పిల్లలకు ధనమిచ్చి, మీ దగ్గర ఉంటాను అని అడుగుదాము అనుకుంటున్నా. చులకన అవుతానా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,930,230; 104 తత్వాలు (Tatvaalu) and views 230,245.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ, పెద్దా వ్యాపారాలు ఉన్నాయి, ధనము కు లోటు లేదు. కానీ వయస్సు కు శక్తి కి లోటు వస్తుంది, ఒంటరి భవిష్యత్ భయము గా ఉంది. విదేశాల్లో మరియు ఇక్కడ పెద్ద నగరాలలో ఉన్న, పిల్లలకు కొంత ధనమిచ్చి, వారి దగ్గర నే ఉంటాను అని అడుగుదాము అనుకుంటున్నా. ఊరక ఎవరూ చూడటం లేదు ఈ రోజుల్లో, వారికి ఎంత సంపాదన ఉన్నా. అది ఇచ్చినా చూస్తారని కూడా నమ్మకం లేదు. వారి అవసరాలకు, ధనము ఇవ్వకపోయినా పలకరు. మరి ఇప్పుడు చులకన అవుతానా? మీరేమి అంటారు?

జవాబు - ఎవరి పిల్లల బుద్ది మానసిక స్థితి, వారి మోహం వ్యామోహం, అలాగే బంధానికి బాధ్యతకు విశ్వసనీయతకు విలువ ఇస్తారా ఇవ్వరా అనేది, మనకు 20 ఏళ్ళ వయసు లోపు నే తెలిసిపోతుంది, వారికి సొంత సంపాదన వచ్చాక, పెళ్ళైనాక కూడా ఇంకాస్త క్లారిటీ తో తెలుస్తుంది నిరుపితము అవుతుంది.

పిల్లల తప్పుడు బుద్దిని దాచిపెట్టి, మాయ మాటలతో ఇంకొకరి పిల్లల జీవితాన్ని పెళ్ళితో నాశనం చేసి, అలాగే మనకు మనమే ఆత్మ ద్రోహము చేసుకుంటే, మోహం వ్యామోహం భ్రమ లో, దానికి దేవునికి సంబంధము లేదు. మన కర్మ ల కు, ఫలితాలు తప్పక వస్తాయి.

కాబట్టి, మీ కుటుంబ విలువలు మీకు తెలుసు, మంచి సరైన దూరపు ఆలోచన తో అడుగు వెయ్యండి, బయట వారు చెప్పకూడదు, తర్వాత మమ్మల్నే తిరిగి అంటారు.

ఈ జవాబు మీకు కాదు, అందరికీ సహజ ఆలోచన రావడానికి, మీకూ ఈ కింది వివరాలు పనికి వస్తే, మంచిదే కదా.

20 కోట్లు, పిల్లలకు ఒక్కొక్కరికి ఇచ్చి, సంస్కారం ఇవ్వడం మాత్రం మరచి, ఇంటి వెనక అన్నం లేక చనిపోయిన దీన తల్లి దండ్రుల కన్నీటి బాధ కధ, గతము లో పేపర్లో చదివాము కదా? ఐయేయెస్స్ లు, నాయకులు, మరియు కోటీశ్వరులు ను కూడా, అనాధ ఆశ్రమములో చూసాము. ఆశ్రమాలు కూడా, మనము రోగము తో మంచం ఎక్కితే, పట్టించుకోరు, ఉంచుకోరు, హీనముగా చులకన గా చూస్తారు.

సంపాదన లో ప్రాపంచిక మోహం వ్యామోహం లో మరిగి, ధర్మం విడిచి, పిల్లల క్రమశిక్షణ సంస్కారం గురించి పట్టించుకోపోతే, చివరలో ఎవరైనా ఇంతే, ఎన్నో కధలు మన ఇంటి చుట్టూ, కదూ? అయినా మనము మారము, ముందు చూపుతో.

మొక్కై వంగనిదే మానై వంగదు కదా, అన్న సామెత అందరికీ తెలిసిందే. మనము పిచ్చి చెట్టు నాటితే, అదే వస్తుంది, దేనికీ పనికి రాదు, మనల్నే కంబళిస్తుంది, భస్మాసుర హస్తం లాగా.

