చివరకు తోడు నేనే, స్మశానములోనే మరువకు, బూడిద పూసుకుని, పరమాత్మ తత్వముతో - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

శుభోదయం, శుభసంకల్పం, శుభదినం, గురువులకు నమస్సుమాంజలి

మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమశ్శివాయ, హర హర మహా దేవ శంభో శివ శంకర.

పార్వతీ పరమేశ్వరుల చల్లని చూపు, మన పై మన కుటుంబము పై ఎప్పుడూ ఉండాలని కోరుతూ, . . .

ఈ అజ్ఞాన శిష్యుని, ప్రేమతో దీవించి, చిన్నవారి మాటలను చిరు కోరికను మన్నించి, పండగ పూటైనా, మన మాతృమూర్తి మాతృభాష యందు కృతజ్ఞతలు తో, సొంతం గా మీరు మీ పిల్లలు కూడా, రెండు శుభాకాంక్ష మాటలు, తెలుగు లో రాసి, మీ మిత్రులను బంధువులను మాలాంటి శిష్యులను, ఆనందింప చేయ ప్రార్ధన.

ఎంత అధికారం ఐశ్వర్యము ఉన్నా కూడా, పెద్ద కుటుంబము ఉన్నా కూడా, పరమ శివుని వలే, వ్యామోహ బంధ రాగ ద్వేషాలు లేని, సాధారణ జీవిత మనసున్న మనిషిలా జీవించాలని,

పిల్లలను బాధ్యత తో కూడిన ప్రేమను కలిగి, వినాయక కార్తికేయులు లాగా క్రమశిక్షణ సంస్కారం పెద్దల తల్లి దండ్రుల సమాజము యెడల, భక్తి మర్యాద క్రుతజ్ఞత గౌరవముతో పెంచాలని, తప్పు చేస్తే కఠినముగా శిక్షించి దోవలో పెట్టాలని,

తన దగ్గర పని చేసే వారిని, అలాగే అనుచరులను కూడా, గౌరవముగా సొంత కుటుంబ సభ్యులు, నంది మరియు ప్రధమ గణాలుగా చూడాలని, ఆ శివయ్య మనకు బోధిస్తున్నారు.

ప్రాపంచి భౌతిక సుఖాలలో మునిగి, అహంకారముతో మనల్ని మనము మరువకుండా ఉండేదుకు, పతనము కాకుండా ఉండేందుకు, వీలైనప్పుడు కొంతసేపు కనీసం రోజూ, ధ్యానములో ఉంటూ, మనల్ని మనము తెలుసుకుంటూ మలచుకుంటూ, ఈ ప్రపంచము మిధ్య జరిగేది అంతా నాటకం అని ఎరుగుతూ, మనలోనే పరమాత్మ తో దొరికే వరకు వెతికి, ఆనందాన్ని పంచుకోవాలని తెలియ చెపుతున్నారు.

ఎంత పైకి ఎదిగినా, ఎన్ని సంపాదించినా, చివరకు మీకు తోడు నేనే మరియు కలిసేది స్మశానములోనే మరువకు అని, అక్కడే మన కోసము మిగిలిన బూడిద పూసుకుని, పరమాత్మ తత్వముతో, మనకు అండగా ఉన్నారు.

ఆర్భాట ప్రచారానికి దూరముగా, తాను ఆకారము లేకుండా, నిరాకారముగా కేవలము లింగ రూపములోనే ఉన్నారు.

ఇదే శివ తత్వము, దానిని ఎరిగి మసలు కుంటే, మనకు మనశ్శాంతి ఆత్మ మానసిక బలములు వ్రుద్ది చెంది, జీవిత కష్టాలను నవ్వుతూ ఎదుర్కొని, భగవంతుడు ఇచ్చిన, జీవిత లక్ష్యాని గమ్యాన్ని చేరుకోవాలి.

శివ పూజ అష్టోత్తరము నోటితో చదివి, వీలైతే రుద్ర నమక చమకాలు చదివి, పంచాక్షరీ మంత్రము మననము చేసుకుంటూ, వీలైతే ఒక పూట ఫలహార ఉపవాసము జాగారణ ఉండగలిగితే మేలు.

ముందు కన్నతల్లి పాద దాసుడు, తర్వాతే హరి దాసుడు ఈ మీ శ్రీనివాసుడు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 11-Mar-2021, Upd Dt : 11-Mar-2021, Category : Devotional
Views : 443 ( + More Social Media views ), Id : 1022 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : finally , with you , cemetery , smasanam , body ashes , shiva , divine philosophy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content