Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. 70 ఏళ్ళ ముందు సినిమా గురించి మాట్లాడుతున్నాము, అంటే మన తల్లి దండ్రులు పిల్లలు అప్పుడు. చూడండి కధకు పాటలకు బలం అర్ధం చిక్కదనం ఉంటే, ఎన్ని ఏళ్ళు అయినా ఆ సినిమా ను ప్రజలు మరువరు. ఇది బెంగాలి సినిమాకు అనువాదం. బామ్మ మాట బంగారు బాట అంటే కూడా ఇదే, ఓల్డ్ ఇస్ గోల్డ్.
ఇది బహుముఖాలు కలిగిన ఒక గ్రంధము అని కూడా చెప్పవచ్చు. సంతోషము ప్రేమ ఎటూ అందరికీ అర్ధం అవుతుంది. కానీ 2 వ కోణం, బాధ పాటలలో, వేదాంత ధోరణి కూడా ఉంటుంది. భగవద్గీత నేరుగా చదివి అర్ధం చేసుకోలేని వారికి, ఇందులో తెలిక పదాలలో అదే వివరిస్తారు, బాధలలో, మాయ బ్రమ ల గురించి. బాధలలో ఉన్న వారు తమ అనుభవముతో చెపుతుంటే, కొంతమందికి బాగా అర్ధము అవుతుంది.
సహజముగా ప్రేమ విఫలము అయితే, ప్రేమికుడు మాత్రమే బాధపడిన పాటలు ఎక్కువ. కానీ ఈ చిత్రములో, సావిత్రి మరియు లలిత ఇద్దరు కధానాయికల పాత్రల మనోవేదన కూడా, పాటలు గా మధురముగా పలికించారు.
బాధ అనేది మనిషికి ప్రేమ విఫలం తోనే కాదు, జీవిత భాగస్వామి / పిల్లలు/ పెద్దలు గతించినా లేదా విడిపోయినా, ఇష్టమైన వారు దూరమైనా కూడా లేదా అనుకున్నది గాక ఇంకోటి జరిగినా, వేదాంత ధోరణిలో ఇవే మాటలు వస్తాయి.
అందుకే బాధలో ఉన్న వారు, అన్ని నిజాలే చెపుతారు. సత్యం పలుకు తారు. మరలా సంతోషం రాగానే, ఎక్కువ మంది గతాన్ని మరుస్తారు, సత్యానికి దూరం అవుతారు, మరలా శిక్షకు పాత్రులు అవుతారు. అది మామూలే.
కానీ సంతోషమైనా బాధ అయినా ఒకే విధముగా ఉండటమే స్తితప్రజ్ఞత. కాబట్టి వీరి బాధల లో నుంచి, మనము నేర్చుకునేవి ఉన్నాయా అనేవి చూడండి.
ఎన్నో ఆశలు తో ఎన్నో పనులు చేస్తాము, అవన్నీ ఫలించకపోయినా కూడా, అంతా బ్రాంతి బ్రమ, చివరకు మిగిలింది ఇంతే అని ఆశ నిరాశలతో కూడా చింతిస్తుంటాము. కాబట్టి, ప్రతి మనిషి బాధలో కూడా, ఇలాగే అనుకుంటారు సుమీ.
కష్టపడి రాత్రులు చదివి, 10 వ తరగతి తప్పినా లేదా తక్కువ మార్కులు వచ్చినా, ఆశా నిరాశలకు లోనవ్వడము, జీవితం విలువ తెలియడం జరుగుతింది.
దగ్గర ఉంచుకుని సేవ చేస్తున్న, మన తల్లి తండ్రి గతించినా, ఇదే వేదాంతము బయటకు వస్తుంది గుండెల్లో బాధ పెల్లుబికుతూ.
అందుకే కష్ట సుఖాలు, పగలు రాత్రి లాగా, ఎండ వాన చలి లాగా, ఒకదాని వెనుక ఇంకోటి వస్తూనే ఉంటాయి, మనము అరిషడ్వర్గాలకు బానిసలు అయినంత కాలము ఇది తప్పదు.
ధైర్యంగా ఉండి, వీలైనంత 10 మందికి ఉపయోగపడి, మానవ సేవయే మాధవ సేవగా భావించి, ముందుకు సాగాలి. అంతే గానీ, తాగి మనము పతనం అవుతూ, ఇతరులను పతనం చేసినందు వలన, ఎవరికీ ప్రయోజనం ఉండదు.
ఇతరులు మోసం చేసారు అనుకుంటే, హాయిగా వారికి దూరం గా ఉండు, వారిని తలచవద్దు మరలా.
ఎందుకంటే నిజమైన ప్రేమ, త్యాగం చేస్తుంది, ఇతరుల సంతోషం కోసం. అమ్మ అన్నము తినకుండా, మనకు పెట్టినట్లు. లేదంటే, అది నిజమైన ప్రేమ కాదు, స్వార్ధ కపట తాత్కాలిక అవసర అవకాశ వాద అభిమానం/ ప్రేమ, ముగుస్తుంది త్వరలో, కన్నీటి మయం అవుతూ, బ్రమలను తొలగిస్తూ.
1) అంతా.. బ్రాంతియేనా.., జీవితానా వెలుగింతేనా..,
ఆశా. నిరాశేనా.. మిగిలేది చింతేనా 2
చిలిపితనాల చెలిమే మరచితివో..2
తల్లిదండ్రుల మాటే, దాట వెరచితివో ..2
పేదరికమ్ము, ప్రేమపథమ్ము, మూసివేసినదా
నా.. ఆశే, దోచినదా.. ||అంతా బ్రాంతియేనా||
మనసునలేని, వారి, సేవలతో 2
మనసీయగలేని, నీపై మమతలతో 2
వంతలపాలై చింతించే, నా వంతా దేవదా
నా వంతా దేవదా.. ||అంతా బ్రాంతియేనా||
Antha Bhranthi Yena, Lyrics : Samudrala Sr., Singer : K Jamuna Rani
2) తానే మారెనా, గుణమ్మే మారెనా
దారి, తెన్నూ లేనే లేక, ఈ తీరాయెనా ||తానే||
తొలిచూపు నాటి రూ.పు మారే.., ధోరణి మారే.. 2
నిలువెల్లా మెల్లనాయె.., నిట్టూర్పే తుదాయే..
ఏదీ, లేని, పేదై పోయి, ఈ తీరాయెనా ||తానే||
వలపు తీ..రు.., ఈ తీ.రౌ.నా ...ఆ... 2
మా చెలిమి, కలలో పెన్నిధానమా...ఆ...ఆ..ఆ
పెను చీకటైన జీవితానా.., వెళ్గిన జ్యోతీ..2
మధుపాయే., మాసిపోగా., అంతమ్మే ఫలమ్మా..
ఏరీ కోరు ఉల్లాసాలు, ఈ తీరాయెనా
నా సేవలకు.., ఇంతే.., వరమా... ఆ... 2
నాకిదే.. కడసారి, దరిశనమా .... ఆ....ఆ...ఆ
అడియాస పాలు చే.సినా.రు, కోరినవారు.. 2
మనసైన, చేరలేని.., ఈ దాసి ఇటాయే..
గాలి., మేడా.. , కూలీపోయి.., ఈ తీరాయెనా.. ||తానే||
Tane Marena, Singer: R. Balasaraswathi Devi, Lyrics: Samudra Sr.
3) చెలియలేదు చెలిమిలేదు, వెలుతురే లేదు..
ఉన్నదంతా చీకటైతే, ఉందీ నీవేనే.., మిగిలింది నీవేనే ||చెలియలేదు||
చెలిమీపోయే చెలువుపోయే, నెలవే వేరాయె 2 - ఆడ
చేరదీసి సేవచేసే తీరూ కరువాయె, నీ దారే వేరాయె ||చెలియలేదు||
మరపురాని బాధకన్న, మధురమే లేదు... 2 హహ
గతము తలచి వగచే కన్నా, సౌఖ్యమేలేదు.. 2
అందరాని పొందుకన్నా అందమే లేదు, ఆనందమే లేదు.. ||చెలియలేదు||
వరదపాలౌ చెరువులైన, పొరలి పారేనే .. 2 - ఆడ
రగిలి పొగలో కొండలైనా, పగిలి జారేనే 2
దారిలేని బాధతో, నేనారిపోయేనా, కథ తీరిపోయేనా ||చెలియలేదు||
Cheliya Ledu Chelimi Ledu, Lyricist : Samudrala Raghavacharya, Singers : Ghantashala, K. Jamuna Rani
ANR, Savitri, lalita, CSR
Devadasu (1953), Music : C.R.Subburaman, M.S.Viswanathan
మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు.
Devadasu, Anta Bhranti Yena, Tane Marena, Cheliya Ledu Chelimi Ledu
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,679,030; 102 తత్వాలు (Tatvaalu) and views 207,787 Dt : 13-Jun-2022, Upd Dt : 13-Jun-2022, Category : Songs
Views : 738
( + More Social Media views ), Id : 1426 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
devadasu ,
akkineni ,
savitri ,
happy ,
anr ,
bhranti ,
tane ,
marena ,
cheliya ,
chelimi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments