నడి రోడ్డు మీదే, దొరికిన నాలుగు మెతుకులు నీళ్ళు తో, కడుపు ఆకలి తీర్చుకుని - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,948; 94 తత్వాలు (Tatvaalu) and views 184,842.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఈ ఫోటో చూసి, కళ్ల వెంట నీళ్ళు సుడులు తిరుగుతూ, తన్నుకు వస్తూ ఉన్నాయి. ఓ పోలీసు అన్నలారా, హేట్సాఫ్, సాల్యూట్ ఫర్ యువర్ గ్రేట్ సర్వీస్.

మీ త్యాగం మీ సేవ మీ కర్తవ్యం, మా అందరి క్షేమం కోసం, ఎంతో ఉన్నతమైనది గొప్పది. ఏ ఊరు దో గానీ ఈ ఫోటో, ఇప్పుడు దే అనుకుంటున్నాము. మన పోలీసు సోదరులు కు, శిరస్సు వంచి, శత కోటి వందనాలు.

ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ ఉన్నారు? గుడి లోపల ఉన్నారా? మన రక్షణ కోసం, మానవ పోలీసు రూపంలో, ఇలా రోడ్డు మీద ఉన్నారా? మనము గౌరవించాల్సింది వీరిని కాదా?

బతుకు తెరువు కావచ్చు, కానీ మరీ ఇంత ఇబ్బందులు తోనా, ఇలాంటి పరిస్థితి లోనా? నడిరోడ్డుపై దుమ్ములో భోజనమా? పగవాడికి కూడా, ఈ కష్టం వద్దు, భగవంతుడా.

మన కుటుంబాలతో మనము, ఇంట్లో హయిగా ఫాన్ కింద, శుచి శుభ్రంగా తిని టీవీ చూస్తూ కూర్చుని ఉంటే, మన పోలీసులు సొంత కుటుంబాలను పిల్లల ను వదిలి, మన అందరి మంచి కోసం, ఇలా రోడ్లు వెంట పడికాపులు కాస్తూ ఉన్నారు ఇబ్బందులు లెక్కచేయక.

మధ్యలో కాస్త ఖాళీ దొరికితే, అలాగే ఆ గాలిలో ఆ వేడి లో, ఆ దుమ్ము కొట్టుకుని ఉన్న నడి రోడ్డు మీదే, దొరికిన నాలుగు మెతుకులు తో దొరికిన నీళ్ళు తో, మీ కడుపు ఆకలి తీర్చుకుని, మరలా మా కోసం వెంటనే, డ్యూటీ ఎక్కుతున్నారు. రేయనక పగలనక ఎండనక వాననక మీ కర్తవ్యానికి విరామము లేదు, ఓ పోలీసు అన్నా, వందనాలు, శత కోటి వందనాలు. అందుకే ఇలాంటివి బయటకు రావాలి అనే, మేము, మండల లేదా పట్టణ లెవల్ ఫేస్బుక్ పేజి అడుగుతుంది.

దయచేసి మనందరం ఇంట్లో నే ఉందాం, మన పోలీసులు సోదరులకు శ్రమ తగ్గిద్దాం. పోలీసు కూడా, మన లాంటి మనిషే. వారి ఆరోగ్యానికి, వారి కుటుంబ శ్రేయస్సు కై ప్రార్ధన చేద్దాము. కరోనా ను కట్టడి చేద్దాం.

ఇదే మన దేశానికి మన ప్రజలకు, మనం చేసే కష్టం లేని, గొప్ప ఉచిత సేవ, మన గృహ మందే ఉండి. ధన్యవాదాలు, వందనాలు, నమస్కారములు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,948; 94 తత్వాలు (Tatvaalu) and views 184,842
Dt : 29-Mar-2020, Upd Dt : 29-Mar-2020, Category : News
Views : 831 ( + More Social Media views ), Id : 456 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Corona , Covid 19 , police taking food on road , Mandal Police info , Mandal facebook page , District , Andhra Pradesh , DGP , SP , DSP , CI

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content