రాజైనా, అహంకారం అనే జ్వాలలో కాలిపోతుంటే, కఠన పదజాలం తో మంచి దోవ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,070,246; 104 తత్వాలు (Tatvaalu) and views 236,572.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* గురువు గారు చాగంటి మాటల
* సన్నాయి సుమధురంగా
* అమర్యాదగా అయినా, కాపాడాలి
* రావణుడు మోహము, మారీచుడు
* క్షేమం కోసం, కఠన పదజాలం
* వారి నిప్పులు లలో, స్వార్ధపు చలి
* అహంకారం దెబ్బతిని, ఎదురు దాడి
* ఎదుటి వారి పతనం, మన కళ్ళతో
* శిక్ష తో పతనం నుంచి తమను
* విభీషణుడు, అన్న రావణుడు ని
2 min read time.

24 గంటలలో మారే , వాట్సప్ స్టేటస్ మరువద్దు మిత్రమా.

30 ఏళ్ళు దాటిన వారెవరైనా, సొంత అనుభవం తో సొంతంగా తెలుగు లో 2 మాటలు ఫార్వార్డ్ చేసే ప్రతి వీడియో, ఫోటో తో పాటుగా కూడా రాస్తే, బాగుంటుంది. ప్రొఫైల్ ఖాళీ ఫోటో, అలాగే 2 మాటలు రాయడం, మానడం లో మన బుద్ది మరియు పిల్లల పెంపకం కనపడుతుంది.

30 లోపు వారూ రాయగలిగితే, మేధావులు. మనకేమి అర్థం అయిందో చెప్పాలి కదా, లేదంటే మనకూ ఎటూ ఎక్కదు, అవతలి వారికి ఎక్కదూ. క్షణంలో అందరం మరుస్తాము.

నోటి తో గబగబా 100 అబద్ధాలు చెప్పవచ్చు, రాతతో కేవలం 50 అబద్ధాలు కూడా చెప్పలేము. ఎందుకంటే మెదడు, చేతి వేళ్ళు పనిచేయాలి. ఎదురు సాక్ష్యం ఉంటుంది కూడా, నాయకులు అధికారులు మిత్రులు బంధువులకు అవే మాటలు పంపేటప్పుడు.
* * *

గురువు గారు చాగంటి మాటలను వినండి. నిద్ర పోతున్న రాజు, మంటలలో కాలిపోతూ ఉంటే, పల్లకి మంగళ వాయిద్యాలతో సుమధురంగా, మేలుకొలుపు తామా లేక కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చి లాగేసి కాపాడతామా?

సన్నాయి మేళవించి సుమధురంగా లేపబోయే సరికి సమయం పట్టి, రాజు పూర్తిగా కాలిపోతారు. కాబట్టి, అమర్యాదగా అయినా, ఈడ్చి బయటకు లాగి, ఆయనను కాపాడాలి.

అదే ముఖ్యం, ధర్మం, న్యాయం, అమర్యాదగా అయినా, అతని ప్రాణాలు కాపాడాలి.

అంటే, రాజు రావణుడు మోహము లో ఉంటే, మారీచుడు, ధైర్యముగా, నీతి బోధ చేసాడు. కానీ రావణుడు బెదిరించాడు, చావు అక్కడ కావాలో రాముడితో, లేదా ఇక్కడనో తేల్చుకోమని.

అంటే రాజైనా, మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, అధికారి, బంధువు, స్నేహితుడు, సొంత అన్న అయినా, మూర్ఖత్వం అహంకారం అనే అగ్ని జ్వాలలో కాలిపోతుంటే, పతనానికి పరుగులు తీస్తూ ఉంటే, వారి క్షేమం కోసం, వారికి కఠన పదజాలం తో అయినా, మంచి దోవ బుద్ది చెప్పే వాడు, నేడు ఏరి పక్షపాతం లేకుండా?

అందరూ తమ పదవి, రాబడి, పలుకుబడి, అవసరం, అవకాశం పోతుంది అని దురాశ తో, తప్పు చేసిన వారికి అండగా ఉండి, ఇంకా ముందుకు నెట్టి, తప్పులు సమర్ధన చేస్తున్నారు, ఏం పర్లేదు, ఇప్పుడు రోజులు అంతే లే అని, వారి నిప్పులు లలో, తమ స్వార్ధపు చలి కాచుకుంటున్నారు. వీరి కుటుంబం పైన కూడా, నిప్పులు పడకపోవు భవిష్యత్తు లో కర్మ కాలి.

సరే పక్కన వారి గురించి వదిలేస్తే, మంచి మాటలు చెపితే కఠినంగా భవిష్యత్తు పాడవకూడదని, రాజైనా బంధువైనా స్నేహితులైనా, మనసుతో మంచి వింటారా?

లేదు వినరు గాక వినరు, తమ తప్పులు ఒప్పుకోలేక అహంకారం దెబ్బతిని, పైగా ఎదురు దాడి చేసి, నోరెత్తిన వాడి నోరు మూయిస్తారు. అసలు నువ్వు ఎవరు, నీకేమి సంబంధం, నీకెందుకు మేం ఎలా నాశనం అయితే అంటారు కదూ?

ఎందుకంటే ధైర్యంగా, మంచి చెప్పిన వాడిని, మామూలు జనం కూడా ఆదరించరు.

మనకు లేని మంచి పేరు, వాడికెందుకు రావాలని. మనలాగే అందరూ మూర్ఖులు గానే ఉండాలి, ఎదుటి వారి పతనం, మన కళ్ళతో ఆనందముగా చూడాలి, అని వీరి అభిప్రాయం.

నేటి లోకం తీరు అలాగే ఉంది. ఏమీ ఆశించకుండా, మంచి చెప్పిన కూడా, కేవలం వారి పతనం ఆపడానికి, భరించలేక ద్వేషం తో దూరంగా వెళుతున్నారు. కానీ, శిక్ష తో పతనం నుంచి తమను తాము కాపాడుకోలేకపోతున్నారు, వారి కుటుంబాలను విషాదము లో నింపుతున్నారు.

మన ప్రయత్నం, అసలు ఆ పరిస్థితి దుస్తితి, రాకుండా ఉండాలి అని, ముందు జాగ్రత్తలు.

అందుకే విభీషణుడు, అన్న రావణుడు ని వదలి, రాముడు వైపు వెళ్ళారు, అన్ని కు చెప్పి చెప్పి విసిగి వేసారి. అలాంటి నీతి వంతులు ఉన్నారా, మన చుట్టూ? అవకాశవాదులు తప్ఫ? జాగ్రత్తలు సుమా.

మా మీద కోపం వద్దు, మీ శ్రేయోభిలాషులమే  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,070,246; 104 తత్వాలు (Tatvaalu) and views 236,572
Dt : 06-Jun-2021, Upd Dt : 06-Jun-2021, Category : General
Views : 770 ( + More Social Media views ), Id : 1193 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : king , burning , flames , pride , good , harsh , words
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content