Even those who have assets worth crores of rupees, cannot find loyal ones. If good people come out? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,097,267; 104 తత్వాలు (Tatvaalu) and views 237,843.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Even those who have assets worth crores of rupees, cannot find loyal ones. If good people come out? కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వారికి కూడా, నమ్మకమైన వారు దొరకడం లేదు. మంచివారు బయటకు వస్తే?*

*Response* - I have never seen a prize of 8000 rupees for 35 songs, along with a Guna Samskara certificate of appreciation. Our foreign friends said that they can get vegetables for a week for 100 dollars. Even though I thought for so many days that, there are no good days, now I know that, there are no good people who receive/ appreciate good things.

*స్పందన* - ఏవండీ, 35 పాటలకు, 8 వేల రూపాయలు బహుమతి ఇవ్వడం, అదీ గుణ సంస్కార ప్రశంసా పత్రం తో, ఎక్కడా చూడలేదు. 100 డాలర్లకు వారం కూరగాయలు వస్తాయి అని మా విదేశీ స్నేహితులు చెపారు. మంచి కి రోజులు లేవు అని ఇన్ని రోజులు అనుకున్నా, మంచిని అందుకునే/ మెచ్చుకునే మంచి మనుషులు కూడా లేరు, అని ఇప్పుడు తెలుసుకున్నా.

The other day, I told one of my friends about this competition, if there was an original intention to give it, he should just give it for free, but what is this mental/ manasik Samskara, competitive tests?

మొన్న మా స్నేహితులు ఒకరికి, ఈ పోటీ గురించి చూపిస్తే, అసలు ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే, ఊరికే ఉచితముగా ఇవ్వాలి కాని, ఇలా మానసిక సంస్కార, పోటీ పరీక్షలు, ఏమిటి?

For our stupid children don't know how to face, these Samskara trials, life's problems. Mantras, mouth can't speak properly. Even God's song, they can't sing. They sing Oo anTava Mawa Uhoo anTava, they wave their legs and arms like a patient, and dance like hysterics.

మన చవట పిల్ల లకు, ఈ సంస్కార పరీక్షలు, జీవిత సమస్యలు, ఎదుర్కోవడం రాదే. మంత్రాలు నోరు తిరగవు. పోనీ దేవుని పాటలా, అదీ రాదు. ఊ అంటావా మావా ఉహూ అంటావా అని, రోగిష్టోరిలా కాళ్ళు చేతులు ఊపుతా, హిస్టీరియా వచ్చినట్లు ఎగరమంటే, ఎగురుతారు.

Even though we know cooking at home, lazy, we like to eat out. We know it is waste of money and diseases, the cost of food, the cost of disease, we strengthen the theory. We need only jiva himsa food
(meat), vegetarian food alone is not tasty for us. Fasting means fear, can't stay.

ఇంట్లో వండుకోవడం కు ఒళ్ళు బద్దకం, రోగాలు అని తెలిసినా, బయట తినడమే, మాకు ఇష్టం. తిండికి ఖర్చు, రోగానికి ఖర్చు, సిద్దాంతాన్ని బలపరుస్తాము. జీవ హింస ఆహారం మాత్రమే కావాలి, శాఖాహారం మాత్రమే రుచించదు. ఉపవాసం అంటే భయం, ఉండలేము.

Without makeup, even we cannot see our face. Beauty that we don't have, don't we borrow it with jewels? Waking up before sunrise, living without debt for eating dal, are not in our lineage (vamsha). We should go to the temple for prasad, should we go with prasad? No tilak on the face, no traditional full dress on body.

మేకప్ లేకుండా, మన మొఖం మనమే చూడలేము. మనకు లేని అందం, ఆభరణాలతో అరువు వద్దా? సూర్యోదయానికి ముందు లెగవడం, అప్పు తో పప్పు తినకుండా బతకడం, మన వంశం లో లేవు. దేవాలయానికి ప్రసాదం కోసం పోవాలి గానీ, మనము ప్రసాదం తీసుకుని వెళ్ళడమా? మొఖం మీద బొట్టు ఉండదు, ఒంటి నిండా గుడ్డలు ఉండవు.

Yoga, Meditation is not possible for us. Even we can't sit at one place by closing eyes for 30 minutes. All our sins will run in our mind.

యోగా, ధ్యానం మనకు సాధ్యం కాదు. మనం 30 నిమిషాలు కూడా కళ్ళు మూసుకుని ఒకే చోట కూర్చోలేము. మన పాపాలన్నీ మన మనస్సులో పరుగెత్తుతాయి.

We, our children, will not be good for the sattvic fine arts. We have no mental strength. Our mind does not listen to us. Intoxicated with worldly pleasures, it runs towards the fall.

సాత్విక సున్నిత కళలకు, మనము, మన పిల్లలు, పనికి రారేమో అన్నారు. మనకు మానసిక బలం లేదు. మన మనసు, మన మాట వినదు. ప్రాపంచిక బ్రమలులో మత్తులో ఉంటుంది, పతనము వైపు పరుగులు తీస్తుంది.

That's why we have old age life, lonely lives or orphanages, even if everyone is there. Today, I saw a video where a daughter-in-law was beating her uncle mercilessly with a stick. It is said that the husband went abroad to earn money and installed CCTV in the house.

అందుకే మనకు ముదుసలి తనములో, ఒంటరి బతుకులు లేదా అనాధాశ్రమాలు, అందరూ ఉండి కూడా. ఈ రోజే, ఓ వీడియో చూసాను, ఒక కోడలు, మామను చేతి కర్ర పెట్టి, దయలేకుండా కొడుతున్నది. భర్త, సంపాదన కోసం, విదేశాలు పొయ్యాడు అంట, ఇంట్లో సీసీ టీవీ పెట్టి.

