Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అమెరికాలో ఇప్పుడు రోజుకు సగటున షుమారు 2,560 కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలతో, ఇంతకు ముందు కంటే ఎక్కువ మంది కోవిడ్-19 నుండి మరణిస్తున్నారు.
ప్రజలను ఇంటిలోనే ఉండమంటున్నారు, అత్యవసరము అయితే తప్ప, బయటకు రావొద్దు అని చెపుతున్నారు.
రాబోయే పండుగ సెలవు దినాలు, పెరుగుతున్న మంచు చలి ప్రభావము, ముక్కుకు గుడ్డ లేకుండా తిరిగే బాధ్యత లేని వ్యక్తుల వలన, కరోనా 2 వసారి అదుపు తప్పుతున్నది ఇప్పుడు.
కొంత మంది వేసిన టీకాలు/ వాక్సిన్, రియాక్షన్ ఎలర్జీ సమస్యలు ఉండడముతో, ప్రజలకు నమ్మకము కలిగించడానికి, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కొత్త టీకాతో కొంతమందికి కొన్ని ఇబ్బందులు, 2 రోజుల దాకా ఉండవచ్చు. అవి సాధారణ విషయాలు, 2 రోజులలో తగ్గుతాయి అంటున్నారు.
వాషింగ్టన్ డీసీ లో, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కు, కోవిడ్-19 టీకాలు వేశారు. ఆయన లైవ్ టెలివిజన్లో, ఫైజర్ / బయోఎంటెక్ వ్యాక్సిన్ను అందుకున్నారు. ఆయనతో పాటు గా, సెకండ్ లేడీ కరెన్ పెన్స్ మరియు యు.ఎస్. సర్జన్ జనరల్ జెరోమ్ ఆడమ్స్ కూడా.
అలాగే, భారత్ లో కూడా, ముందు గా వాక్సిన్ లు రాజకీయ నాయకులపై ప్రయోగించి, ఓ నెల రోజులు వారికి నమ్మకము ఆరోగ్యము కలిగిన మీదట, ప్రజలకు ఇస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది కోరిక. ప్రజలకోసం ఏమైనా చేస్తాము అని, ప్రాణాలు అర్పిస్తాము అనే నాయకులకు ఇది మంచి సదవకాశము.
ఎందుకంటే, డాక్టర్లు, పోలీసులు, ప్రజలకోసము త్యాగము చేస్తున్నారు. కాబట్టి, వారికి ఎటువంటి ప్రమాదము జరుగకూడదు.
అమెరికాలో రాజకీయ నాయకులు చేసి చూపించారు కాబట్టి, భారత్ లో, ముఖ్యముగా మన ఆంధ్రాలో తెలంగాణాలో, మొదట డోసు, రాజకీయ నాయకులందరికి వేసి, ప్రజల పైన వారికి ఉన్న ప్రేమను బాధ్యతను, బహిరంగముగా తెలియపరచాలని, పలువురి కోరిక.
మరి, ఎంత మంది నిజాయితీ పరులు ముందుకు వస్తారో, ప్రజల కన్నా ముందు నిలుస్తారో, చూద్దాము.
వివిధ వార్తలలో ముఖ్యమైనవి ఇలా అనుకుంటున్నారు -
1. రోగ నిరోధక శక్తి ఉన్నవారికి, టీకాలు వెంటనే అవసరము లేదు.
2. మొదటి టీకా వేసిన తర్వాత, కనీసము సంవత్సరము అవనిదే, ఏ టీకా పని తనాన్ని నిర్ధారణ చేయలేము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,110; 104 తత్వాలు (Tatvaalu) and views 226,043 Dt : 18-Dec-2020, Upd Dt : 18-Dec-2020, Category : Politics
Views : 739
( + More Social Media views ), Id : 870 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
first vaccine ,
andhra ,
telangana ,
political ,
leaders ,
public assurance ,
america Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments