Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
3 min read time. *చంద్రన్నా, మన స్థానిక తెదేపా అధ్యక్షుల గొంతు నొక్క కన్నా, వారికి మనుషులుగా విలువ నిచ్చి గుర్తించు అన్నా - మన ఆరోపణలు వారి గొంతు నుంచి కూడా రప్పించన్నా, మన తెదేపా సోషల్ మీడియాలో సముచిత స్థానం ఇవ్వన్నా*
మన సొంత స్థానిక తెదేపా పార్టీ అధ్యక్షుల గొంతు నొక్కి, వారికి విలువ లేకుండా డమ్మీలు గా ఉత్సవ విగ్రహాలు గా చేసి, వారి ఫోటోలు ధర్నాలు సమావేశాలు ఆరోపణలు కూడా కనీసం, మన సొంత స్థానిక పట్టణ, పార్లమెంట్, జిల్లా తెదేపా శాఖ సోషల్ మీడియాలో పెట్ట నీయకుండా, వారిని అవమానించడం, ఎదగనీయకుండా తొక్కిపట్టడం, తప్పు చంద్రన్నా.
పాము తన గుడ్లను తానే తిన్నట్లు మనకు ఆ నీచ సంస్క్రుతి వద్దు అన్నా.
ఎన్టీఆర్ కోసం, అలాగే తల్లి లాంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం, ప్రాణమిచ్చే అభిమానులు ఇప్పుడు కూడా ఉన్నారు. కనీసం వారినైనా స్థానిక అధ్యక్షులుగా చేసి, నోరు తెరచి, స్థానిక సమస్యల పై పోరాటము చేసే, యోధులుగా ఇకనైనా అవకాశం ఇద్దాము చంద్రన్నా, ఇక 2 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది.
ఆత్మాభిమానం లేని బేల వలే, పక్క పార్టీల మద్దతుకు అర్రులు చాచే బదులు, మనకున్న అభిమాన పులులను బయటకు తీసి, స్వేచ్చ నిచ్చి నాయకులు గా ఎదగనిద్దాము నిలబడనిద్దాము అన్నా.
మీకు కూడా వెన్నుపోటు పొడుస్తారు, మీ కన్నా ఎక్కువ ఎదుగుతారు అన్ని భయం వద్దు, ఎంటీయార్ అభిమాని అంటే, నమ్మదగిన వాడు, మీ లాగా వెన్నుపోటు పొడవడు. దయచేసి పిల్లులుగా ఇంకా మార్చకు చంద్రన్నా.
మీ తర్వాత గట్టిగా, నిలబడేవాడు మన పార్టీ లో ఒక్కడి పేరు చెప్పు చంద్రన్నా? ఇది, మనము ఎన్టీఆర్ కు చేస్తున్న ద్రోహము కాదా అన్నా? మన నాయకులను అయినా మనము నమ్మాలి అన్నా.
3 పంటల మాగాణి కి నష్టము లేకుండా, అమరావతిని నిర్మిద్దాము అన్నా. మరలా కొత్త శాపాలు పాపాలు మనకు వద్దు చంద్రన్నా.
మీ చేతులతో మీ పుత్రలాభాపేక్ష తో, ఇన్నాళ్ళ బలమైన ప్రతిపక్షం ఎన్టీఆర్ తెలుగు దేశాన్ని శాస్వతము గా పతనము చెయ్యొద్దు అన్నా.
అది కూడా మనకు ఇంకా పాపం, ఎందుకంటే అది మన సొంత పార్టీ కాదన్నా, ఎన్టీఆర్ పిల్లలు మనుమలు బాలక్రిష్ణకు జూ ఎంటీయార్ కు లేకుండా లాక్కున్న పార్టీ.
మన ఇన్నాళ్ళ అభివ్రుద్ది సేవ మీద నమ్మకము ఉంటే ధైర్యం ఉంటే, లోకన్న చేత కొత్త పార్టీ పెట్టి, మన సొంతముగా పెంచుదాము లేదా తుంచుదాము. కానీ మా అన్న ఎన్టీఆర్ పార్టీకి నష్టం చేయకన్నా, ఇది సాక్ష్యము తో చెబుతున్నా చంద్రన్నా.
మన నాయకులను మనమే గుర్తించి అభిమానించి గౌరవించకపోతే, వారు ఎలా ఎదుగుతారు? జనానికి ఎలా తెలుస్తారు? రేపు మీరు లేక పోయినా, పార్టీ కోసం ఎలా గట్టిగా నిలబడతారు?
మీరు ఇలాంటి, కంచే చేను మేస్తే అన్న పనులు చేయబట్టి కదా, ఎంటీయార్ తెదేపాను నాశనం చేస్తున్నారు అని, ఎంటీయార్ అభిమానులు అంటున్నది. స్థానిక నాయకులను ఈ విధముగా అవమానకరముగా తయారు చేస్తారా?
