దేశం మనకు ఇన్ని ఇచ్చింది. మన దేశానికి కూడా, ఏదో ఇవ్వాలి కదా? పోలీసు, సైనికులు, రైతు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పిల్లలు ఇప్పుడు, మనకు ఇంట్లో రక్షణ గా ఉంది, అమ్మా నాన్న అవునా?

మరి మన బజారు, పేట, ఊరు మొత్తానికి రక్షణ ఉంది ఎవరు? అదీ ఎండైనా, వానైనా, రాత్రి పగలు, తగవులు గొడవలు, అయినా కూడా, మనందరికీ రక్షణ ఎవరు?

కేవలం రక్షకభటులు (పోలీసులు) మాత్రమే. మనందరం ఇంట్లో టీవీల్లో, చుట్టూ ఏమి జరుగుతున్దో అని భయం గా చూస్తుంటే, వారు మాత్రము ఆ సంఘటన స్ధలం లో నే ధైర్యంగా ఉంటారు.

అంటే అమ్మా నాన్న లు, కేవలం మనల్ని రక్షించడానికి మన ఇంట్లో ఉంటే, మనందరి రక్షణ మంచి చూడటానికి, వాళ్ళు వీధుల్లో ఉన్నారు. మరి ఎవరు గొప్ప? పోలీసులే కదా.

ఆ తర్వాత, ఇంటింటికి తిరిగి, జాగ్రత్తలు చెప్పే, హెల్త్ కేర్ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్ లు, పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బంది. వీరు మన ఇల్లు లేదా బజారు లేదా ఊళ్ళో అవసరాన్ని బట్టి, బయట తిరుగుతూ నే ఉంటారు. మరలా వీరికి కూడా, ఓ పోలీసు తోడుగా ఉండాలి కొన్ని సార్లు.

మరి కూరలు, సరుకులు అమ్మే వర్తకులను మరువ కూడదు ఈ సమయములో. వారి దగ్గర పెద్ద లైన్ ఉంటే, మరలా పోలీసు ఉండాలి.

ఒకవేళ ఈ సమయంలో, జబ్బు చేసి ఇబ్బంది వస్తే, ప్రభుత్వ వైద్యులు, నర్సులు, సిబ్బంది మాత్రమే మనకు రక్షణ. మరి ఎక్కువ జనం ఒకేసారి వస్తే, వారికీ ఇబ్బందులు, ఇక్కడ కూడా ఓ పోలీసు ఉండాలి.

మరి జనం మధ్యలో చెప్పుకున్నాము. మరి జనం లేనిచోట, తిండి నీళ్ళు లేని చోట, అంటే ఊరు, జిల్లా, రాష్ట్రం మొదట్లో చివరా ఉండేది, మరలా మన పోలీసు సోదరులే.

మరి పోలీసులు తో కలిపి, మనందరి కీ మరియు దేశానికి రక్షణ, ఎవరో తెలుసా? దేశం బయట నేల పై , నీటి పై , నింగి పై, అడవుల్లో, పర్వతాల్లో నిరంతరం కాపలాగా ఉండే, దేశ సైనికులు.

పోలీసులు కనపడే తప్పుడు వారితో పోరాడితే, సైనికులు కనపడని విదేశీ తీవ్రవాదులతో కూడా పోరాడాలి.

మరి మనిషి చేతులు గొప్పా, కాళ్ళు గొప్పా, లేక తల గొప్పా అనేటప్పుడు, బయటకు కనపడకుండానే లోన ఉన్న, గొప్పది ఏదో తెలుసా? వెన్నెముక. అలాగే, మనందరి కీ వెనుక వెన్నెముక లాగా చాటుగా ఉండి, మనందరి నీ నడిపే, రారాజు రైతు మాత్రమే.

అతను పండించకపోతే, మనందరికి కూడా తినడానికి, ఏమీ దొరకదు.

కాబట్టి, ఇంతమంది, ఇన్ని విధాలుగా తమ సేవలు అందిస్తూ ఉంటే మన దేశానికి, మనం మన ఇంట్లో క్షేమంగా ఉన్నాము. కాబట్టి, మనం అడక్కుండానే మన దేశం మనకు ఇన్ని ఇచ్చింది. మరి మనం మనదేశానికి కూడా, ఏదో ఒకటి ఇవ్వాలి కదా? ఆలోచన చెయ్యండి మరి.

అప్పుడు దాకా, ఇల్లు వదిలి బయటకు రావద్దు. అమ్మ నాన్న మరియు ప్రభుత్వం మాట విని ఇంట్లో నే ఉండటం, ఉత్తమ దేశ సేవ ఇప్పుడు. గ్లౌజులు, మాస్క్లు, 6 అడుగు ల దూరం, సబ్బు తో కడగడం మరువద్దు. సెలవు మరి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 15-Apr-2020, Upd Dt : 15-Apr-2020, Category : General
Views : 426 ( + More Social Media views ), Id : 498 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : covid 19 , corona , police , govt officials , cleaning , first responders , military
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content