జిల్లా రెవెన్యూ అధికారి గారికి - సోషల్ మీడియాలో రాష్ట్ర పధకాలు సిబ్బంది సేవలు ప్రజలకు అందుబాటులో - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,609; 104 తత్వాలు (Tatvaalu) and views 224,697.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

జిల్లా రెవెన్యూ అధికారి (DRO) గారికి,

నమస్కారములు మరియు విన్నపములు.

మన జిల్లా రెవెన్యూ అధికారి గా సమర్ధవంతంగా శాఖను, నిర్వహించుటకు కావలసిన శక్తిని ఆరోగ్యం ను భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాము. ఎందుకంటే, జిల్లా మంచిగా నడవాలంటే ఆదాయం బాగా ఉండాలి, రెవెన్యూ అధికారులు బాగా కష్టపడి పనిచేయాలి. మీరే మన జిల్లాకు ముఖ్యమైన శాఖ మరియు అధికారులు. ప్రతి వ్యక్తికి, రెవెన్యూ శాఖ తో పని ఉంటుంది.

త్వరలోనే మీ అనుభవ నాయకత్వం లో జిల్లా, డివిజన్ మరియు మండల రెవెన్యూ అధికారులు, సోషల్ మీడియాలో, రాష్ట్ర ప్రభుత్వ పధకాలను సేవలను, నవరత్నాలు ను, కరోనా జాగ్రత్తలు, సిబ్బంది సేవలను త్యాగాలను కూడా ప్రజలకు వివరిస్తూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారి ఆశయాలు ను, ప్రతి మండల ప్రజానీకానికి అందుబాటులో ఉంచుతారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్ధాయిలో సోషల్ మీడియా ప్రజలకు అందుబాటులో ఉంటే దయచేసి వెబ్సైట్ లింకు లు పంపగలరు, ప్రజలతో పంచుకుంటాము.

మా ఆర్డీవో (RDO) గారు, ఎమ్మార్వో (MRO) గారు, మా ప్రాంతంలో రేషన్ షాపులు, హోటళ్లు, లేదా ఇతర వాణిజ్య, కరోనా లేదా ప్రజలకు ప్రభుత్వమునకు సంబంధించి జరిపిన పర్యటన లు, పనులు గురించి చూడాలి లేదా తెలుసుకోవాలి అంటే, ప్రజలు ఎక్కడ చూడాలో తెలియదు, సోషల్ మీడియాలో నే అది సాధ్యపడుతుంది వారికి, ప్రభుత్వ లేదా వ్యక్తిగత సోషల్ పేజీలు ఉంటే.

ఎంతో కష్టపడి పని చేస్తున్న మా ప్రాంత ఎమ్మార్వో గార్లను పొగుడుతూ, ఆర్డేవో గారు ప్రజల అందరి కీ తెలిసేలా, ఫేస్బుక్ లో అభినందనలు తెలియచేస్తే వారికీ బాగుంటుంది. మేము సంతోషపడతాము, మా ప్రాంత అధికారులు బాగా పని చేస్తున్నారు అని.

మా అధికారులు గత 6 నెలలుగా ఏ ఏ కార్యమాలు ప్రజల కోసము చేసారో, పాల్గొన్నారో ప్రజలకు తెలుసుకునే అవకాశము ఉంటే బాగుంటుంది, అని పన్నులు కట్టే ప్రజల అభిప్రాయాము.

ఇది అన్ని జిల్లా లకు, అన్ని శాఖలకు వర్తిస్తుంది. అది ప్రజల హక్కు అని మా నమ్మకము.

ఇతర శాఖల లేదా అధికారుల లేదా ప్రజల సమస్యలు వింటుంటే, మన శాఖలో కూడా అటువంటి మార్పులు చేర్పులు చేయవచ్చు అని మా నమ్మకం. కొత్త ఐడియా లు కూడా వస్తాయి, ప్రజలకు చేరువ అవ్వాలని, ఏ అధికారి అయినా సదుద్దేశంతో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఉంటే అని ప్రజల నమ్మకం.

ముఖ్యమంత్రి గారు ఈ పధకాలను పెట్టారు, మా మండల/ డివిజన్ పరిధిలో ఈ పనులు పూర్తి చేశాము, ఇవి పెండింగ్ ఉన్నాయి అని ప్రజలకు, మీ సొంత వెబ్సైట్ లేదా సోషల్ మీడియా లో రోజూ చెబుతాఉంటే కదా, ఆ ప్రాంత ప్రజలు, వాటిని ఒప్పుకుని, ఆ అధికారులకు జేజేలు కొట్టాల్సింది. పై అధికారుల మీటింగ్ ల లో చెప్పుకుంటే సరిపోతుంది అనుకుంటే, ఇతర అధికారులు మరియు ఎస్పీలు ప్రజలకు సోషల్ మీడియాలో చెప్పరు కదా.

