అన్ని బాగున్నప్పుడు, సమాజం తో ఇతరుల బాధలతో మాకు అనవసరం, ఈరోజు గో ఫండ్ లో చేయి చాస్తున్నారు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,869,937; 104 తత్వాలు (Tatvaalu) and views 225,261.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

When everything is good, those who think that no need to worry about with this society and other people's suffering, are begging for combined 5 10 rupees/ dollars in Go Fund today.

అన్ని బాగున్నప్పుడు, ఈ సమాజం తో ఇతరుల బాధలతో మాకు అనవసరం అనుకున్న వారు, ఈ రోజున గో ఫండ్ లో తలదించి, సామూహిక 5 10 రూపాయలు/ డాలర్స్ కు చేయి చాస్తున్నారు

అపాత్రా దానం చేస్తే ఏమి జరిగింది? మామకు వెన్నుపోటు, బాబాయికి గుండె పోటు, అవసర అవకాశ నీచ బానిస ప్రజలకు పన్నుపోటు/ ప్రాణాలపోటు అంతేనా?

What happened to Apatra Danam? Uncle (Mama) backstab, Uncle (Babai) heart pain, Need opportunity poor slave people's tax/life pain, is that all?

హ్రుదయ స్పందన ఒకరు అడిగితే చెప్పేది చేసేది కాదు. ఒకరు అడిగితే చెప్పేది, చేసేది, రజో తామస రాక్షస గుణాలు. అవి స్వార్ధపూరిత గుణాలు, వంశాలు, లక్షణాలు, కపటం నటన 2 నాల్కల ధోరణి, బేరీజు వేసుకుని పనులు చేతలు ఉంటాయి, స్తాయి, అవసర, అవకాశం బట్టి.

ప్రతి మాటకి, మేము చాలా బిజీ, స్వయం పతనంలో. ఎంత బిజీ అంటే, మా పిల్లలు అలాగే భాగస్వామి ఏమి చేస్తున్నారో మాకెలా తెలుస్తుందండి, ఇంక బయట వారు సంగతి అసలు అనవసరం. మా ముదుసలి అమ్మ అయ్య అత్త మామ నే, మాకు సుదూరం అంటున్నారు.

మొన్న చూసారు కదా, కేవలం 4 ఏళ్ళు మాత్రమే తెలుసు, కానీ మనమంటే చాలా బాగా మాట్లాడతారు, అందరితో కూడా. అంతే అంత కన్నా మాకేమి బంధం లేదు, కనీసం ఇంట్లో మంచి నీరు కూడా, రూపాయి వ్యాపారం కూడా లేదు, ఇరుగుపొరుగు ఇల్లు కాదు.

కానీ ఆ స్నేహితుని గుణాన్ని గౌరవిస్తూ కధనము రాసాము, ఎందుకంటే మన అందరికీ అది ఉపయోగము కాబట్టి, మన స్తితి గతులు గుణాలు బేరీజు వేసుకోవచ్చు.

ఇంకొకరు వారి బాధ చెప్పారు, మీరు రాండి 2 వారాలు ఇక్కడ ఉండి, సరి చేసుకుని లేదా వైద్యం ఇప్పించుకుని వెళుదురు అని చెప్పాం. ఇంకొకరు బాధకి, మీకు సగం ఖర్చు మేము పెట్టుకుంటాం, రాండి 6 నెలల లోపు ఉండి వెళుదురు అని చెప్పాము. వారు మనల్ని అడగలేదు ఖర్చు పెట్టుకోమని, లేదా మనతో ఇంట్లో ఉంచుకోమని.

అట్లని ఉత్తి నోటి మాటకాదు, మన ఇంట్లో వారికి పూర్తి ఆరోగ్య రక్షణ బాగోగులు చూడటం ఉంటుంది, లేదంటే చెప్పము. ఈ ఊళ్ళోనే చేయగలము, ఆ ఊళ్ళో కష్టం అని కూడా ముందే చెప్పాము, అక్కడ అన్ని దొరకవు, దొరికినా కల్తీలు కాబట్టి.

వారు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిస అని మనకు తెలిస్తే, వారు ఎటూ రారు, వచ్చినా ఒక్క రోజు కూడా, నీతి నియమ త్యాగ ఓర్పు సహన నిష్టలతో నిలవలేరు. వారు వచ్చాక అబ్బే పిల్లలతో గొడవ, ఇంట్లో వారితో గొడవ, రోగాల బెడద, నరాల నిస్సత్తువ, మేము మీకు చెయ్యలేము, అనే 2 నాల్కల కపట నటన ధోరణి ఉండదు.

మరి మనకు నీతి నియమ త్యాగ ఓర్పు సహన నిష్టలు ఉన్నాయా అన్న ప్రశ్న రాదు వారి నుంచి, ప్రభుత్వ ఉద్యోగం లక్షల ఆదాయం ఫించను త్రుణప్రాయముగా వదలి, 78+ ఏళ్ళ సజీవ గురువు సేవ 10+ ఏళ్ళు చేస్తున్న మనకు త్యాగ ఓర్పు సహనం లేదు అనుకుంటే, మరి ఇలాంటి త్యాగం సేవ చేయలేని వారికి, అవి అసలు ఉండవు కదా?

సాత్విక గుణం, ఎదుటి వారి అవసరాలను కష్టాలను నష్టాలను తప్పులను గుర్తించి, వారికి ముందు జాగ్రత్తలు చెప్పి, ఆలోచింప చేసి, సరి చేసి, రాబోయే కష్ట నష్టాలను ముందు గానే చెప్పి, భవిష్యత్ ఎదుర్కునే ధైర్యాన్ని నింపుతుంది, తాను ఆచరణలో చూపిస్తూ, నిస్వార్ధముగా.

సొంత ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు, చుట్టూ ఉన్న ముదుసలి వారికి లేదా సజీవ గురువు సేవ చేస్తే, అలాగే సంస్కార పిల్లల పెంపకం పై శ్రద్ద ఉండి, రేపు వాళ్ళ ఇంట్లో దేవతలుగా ఉండగలము అన్ని ధైర్యం ఉంటే, ఇతరుల బాధ మన బాధగా తలచి, హ్రుదయం స్పందిస్తుంది.

అది లేని బండరాళ్ళకు, మాకు బాగుంది మాకు ఇతరులతో అనవసరం అని మత్తులో అంటే, ఆ కుటుంబం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో మగ్గుతుంది. అన్ని బాగున్నప్పుడు, ఈ సమాజం తో ఇతరుల బాధలతో, మాకు అనవసరం అనుకున్న వారు, ఈ రోజున గో ఫండ్ లో 5 10 రూపాయలు/ డాలర్లు సమిష్టి దానం కు అడుక్కుంటున్నారు.

అన్ని ఉన్నాయి మేము యుగపురుషులము అన్న వారే, రోడ్ పైకి వచ్చి చేతులు చాచి, తమ్ముళ్ళూ మేము పెంచి పోషించిన, వైరస్, మమ్మల్నే కాటేస్తుంది, ఇతరులతో పాటుగా, అని ఇన్నాళ్ళు తెలుసుకోలేని అజ్ఞానిని. కాషాయం కట్టి కూడా, 70 ఏళ్ళకు, ఇతరుల సగం వయసు ఉన్న భాగస్వామికి, విడాకులు ఇప్పించి మరీ, మనువు చేసుకునే ఉదాత్త సంస్కార గుణం కలవాడిని, దయచేసి మీరంతా మాకు అండగా నిలవండి అని ప్రాధేయపడితే, ఆ తమ్ముళ్ళు గేళి చేస్తూ, చెప్పులు టమోటాలు కోడిగుడ్ల లాంటి వాటితో, బదులు ఇచ్చారు, నీ అవసరం అయిపోయింది, మేము కొత్త వైరస్ తో సంగమం అని.

మీ ఉదాత్త సంస్కార, సామాజిక వర్గ రాజకీయ పెంపకములో ఎదిగిన నాయకులుగా, మేము వెన్నుపోటుకే దాసులమూ, అని గర్వముగా హోటల్ లో దాంకున్నారు. ప్రజలు కూడా అదే మాయలో ఉండి, ఆ యుగపురుషులను చిత్తు గా ఓడించారు, మావి వెన్నుపోటు బుద్దులే అని, తేలిక మార్గము లో ధనం అధికారం ఆస్తులు మాకూ కావాలి అని, ఉచితాలకు చొంగ కారుస్తూ, జై నక్క పులి పాము అంటూ, మాకు ఆవు వద్దు అంటూ.

ఇప్పటి దాకా పక్కవారితో మాకు వద్దు, మా స్టేటస్ అంటే 2 ఉద్యోగాలు, మా వయసు వారు, మాలాగే 4 ఇళ్ళు ఉన్నవారు, మాలాగే చెంచా గిరి వారు, మాలాగే నాయకులు, మాలాగే కపట నటనాలు, మాలాగే వ్యాపారస్తులు, మాలాగే ముదుసలి వారిని వదిలినవారు, పిల్లలకు కుసంస్కారం నేర్పినవారు, మాలాగే వెన్నుపోటు వారే కావాలి అన్న దరిద్రపు బతుకులకు, 5 10 అడుక్కునే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? అది వారి వంశ లక్షణమా? వారి తల్లి దండ్రులు, అత్త మామలు నేర్పిన సంస్కారమా? 2 నాల్క ధోరణా?

నాడు సమాజం లేదా ఇతరులు వద్దు, ఇప్పుడు వారే ముద్దు నా చేయి చాపడానికి?