ఈ ఉదాహరణ చూడన్నా సాక్ష్యం తో, తప్పు అయితే, మన్నించు అన్నా, ఈ విలేఖరితో మీకు చెప్పిస్తున్నాము.
1. చీరాల తెదేపా అధ్యక్షుడు లేదా మీరు, గత 3 ఏళ్ళు గా, గోడ దూకిన మన వర్గ ఎమ్మెల్యేని, ఊళ్ళో లేని ఎమ్మెల్యేను, అభివ్రుద్ది తీసుకు రాని ఎమ్మెల్యేను, ఏమీ అనలేక నోరు మూసుకుని కూర్చున్నారు ఎందుకు? మీరు వద్దు అన్నారా? నోరు తెరవమని చెప్పన్నా?
2. మూడు ఏళ్ళు చీరాల అధ్యక్షుడు గా ఉండి, చివర నిమిషములో మనము పార్టీ టిక్కెట్ ఇంకొకరికి ఇచ్చినా కూడా, తల వంచుకుని నవ్వుతూ గమ్మున పక్క పార్టీకి వెళ్ళే మంచి వ్యక్తి ఫోటో మరియు అతని పనులు, చీరాల తెదేపా సోషల్ మీడియాలో ఎందుకు ఉంచవన్నా? ఆయన చేసిన ఉపన్యాసాలు, అభివ్రుద్ది కోసం ధర్నాలు, ఊరేగింపులు, ఎమ్మెల్యే పై ఆరోపణలు, మన పట్టణ జిల్లా సోషల్ మీడియాలో ఏవి అన్నా?
3. చీరాల తెదేపా అధ్యక్షుడు కాపు నాయకుడు అని చులకన చేస్తున్నామా? లేక రాష్ట్రములో అన్ని పట్టణ అధ్యక్షుల పరిస్థితి ఇంతేనా, గప్ చిప్ రాష్ట్రనాయకులే మాట్లాడాలి అని ఎమన్నా రూల్ ఉందా?
4. మున్సిపల్ ఎన్నికల్లో, 33 మంది వార్డు అభ్యర్ధులను ఆయన పట్టుకోలేక పోయారా? మనమే అభ్యర్ధులను వద్దు, పోటీకి అని మానిపించామా? అతను పట్టుకోలేక పోతే, మనము ఇంకా ఎందుకు పదవిలో ఉంచాము, పట్టణ అధ్యక్షుడి గా? ఒకవేళ మనమే పోటీకి పెట్టొద్దు అంటే, అదే కదా పార్టీని నాశనం భూస్థాపితం చేయడం అంటే?
5. మీరు ఇప్పుడు రాష్ట్ర వెబ్సైట్ లో చేస్తున్న, జగనన్న పై ఆరోపణులు (పై ఫేస్బుక్ లింక్), ఎందుకు స్థానిక తెదేపా అధ్యక్షులు, తమ స్థానిక ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, సీయెం మీద రోజూ ఆరోపణులు చెయ్యలేకపోతున్నారు? వారు చేసిన ఆరోపణల వీడియోలు స్థానిక వెబ్సైట్ లో ఎందుకు రోజూ లేవు? అవి లేకపోతే, స్థానిక జనం ఎలా నమ్ముతారు మీ మాటలు? ఏవో రాష్ట్ర నాయకులు మాటలు మాకెందుకులే అనుకోరా?
ఇదేనా మీ 2040 విజన్? మీ వ్యవస్థలను మానేజ్ చేసే స్కిల్స్ ఇక్కడ ఏమైనాయి? పైకి ఒక మాట, లోన ఒక మాట?
ఈ చీరాల తెదేపా సోషల్ మీడియాలో మీరు, స్థానిక అధ్యక్షుడికి విలువ ఇచ్చారు అని, ఒక్క సాక్ష్యం చూపించు అన్నా. లేకపోతే, పై ఆరోపణలు నిజమని మీరు ఒప్పుకున్నట్లే కదా చంద్రన్నా? ఇన్ని రోజులు అన్నం పెట్టి పదవులు ఇచ్చిన పార్టీని, బతకనీయండన్నా.
link
తెదేపా క్షేమం కోరే,
చీరాల ఎన్టీఆర్ తెదేపా అభిమాన సంఘం
Chandranna, rather than shut voice of our local TDP presidents, give value and recognize them as human beings on social media
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,958; 104 తత్వాలు (Tatvaalu) and views 221,648 Dt : 14-Apr-2022, Upd Dt : 14-Apr-2022, Category : Politics
Views : 471
( + More Social Media views ), Id : 1343 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chandranna ,
shut ,
voice ,
tdp ,
village ,
town ,
district ,
presidents ,
value ,
recognize ,
humans ,
local ,
social ,
media Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments