ఏరువాక పూర్ణిమ - మన పండుగ లు ఆచారాల వెనుక, చాలా శాస్త్ర విజ్ఞానం ఉంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2139 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2174 General Articles and views 2,219,697; 104 తత్వాలు (Tatvaalu) and views 245,315.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పంచ భూతాలతో నిండిన ప్రకృతిని, దైవంగా ఆరాధించడం మన భారతీయుల సంప్రదాయం.

వ్యవసాయం మన ఆహార మనుగడకు జీవనాధారం. అందుకే రైతే రాజు. కానీ జనం పరిస్థితి లు బాగోక, పల్లెలు విడిచి పట్నాలకు పోవడంతో, ఇతర ప్రాపంచిక విషయాలకు జనం ఎక్కువ విలువ ఇవ్వడంతో, పొలాలు మరియు రైతులు పరిస్థితి పట్టించుకునే వారు తగ్గిపోయారు.

దాని వలన, రాబోయే రోజుల లో ఆహార ధరలు విపరీతంగా పెరగడం, కల్తీ లు పెరగడం, అసలు దొరకని పరిస్థితి వచ్చిన కూడా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే మనము చేసుకున్న తప్పులే మనల్ని వెంటాడుతాయి.

వ్యవసాయం ఒక మహా యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు, భూమి పూజ చేయడం అనాదిగా వస్తూన్న, మన ఆచారం.

పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని, ఏరువాక అని అంటారు. జ్యేష్ట శుద్ధ పూర్ణిమను, ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.

ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు, జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో, ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు.

అందుకనే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని జరుపుకుంటారు.

వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు.

చూడండి మన పూర్వీకుల కు ఇంత జ్ఞానం ముందే ఉంది. మన పండుగ లు ఆచారాల వెనుక, చాలా శాస్త్ర విజ్ఞానం ఉంది. పాత చాదస్తం అని వాటిని వదిలేసి, కరోనా చేతిలో చిక్కి బాధలు పడుతున్నాము.

ముందే లెక్కలు వేసి ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయో చెప్పగలరు, ఆనాడే మన పెద్దలు. పిల్లల కు వాటి గురించి చెప్పండి.

Jul 4-5th, చంద్రగ్రహణం కూడా ఉంది పౌర్ణమికి, మీ కాలెండర్ లో చూడండి మరి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2174 General Articles and views 2,219,697; 104 తత్వాలు (Tatvaalu) and views 245,315
Dt : 05-Jun-2020, Upd Dt : 05-Jun-2020, Category : General
Views : 1616 ( + More Social Media views ), Id : 587 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : eruvaka purnima
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content