మంచి చెట్టు నాటితే, అదే మనకు మరియు ఇతరులకు కూడా, మంచి నీడను ఇస్తుంది, రూపాయి ప్రతిఫలం ఆశించకుండా.

అందుకే మంచి వారితో తిరగాలి, మాట్లాడాలి, మన బాధలు త్యాగాలు చెప్పాలి. ఆ నమ్మకం కలకాలం నిలుపుకోవాలి. సొంత పిల్లలు అయినా, చెడ్డ వారితో తిరిగితే, వంశ క్షయం రోగ కారణం విలువల పతనం.

ఈ క్రింది 3 విధాల మాటలను చూడండి, ఎవరు ఎవరితో అనాలో చెప్పండి, దాని వలన ఉపయోగము ఏముందో ఆలోచన చెయ్యండి.

1. ఒంటరిగా ఉండలేము, భయం గా ఉంది, మీతో వచ్చి ఇంట్లో ఉండమంటారా వచ్చే నెల నుంచి లేదా ఆశ్రమం లేదా ఇంకో దోవలో పొమ్మంటారా? మాతో అనవసరం అంటారా, పిల్లలు మరియు భాగస్వామి, ఎదురు గా చెప్పండి అని పిల్లలతో అంటారా?

2. మేము సగం అద్దె కడతాము, మీతోనే నగరం లో లేదా విదేశం లో, సగం ఇంట్లో ఉంటాము లేదా మీతో కలసి ఉంటాము, పిల్లలు మరియు మీకు సేవ చేస్తాము. ఖర్చులు సగం సగం, లేదా మొత్తం మాదే ఖర్చు, అంటారా ధన అహంకారముతో?

3. మాకు కోట్లు ఉన్నాయి, ఒంటరిగా ఉంటాము అంటారా? శక్తి తగ్గినాక, ఒంటరిగా 80 శాతం ఉండలేరు. అందుకే ముదుసలి వారి దగ్గర పరిస్తితులు, ప్రతి వారం వెళ్ళి వాస్తవాలు గమనించండి.

పై వాటిలో, ఏది తల్లితండ్రి మరియు పిల్లల బంధం మాట? ఏది బంధువులు స్నేహితులు మాట? ఆలోచన చెయ్యండి మాయ వదలి.

ఇంకా దేవుడూ ఎప్పుడు ఆలోచన తెప్పిస్తాడు, 50 ఏళ్ళకూ ? లేదా ఆయన నిర్ణయం కూడా, మనకు బుద్ది చెప్పే జ్ఞానం నేర్పే అహంకారం వదిలించే, గుణ పాఠ గురువు లు గా, కొడుకు/కోడళ్ళు/ కూతుళ్ళు/ అల్లుళ్ళు ఏనా?

మా అమ్మ నాన్న, ఇదే ప్రశ్న లు మమ్మల్ని అడిగి ఉంటే, మమ్మల్ని నీచులుగా ధనం ఇస్తే నే పక్కన పెట్టి చూస్తారు, బంధం కు విలువ లేని బండ రాయిలు, కృతజ్ఞతలు విశ్వసనీయత లేని మృగం, నక్క, తోడేలు అని మమ్మల్ని చులకన చేసినట్లు. అది మాకు అవమానం.

అమ్మ అనే కాదు, ఇతరులు ఎవరు మమ్మల్ని ఇలా అడిగినా, ధనం ఇస్తాం చూడండి అంటే, మా మొత్తం పూజలు సంస్కారం నీతి నిబద్దత, వ్యర్థం. అలాంటి వారికి మేమూ దూరంగా ఉంటాము.

ఎందుకంటే, వారు మోహములో ఉన్నారు వాస్తవం గ్రహించరు, మనము బయట ఉన్నాము. మన ప్రతి మాట, వారికి కష్టము గా ఇబ్బంది గా ఉంటుంది, మనతో ఉండలేరు. వారు మోహాన్ని అహంకారాన్ని విడవాలి, విడవలేరు.

ఇప్పుడు మా అమ్మ పేరున రూపాయ లేదు, ఎటువంటి ఫించనూ రాదు, 4 అడుగులు ఒంటరిగా నడిచే శక్తి లేదు, అందుకే మిగతా వారు వద్దు అన్నారు.