మన ముఖ్యమంత్రి గారు అధికారులు మీటింగ్ ల లో, ఎన్నోసార్లు చెప్పారు. నేను మీ అందరి మీద నమ్మకం ఉంచా, మీ మీద ఆధార పడ్డా, ప్రభుత్వం కు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వీలైనంత మంచి చేయండి, అని. ఆయన బాధ ఆవేదన వినే అర్థం చేసుకునే అధికారులు, మన లో ఉన్నారు అని భావిస్తున్నాము.

మన ప్రధాని మోడీ గారు, మన ముఖ్యమంత్రి జగన్ గారు, మేము ప్రజా సేవకులము, మా ప్రభుత్వము ప్రజల సేవకు పాటుపడుతున్నది అని చెపుతున్నారు. మరి అధికారులు ఆయనకు ప్రజలకు వీలైనంత మంచి చేయాలి కదా. ధన్యవాదములు.

ఇట్లు
జిల్లా ప్రజలు

ఇది కేవలము ప్రకాశం జిల్లా కు సంబంధించినది :

ఈ క్రింద వి కంప్లైంట్ కోసం కాదు, మన్నించాలి. జిల్లా స్ధాయి అధికారులు కు. మా వలన ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తు లో. అని మాత్రమే వివరిస్తున్నాము. వారు మంచి మనసు తో. ఉద్యోగ బాధ్యత తో. పునరుద్ధరణ చేస్తారా లేదా అన్నది ముఖ్యం కాదు, అది వారి ఇష్టం.

వేటపాలెం మండల రెవిన్యూ అధికారులు కు, ఏవైనా ప్రజల తరపున విన్నపాలు పంపుదాము అంటే, చీరాల పట్టణం దగ్గర ఉన్న వేటపాలెం ఎమ్మార్వో గారు, వారి వాట్సప్ నంబరు ఆపేసారు (May 16, 2020) కొన్ని వారాల ముందు. పోనీ, ఒంగోలు ఆర్డీవో గారితో చెప్పుకుందామంటే, ఆయన కూడా వాట్సప్ నంబరు ఆపేసారు (May 18, 2020), కొన్ని వారాల ముందు.

ఉచితంగా ప్రభుత్వం, ప్రజలతో అందుబాటులో ఉండమని ఇచ్చిన ఫోన్ నంబర్లు, అవి అనుకుంటున్నాము. అలా మంచి అధికారులు, ప్రజల గోడు వినలేక, ఆపడం ధర్మం కాదు అనిపిస్తుంది. ప్రజా సేవకులైన అధికారులు ఇలా ఫోన్ లు ఆపుకోవచ్చునా.

మేము పంపిన వాటిలో, ఏదైనా తప్పు ఉంటే చెప్పాలి లేదా సరి చేసుకునే ఉద్దేశ్యము లేకపోతే ఇగ్నోర్ చేయాలి. ఈ విధముగా బాధ్యత గల అధికారులు చేయరని మా నమ్మకం. విలేఖరుల తోనే ఇలా ఇంత మర్యాదగా ఉంటే, ఇక వారి దగ్గరకు వచ్చే సామాన్య ప్రజలను బడుగు బలహీన వర్గాల ను, వారి బాధలను మాటలను విన్నపాలు ను, ఏవిధంగా వింటారో గౌరవిస్తారో పరిష్కరిస్తారో, ఆ భగవంతుని కే తెలియాలి.

మరి వారి ఉద్దేశ్యం, మా మండల మరియు రెవెన్యూ డివిజన్ స్ధాయిలో, మేము మాట్లాడము చిన్న వారితో, అంటే సామాన్య జనానికి కష్టం కదా? జిల్లా అధికారులు లేదా కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడమని చెపుతున్నారు, ఏమో తెలీదు, అంటే తమ పై అధికారులకు పని వత్తిడి పెంచుతారా? జిల్లా అధికారులు మాత్రమే వారికి సమస్యలు, ఫార్వార్డ్ చేయాలనేమో మరి తెలీదు.

వారికి అర్థం అయేట్టు దయచేసి చెప్పగలరు, వారిని ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేయగలరు. వారికి ఫేస్బుక్ పేజీ ఉంటే, అందులో కూడా కాంటాక్ట్ అవుతారు ప్రజలు, తమ సమస్యలను విన్నవించుకోవటానికి.

ఎందుకంటే మీరు జిల్లా మొత్తం సమస్యలు చూడాలి. మండల సమస్యలు, ఎమ్మార్వో లేదా ఆర్డీవో స్ధాయిలో, పరిష్కారం కావాలి, పై దాకా పోకూడదు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టకూడదు, మన్నించాలి. ప్రజల మంచికి, జగన్ గారి ప్రభుత్వ ఖ్యాతి పెంచడానికి, తుది నిర్ణయం మీదే. తప్పులు ఉంటే మన్నించగలరు. ఇది కేవలము డివిజన్/ మండలము ప్రజల మంచి కోసమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,609; 104 తత్వాలు (Tatvaalu) and views 224,697
Dt : 24-Jul-2020, Upd Dt : 24-Jul-2020, Category : Request
Views : 915 ( + More Social Media views ), Id : 611 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Prakasam , DRO , District revenue officer , state schemes , staff services , public , social media , vetapalem , mro , ongole , rdo , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content