Another daughter-in-law, angry with her husband, called the police. They caught him. Now in group she is asking, how can I live now? Even sons-in-law, our sons, are also like bad nature people.

ఇంకో కోడలు, భర్త మీద కోపముతో, పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్ళు ఆయనను పట్టుకుపోయారు. ఇప్పుడు లబో దిబో అంటూ, గ్రూప్ లో అడుగుతున్నది, ఎలా నా బతుకు ఇప్పుడు అని. అల్లుళ్ళు అంటే మన కొడుకు లు, అలాగే నీచముగా తయారు అయ్యారు.

Where do we have patience, tolerance, sacrifice, kindness and compassion? Our elders did not teach, our children will never learn. Our marriage is not a marriage of quality/ Guna. We are the ones who sold/bought soul for visa, assets, position, beauty. She said all these.

మనకు ఓర్పు, సహనం, త్యాగం, దయ, కరుణ ఎక్కడ ఉంటాయి. మా పెద్దలు నేర్పలేదు, మన పిల్లలు ఎటూ నేర్చుకోరు కదా అన్నది. మన పెళ్ళి నే, గుణ పెళ్ళి కాదు. వీసా, ఆస్తి, పదవి, అందం కోసం, ఆత్మను అమ్ముకున్న/ కొనుక్కున్న బతుకులు మనవి.

* * *

Yes my dear friend/ sister in law, if we know our mistakes and correct them, that is self-knowledge, knowing ourselves. Future difficulties will be reduced.

అవును వదినా/ మిత్రమా, మన తప్పులు మనము తెలుసుకోవడమే సరిదిద్దుకోవడమే, ఆత్మ జ్ఞానం. భవిష్యత్ కష్టాలు తగ్గుతాయి.

For children studying in Vedic school or from samskar/ satvik family, this competition is very small. They have all the cultural characteristics. They sing easily. See if we have someone nearby, introduce them directly to them, they will receive direct messages. Then I told them that they will have a chance to participate in this competition.

వేద పాఠశాల చదివే లేదా సంస్కార సాత్విక కుటుంబం లో పిల్లలకు, ఈ పోటీ చాలా చిన్నది. వారికి అన్ని సంస్కార లక్షణాలు ఉంటాయి. ఈజీ గా పాడేస్తారు. మనకు దగ్గర లో ఎవరైనా ఉంటే చూడు, వారిని నేరుగా వీరికి పరిచయం చేస్తే, వారికి నేరుగా సందేశాలు అందుతాయి. అప్పుడు వారికి ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది అని చెప్పాను.

And you can marry anyone, why did you marry only them? Can you go to any hotel or cinema? Why did you go for this only, that it was good? Why are you looking for a good relationship for your children? Why did you say that only good people can work at your shop? Why did you say that, those who come for rent should be ethical? Why did you say that, you should go to a good doctor?

ఇంక నువ్వు పెళ్ళి ఎవరినైనా చేసుకోవచ్చు కదా, వీరినే ఎందుకు చేసుకున్నావు? ఏ హోటల్, సినిమా కైనా వెళ్ళవచ్చు కదా? దీనికే ఎందుకు వెళ్ళావు, బాగుంది అని? నీ పిల్లలకు, ఎందుకు మంచి సంబంధం చూస్తున్నావు? మీ షాప్ లోకి, మంచి వారికే, పని అని ఎందుకు అన్నావు? అద్దెకు వచ్చే వారు, నీతి గా ఉండాలి, అని ఎందుకు అన్నావు? మంచి డాక్టర్ దగ్గరకే వెళ్ళాలి, అని ఎందుకు అన్నావు?

When you say all this, should we give gift to a bad Guna person? Will we get a job or a college seat without qualification? Then she closed her mouth.

ఇవన్నీ నువ్వు అన్నప్పుడు, మరి బహుమతికి, పాత్రత ఉండవద్దా? అర్హత లేకుండా ఉద్యోగం అయినా, కాలేజీ సీటు అయినా ఇస్తారా? అంటే నోరుమూసుకున్నది.

Whoever comes or not, keep up your good effort. Even those who have assets worth crores of rupees, cannot find loyal ones. Because of you, if good people come out, good for all. A man in town can catch, people like you, with your best efforts.

ఎవరు వచ్చినా రాకపోయినా, మీ మంచి ప్రయత్నం మీరు కొనసాగించండి. కోట్ల రూపాయల ఆస్తి ఉన్న వారికి కూడా, నమ్మకమైన వారు దొరకడం లేదు. మీ వలన, మంచివారు బయటకు వస్తే, అందరికీ మంచిది. ఊరికి ఒక మనిషి, మీలాంటి వారిని పట్టుకోవచ్చును, మీ మంచి ప్రయత్నముతో.

*Reply* - Thanks for your kind words. We will wait and see if anyone comes forward to give manasik balam to their children to face future life difficulties with smile.

*ప్రత్యుత్తరం* - మీ మంచి మాటలకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొనేందుకు, తమ పిల్లలకు మానసిక బలం అందించేందుకు, ఎవరైనా ముందుకు వస్తారేమో ఎదురు చూద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,097,267; 104 తత్వాలు (Tatvaalu) and views 237,843
Dt : 12-Mar-2024, Upd Dt : 12-Mar-2024, Category : General
Views : 223 ( + More Social Media views ), Id : 2050 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : assets , worth , crores , rupees , loyal , prize , guna , samskara , certificate , appreciation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content