చూశారు కదా, స్టేటస్ లో ఎంత మంది, ఆరోగ్య అంటే కుటుంబ నిర్లక్ష్యముగా ఉండి, రోగాలతో లేదా నిర్లక్ష్య డ్రైవింగ్ తో లేదా కాలవలు చెరువులు సముద్రం కొండలతో పోయి, అంతో ఇంతో వేయండి మా పిల్లల చదువుకు, ఇంటి అప్పుకు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కు, అని దీనముగా అడుగుతున్నారో?

ఇన్ని రోజులు, అదే సమాజం సాత్విక బాగు కోసం ఏమి చేసావు నిస్వార్ధముగా, మీరు మీ కుటుంబం? కనీసం చీ చీ మేము చదవము స్పందిచము శుభాకాంక్షలు తెలుగు లో చెప్పలేని బలహీనులము అన్నా, కనీసం మీరు బాగుండండి, అరిషడ్వర్గ బానిసత్వం వీడి, అని ప్రాధేయపడ్డామా, 5 నుంచి 20 ఏళ్ళుగా?

ఇది ఉచితమేగా, ఎందుకు చెయ్యలేదు? ఎందుకంటే, వియ్ డోంట్ కేర్ అని మీరు అనుకోబట్టి. మరి రేపు మన కుటుంబం ను, మన పిల్లలను, ఎవరు కేర్ చేస్తారు?

రోగముతో పోయిన వారికి, వారు అలా అకాలంగా పోకుండా ఉండాలంటే ఏమి కావాలి? మీ లక్షల డబ్బా, మీ అధికారమా, మీ బలగమా? కాదు, కేవలం ఓ మంచి మాట, ఓ మంచి దోవ, ఓ మంచి నమ్మకం? చెప్పినా, వినకుండా పోయారా, ఇంక వారికి ఎందుకు సహాయం?

అపాత్రా దానం చేస్తే ఏమి జరిగింది? మామకు వెన్నుపోటు, బాబాయికి గుండె పోటు, అవసర అవకాశ నీచ బానిస ప్రజలకు పన్ను పోటు/ ప్రాణాల పోటు అంతేనా?

సొంత బిడ్డలు ఈ రోజైనా, మా నాన్న, మా బావ కన్నా దుర్మార్గుడు కాదు, మేము తప్పు చేసాము, మా బలం సొంతగా నిరూపించుకోవాలి కానీ, ఇతరులను పడదోసి కాదు అని చెప్పగలరా? ఆ పెంపక సంస్కారం, వారికి, వారి వెంట తిరిగే చెంచాలకు ఉందా?

ఒక పార్టీతో ఒక సంఘముతో సేవలు చెప్పుకోవడం, ఎన్నికల/ పదవి కోసం మాత్రమే, అది స్వార్ధము. కానీ మీ సొంతముగా, మీ గుణముతో, మీ కళతో, కనీసం మీ ఇంట్లో ఒకరికి, నిస్వార్ధముగా, త్యాగం తో సేవ చేసారా? మీ సొంత మానసిక నియంత్రణ చేసారా? ఆయుర్వేదం లాంటి మందు ఇచ్చి, ఆరోగ్యం ఆయుష్షు పెంచి, బిళ్ళ నుంచి అర బిళ్ళ చేసారా? చెప్పండి.

లేదా ఒంటరి తల్లి/ కూతురు/ కొడుకు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి, మీరు ధైర్యముగా ఉండండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము అని, 3 ఏళ్ళు పై గా ఉద్యోగ ఆదాయం లేకపోతే మేము ఉన్నాము అని, లేదా మీ ఇంటి పరిశుభ్రత బాధ్యత మాది అని, పోనీ బయటవారికి చేసారా, సేవ చిత్తశుద్దితో, సజీవ గురువు సేవలా?

ఇంక మీకు స్పందన ఎలా వస్తుంది? ఎందుకు మీరు ఇతరులను అడుక్కొవటం, మీ పెద్దలను తలదించేటట్లు చేయడం. ఇతరుల విదలింపు తో, మన కుటుంబం, పిల్లలు, సంస్కార గుణం తో వర్ధిల్లు తారా? అదే దిగజారుడు తనం అలవాటు చేసుకోరా అప్పులతో?

మరి మీ పెంపకం లో పెరిగిన, పిల్లల పరిస్తితి ఏమిటి? మా బావే కరెక్ట్, మా తల్లి దండ్రులు కన్నా, అంతేనా దిగజారిన వంశ గుణం?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,869,937; 104 తత్వాలు (Tatvaalu) and views 225,261
Dt : 07-Jan-2024, Upd Dt : 07-Jan-2024, Category : General
Views : 138 ( + More Social Media views ), Id : 1980 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : everything , good , need , worry , society , people , suffer , beg , rupees , gofund
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content