహా నగరాలు, రాజధానులను చూద్దాం. కాలీఫోర్ణియా రాష్ట్రం ప్రతి ఒక్కరుకు తెలుసు, అందులో మహా నగరాలు తెలుసా? శాన్ ఫ్రాన్సిస్కో మరియు లాస్ ఏంజిల్స్. కానీ ఇవి రెండూ రాజధానులు కావు. రాజధాని శాక్రమెంటో అనే చిన్న మూల పట్టణం, ఒంగోలు రాజమండ్రి అంత మామూలు సాధారణ పట్టణం స్థాయి పరిధి కూడా ఉండదు. హయిగ పరిపాలన జరుగుతుంది. ఎవరికీ బాధ లేదు. పల్లెటూరు జనం కూడా, ఈ చిన్న రాజధానికి వెళడానికి భయపడరు కదా, అద్దెలు తక్కువ, అలజడి ఆర్భాటాలు తక్కువ.

ఇల్లినాయిస్ రాష్ట్రం కు పెద్ద నగరం, చికాగో. కానీ రాజధాని, చిన్న ఊరు స్ప్రింగ్ ఫీల్డ్. అలాగే న్యూయార్క్ రాష్ట్రము లో పెద్ద నగరం, న్యూయార్క్. కానీ రాజధాని అల్బనీ, అనే చిన్న పట్టణం. ఫ్లోరిడా అనే రాష్ట్రంలో ఒర్లాండో, మయామి అనేవి ప్రపంచ టూరిజం నగరాలు. కానీ రాష్ట్ర రాజధాని, మూలన ఉన్న చిన్న పట్టణం తల్హాసి. అసలు సగము మంది ప్రజలకు ఈ ఊళ్ళు పేర్లే తెలీవు, వాటితో పని లేదు.

ఇప్పుడు అర్థం అయిందా, అనవసరంగా రాజధాని కోసం ఇరు నాయకులు ఎంత గందరగోళం సృష్టించి, అశాంతి పుట్టించి, అసలు అభివృద్ధి పక్కన పడేసి, ఎవరి పబ్బం వారు గడుపుతున్నారు. అమాయక జనం వర్గాలు గా, ప్రాంతాలుగా, కులాలుగా విడిపోయి తిట్టుకుంటూ, తమ తమ నాయకుల రియల్ ఎస్టేట్ వారికి అండగా ఉన్నారు, అప్పుడు ఇప్పుడు. వాస్తవాలు ఎవరూ చెప్పరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,355; 104 తత్వాలు (Tatvaalu) and views 225,056
Dt : 06-Aug-2020, Upd Dt : 06-Aug-2020, Category : Politics
Views : 832 ( + More Social Media views ), Id : 631 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chandra babu , jagan , magic , illusions , innocent people , capital conflict , amaravati , vijag , karnul
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content