కేవలము, వాళ్ళు అంటే మన పెద్దలు ఇచ్చిన సంస్కారమే, మంచి గుణమే, వాళ్ళకు శ్రీరామ రక్ష, అదే మన బాధ్యత విశ్వసనీయత. వాళ్ళ త్యాగాలకు మంచితనానికి బంధానికి విలువ ఇవ్వాలి కానీ, ధనానికి కాదు సుమా.

మనము, పెళ్ళి అయిన పిల్లల, కొత్త ఇళ్ళ కొనడానికి లేదా ఇతర వ్యాపారాలకు, ఎందుకు మూల ధనం ఇవ్వాలి? వారికి ఆత్మాభిమానం లేదా? అందని ద్రాక్షకు ఎగిరే, అప్పులతో కులికే, అంత సంస్కార హీనులా? వాళ్ళ కష్టం వాళ్ళే పడాలి, సొంతము గా ఎదగాలి కదా? ఇంకా చేయి చాపే దుస్తితి లో ఉంటారా? పెళ్ళాం/ భర్త ముందు చులకన కారా, ఈనాడు కూడా పేరెంట్స్ లేదా అత్త మామల దగ్గర ధనం తీసుకున్న చవటలలాగా ఉంటారా?

రేపు ధనం వెనక్కి ఇవ్వమంటే మన అవసరాలకు, కోపాలు రావా? ముందు బయట తన్నే అప్పులు తీరుస్తారా లేక ఇంట్లో వారి మీ ధనం వెనక్కి ఇస్తారా? ధనముతోనే, బంధాలు తెగుతాయని, మీ అనుభవములో వార్తలు వినలేదా? ధనం ఇచ్చి, బంధాలు తెగినాయని ఏడవడం, మంచిదా? ధనముతో గౌరవం ప్రేమ బంధము, కొనగలమా, నిలుపగలమా? మనది సంస్కార పెంపకమేనా? కాదు అన్నప్పుడు, వారితో ధన లావాదేవీలు ఎందుకు?

ప్రాపంచిక మోహ పిల్లలు లాంటి వాళ్ళ ను, అదే ప్రశ్నలు అడిగితే, అది మిమ్మల్ని మీరు చులకన చేసుకున్నట్లు, వారికి తప్పు దోవ నేర్పినట్లు చూపినట్లు కాదా? మీ భవిష్యత్తు నాశనం చేసుకున్నట్లు కాదా? ఎందుకంటే వారికి ధనం ముఖ్యం, బంధం కృతజ్ఞత విశ్వసనీయత లేవు, అని మీరు ఒప్పుకున్నట్లే కదా?

మరి రేపు మీ ధనం అయిపోయాక లేదా మీరు నీరస పడి బలహీనం అయిన తర్వాత, వృధా ఖర్చు, తలనొప్పి, చాదస్తం అని బయట వేయరా?

మనిషి నైజం బుద్ధి తెలిసి తెలిసి, అలాంటి మనిషి తో వెళ్ళడం అంటే, కసాయి వాడిని గొర్రె మూర్ఖత్వం తో నమ్మడం కాదా? మన అహంకారం మూర్ఖపు చేష్టలు కు, భగవంతుడు ఎందుకు బాధ్యత వహించాలి?

కాబట్టి, కీడెంచి మేలెంచాలి. మన వాళ్ళ బుద్దులు మనకు తెలిసినప్పుడు, జాగ్రత్తలు పడాలి.

పాపాత్ములకు ఆస్తులు ఇచ్చి, అది సొంత బిడ్డలు అయినా బంధువులు అయినా స్నేహితులు అయినా, ఆ పాపాత్ముల చేతిలో కాలినా నశించినా, తరగని జన్మ జన్మల పాపమే గాని, పుణ్యము ఎటూ రాదు.

ఎందుకంటే, భస్మాసురులను రాక్షసులను పెంచి పోషించిన ఫలితమే, మన ఉసురు తీసింది కాబట్టి, ఎవరూ జాలి చూపరు చూపలేరు చూపకూడదు, ఎందుకంటే ముందు మనకే మానవత్వం లేదు కాబట్టి, దానవ వంశ పోషకులము కాబట్టి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,930,230; 104 తత్వాలు (Tatvaalu) and views 230,245
Dt : 20-Feb-2022, Upd Dt : 20-Feb-2022, Category : General
Views : 567 ( + More Social Media views ), Id : 1304 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : alone , money , children , stay , good , insult , old , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content