Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఇంటలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా, నిష్పక్షపాతంగా, కనీసం నాయకుని శ్రేయస్సు కోసమైనా పని చేస్తుందా? పురాణాలలో ఎలా ఉంది?
జవాబు, ఇంటలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తూ ఉంటే, గత ప్రభుత్వం లో నాయకుడు మరియు అనుచరులు చేస్తున్న తప్పులు, స్పష్టంగా నిజాయితీగా చెప్పేవారు. నాయకులు సరి చేసుకునే వారు. ఇంత ఘోరమైన అవమానం, ఈనాడు జరిగేది కాదు. ఇప్పుడు పరిస్తితి అలాగే ఉంది, మార్పు లేదు.
అయితే వారు చెప్పినా కూడా, వినేందుకు, మన నాయకులు సిద్ధంగా ఉన్నారా? ఇది ఇంకో పెద్ద ప్రశ్న. మితిమీరిన అతి విశ్వాసము తో నాయ్కులు కూడా వినరు, తాము దైవాన్స సంభూతులు గా భావించుకుని.
ఇంటలిజెన్స్ వ్యవస్థ లో రికమండేషన్ లు తో, అయిన వారిని చేర్చి, దాని పటుత్వం ను దెబ్బ తీస్తుంది, మన నాయకులే.
ఎప్పుడు ఎదురు నాయకుల మీద మరియు తమ లోపల నాయకుల పై నిఘా ఉంచి, తమ ప్రభుత్వం లో జరుగుతున్న తప్పులు వైఫల్యాలను, పట్టుకునేందుకు సమయం మిగల్చడం లేదు కదా.
ఈ ప్రభుత్వం లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అవకతవకలు, నాయకుని ఆలోచనలు కు, వ్యతిరేకంగా ఉన్నాయి అని వారు రిపోర్ట్ ఇచ్చి, ఆసుపత్రి తప్పులు సరిచేయరా? ప్రభుత్వం పేరు, ప్రతిష్టలు పెంచరా?
నాయకులు అందరూ కరోనా వైద్యం కోసం, పక్కన రాష్ట్రాలు వెళుతున్నారు అంటే, మన ప్రభుత్వం కు గత ప్రభుత్వం కు కూడా అవమానం కాదా? ప్రజలకు మరియు మన ప్రభుత్వం కు, క్షేమం కాదని చెప్పి సరిచేయరా?
మామూలు విషయాలే ఇంత అధ్వాన్నంగా ఉంటే, ఇక గూఢాచారి భద్రతా వ్యవస్థ లోపాలు, అనుకోవడం అనవసరం. ఏదైనా గొడవలు ఇబ్బందులు జరిగిన తర్వాత నే, వీరికి తెలుస్తోంది. అంటే ఎంత నిర్లక్ష్యం, ఇంటలిజెన్స్ లో ఉందో తెలుస్తోంది.
గతంలో, రాజులు, మంత్రులు, సైన్యాధిపతులు, గ్రామ పెద్దలు, మారు వేషాలు లో తిరిగి, నగరంలో పట్టణంలో గ్రామంలో, స్వయంగా పరిస్థితి ని అవగాహన చేసుకునే వారు. పటిష్టమైన ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉన్నా కూడా, వీరూ స్వయంగా తిరిగేవారు, హఠాత్తుగా, ఎవరికి ముందే చెప్పకుండా.
త్రేతాయుగంలో రాముడు కూడా గూఢాచారి భద్రుని పిలిచి, ప్రజలు అనుకున్న వాస్తవం చెప్పమంటే, సీతమ్మ మీద అపవాదు విని, రాముడు ఏమి చేశారో మనకు తెలుసు.
ఇప్పుడు అంత నిజాయితీగా చెపితే, తమ ఉద్యోగాలు ఉంటాయో లేదో, ఇంటలిజెన్స్ సిబ్బందికి తెలీదు.
కాబట్టి, ఇప్పుడు బయట విలేఖరులే, గుడ్డిలో మెల్ల అనుకోవాలా? కొన్ని అయినా, నిజాలు చెపుతారు, విన్నది విన్నట్టుగా అందమైన పదాలలో.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,525; 104 తత్వాలు (Tatvaalu) and views 221,602 Dt : 21-Dec-2020, Upd Dt : 21-Dec-2020, Category : Politics
Views : 645
( + More Social Media views ), Id : 875 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
intelligence ,
system ,
work ,
well being ,
leader ,
myths ,
andhra ,
telangana ,
telugu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments