పిల్లలు లేదా గుణవంతులు లేరు అన్న బాధ వద్దు, ఈ 2 దోవలు, ఆత్మ మనశ్శాంతి తో - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,979; 104 తత్వాలు (Tatvaalu) and views 224,526.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పిల్లలు లేరని చాలా బాధ పడుతూ, డాక్టర్ల దగ్గరకు తిరుగుతూ, లక్షలు ఖర్చు పెడుతూ, ఏదో విధముగా ఓ నలుసు అయినా కందామని ప్రయత్నము చేసి, అలసిపోయిన లేదా పిల్లలు ఉన్నా కూడా గుణవంతులు సంస్కారవంతులు కలగలేదని బాధపడే వారికి బాధ్యత గా ఓదార్పు మాటలు.

బాధ వద్దు, దేవుని గీతను మార్చలేము. ఆయన వద్దు అనుకున్నాడు అంటే, ఈ పాపపు లోకములో ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుడదు అని కావచ్చు, లేదా వారితో నే మనకు ఇబ్బందులు వస్తాయని, ఆయన ముందు చూపు కావొచ్చు. కారణం లేకుండా, ఏదీ జరగదు, అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అన్న సామెత చెప్పింది.

పున్నామ నరకము తప్పిస్తారు, అనేది పాత రోజులు. ఇప్పుడు పిల్లలే, నిత్య నరకము ను ఇక్కడనే చూపిస్తున్నారు అన్ని దశలలో, మన సంస్కార పెంపకాన్ని బట్టి. నేడు ఎవరికీ పెంచి సంస్కారము చెప్పించే, సహనము నేర్పు ఓపిక లేదు. సంపాదన ఉద్యోగము ప్రాపంచిక విషయాల పరుగులు, ఆ ఎదిగిన పిల్లలు కూడా, అలాగే పరుగులు తీస్తూ, అగమ్యగోచరమైన భవిష్యత్ లో, బంధాలకు విలువ లేని, బండలు గా పెరుగుతున్నారు, పెంచుతున్నాము.

మొన్న వీడియోలో చూసాము, ఆశ్రమములో కన్న తల్లి దండ్రులు కన్నీళ్ళు కష్టాలు. పిల్లలకు దూరంగా అనాధలు గా ఒంటరిగా ఇంట్లో గాని, ఆశ్రమము లో కాని, వదిలేసే పిల్లలు కలగడం వలన, వారికైనా లభం కలిగిందా? ప్రపంచానికి లాభం మనశ్శాంతి ఉందా? అందరికి, కన్నీళ్ళు తప్ప? అలాంటి పిల్లల నుంచి, ఇప్పుడే వీరు నరకం చూస్తున్నారు కదా. అలా వదిలే పిల్లలు, పుట్టకపోవడము వలన నష్టము ఉందా? భూమికి, వారి తల్లికి భారము అవడము తప్ప.

పార్వతీ పరమేశ్వరుల జంట లాగా, ముచ్చటగా, వినాయకుడు కార్తికేయుడు, ఎంత వొద్దికగా పెరిగారు. తప్పు చేస్తే, అధికార శక్తి మోహములో మునిగితే, సొంత పిల్లల్ని అయినా, శివుడు క్షమించలేదు. పరీక్షలో నెగ్గటానికి, సొంత కొడుకైనా, కష్టపడి లేదా సంస్కార తెలివితో గెలవాలి, సొంతముగా. అలాంటి ఆదర్శ దంపతులు ఉన్నారా నేడు, అలాంటి పిల్లల్ని కని, భూమి పై సత్య ధర్మ పాలన నిలబెట్టాలి కదా?

మరి మన పెంపకాలు ఎలా ఉన్నాయి? ఎంత బద్దకముగా, నిర్లక్ష్యముతో పెంచితే, మన తల్లి దండ్రులను ఎంత అవమానిస్తే, మన పిల్లలు మనల్ని, నిర్దాక్షిణ్యముగా వదిలేస్తున్నారు. అంటే, పాపాత్ములమైన మనము, పాపపు సంతతిని భూమిపై వదిలి, పాపాన్ని పెంచి పోషించి, ఇంకా మన పాపము శాతము పెంచుకుంటూ పోతున్నాము, ఇంకో 10 జన్మలకి తరగని రాశి గా.

ఇంకో 10 జన్మలకి పాపం పెంచుకోవడం మంచిదా లేకా, మన అద్రుష్టం అంతే ఇప్పుడు ఉన్న దుర్భర పరిస్థితిలో, ఒంటికాలి ధర్మములో అని, మనశ్శాంతి గా ఉండటము మంచిదా? నిర్ణయం మీదే మనదే, ఫలితాలు మీవే మనవే.

సంపాదించిన ఆస్తులు ఆ పాపాత్ములకు ఇచ్చిపోతే, భస్మాసుర హస్తం లాగా, ఆ పాప ఫలితాలు మనకు, అలాగే ఆ పిల్లలు వారి చుట్టుపక్కల వారు నరకం అనుభవిస్తారు. ఈ చక్రం వీడదు, మనము మారము, ఏనాటికీ పున్నామ నరకం నుంచి విముక్తి కలుగదు.

మన పిల్లలు జాలి లేని బండలు గా, మనల్ని వదిలేవారు అయినప్పుడు లేదా అసలు పిల్లలు లేనప్పుడు, ప్రత్యామ్నాయం సంస్కారవంతుడైతే, బయట వాడైనా సరే, మనకు తల కొరివి పెడితే లేదా మన క్షేమము మంచి కోరితే, మంచి సంకల్పముతో, మనకు పుణ్య లోకం మోక్షం వస్తుంది.

అలాంటి వారు లేకపోయినా దొరకకపోయినా, మనము సాధనతో అరిషడ్వర్గాలను జయిస్తే, మనకు ఎటూ మోక్షం వస్తుంది.

కాబట్టి, పిల్లలు లేరు లేదా గుణవంతులు లేరు అన్న బాధవద్దు, ఈ 2 దోవలు మనకు ఉన్నాయి. ఆత్మ మనశ్శాంతి తో ఉండండి.

వారసులు కావాల్సింది, ఆస్తులకు పాపాలకు అరిషడ్వర్గాలకు కాదు, ఆదర్శాలకు సంస్కారాలకు మంచి గుణాలకు. కోట్లు సంపాదించి ఇచ్చి పోయిన వారి పిల్లల, పాట్లు చూడండి వార్తలలో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,979; 104 తత్వాలు (Tatvaalu) and views 224,526
Dt : 06-Mar-2021, Upd Dt : 06-Mar-2021, Category : General
Views : 694 ( + More Social Media views ), Id : 1007 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worry , no children , virtues , 2 ways , peace of mind , moksha , kaliyug
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content