కన్నబిడ్డల చదువుకు, మనం హఠాత్తుగా చేయి చాచాలా ఇతరులను, సరైన కారణం చెప్పకుండా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,994; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

For the education of children, should we beg others suddenly, without giving a proper reason?

అన్నా/ అక్కా, మనం 5 ఏళ్ళు సత్సంగం లో నేర్చుకున్నది, మనము ఎవరము కూడా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో పతనము కాకూడదు అని. అంటే, కపటం, నాటకం, 2 నాల్కల ధోరణి, చాటు ఉండకూడదు. తెలుగు రాయడం కూడా రాదు, మనలో చాలా మందికి, కన్న తల్లి మీద క్రుతజ్ఞత విశ్వసనీయత కు.

తమ తల్లి దండ్రుల అత్త మామల గొప్పతనము చెప్పలేరు సేవ చేయలేరు, తమ సంస్కార పిల్లల దగ్గర ముదుసలి తనములో ఉంటాము దేవతలు గా ని చెప్పలేరు, రేపు ఆదాయం పోయి రోగం వస్తే భాగస్వామి చూస్తారు గౌరవముగా తోడు ఉంటారు అని కూడా చెప్పలేరు, నేటి మోహ దాసులు.

మనకు నమ్మకం ఉన్న వారి దగ్గర, మానసిక బలం ఇచ్చే వారి దగ్గర, శ్రేయోభిలాషుల దగ్గర, అంటే కనీసం 5 ఏళ్ళు నమ్మకం ఉన్న వారి దగ్గర, మన గురించి, భాగస్వామి/ పిల్లల లేదా కష్ట నష్టాల గురించి మంచి/ చెడు దాచకూడదు.

మనము అన్ని 5 ఏళ్ళుగా అందరికీ అన్ని విషయాలు పంపి, సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టినా కూడా, మనల్ని నమ్మని జనం ఉన్నారు. వాస్తవం సాక్షాలతో మాకు చేదు, పై పై మాటలు మెరుగులు అబద్దాలు మాకు ప్రియాతి ప్రియం అంటారు.

మరి మనం హఠాత్తుగా వచ్చి, మాకు కష్టం వచ్చింది అంటే, ఎవరు నమ్ముతారు? మనల్నే అహంకారి, గర్వం, పొగరు, ధనపిచ్చి, బంధాలు, మర్యాద తెలీదు అంటారు. సజీవ గురువు సేవ ఆసుపత్రి ఖర్చులు తెలిసికూడా, అంటే, వారి పైత్యాన్ని మన మీద రుద్దడం. పోనీ మనకే 100 లేదా 1000 రూపాయల గర్వం ఉంటే, మరి ప్రాపంచిక మోహ దాసులు మీకు లక్ష కోటి రూపాయల గర్వం ఉండదా? ఈ వారం లో కధనము చదివారు కదా, గోపీ గొపికల మాటలు ఎదుటివారినే తప్పు పడతాయి అని తమ నలుపు దాచి.

అపాత్రా దానం, మహా పాపం అని తెలీదా? తాగుబోతు అబద్దాల కోరు కు 1 రూపాయ ఇచ్చినా, అతని పాపాలకు మనమూ బాధ్యులమే. అప్పు ఇవ్వము అంటే ఒక గొడవ, ఇచ్చాక అడిగితే, ఇంకో గొడవ. అప్పు ఇవ్వడము అంటే, ధనముతో పాటుగా, ఆ మనిషిని, వారితో బంధాన్ని పోగొట్టుకోవడమే అని పెద్దలు చెపుతారు. అదీ కపట నటన దాపరికము మనిషి అని తెలిసి, ఇవ్వడము ఇంకా మూర్ఖత్వము, మన అహంకారము. లక్ష్మిని అవమానించడం.

భస్మాసురినికి వరం ఇస్తే, ఏమి చేసాడు, శివుని నెత్తినే చెయ్యి పెట్టాలని చూసాడు? ఇప్పుడు మన చుట్టూ, మామ వెన్నుపోటు, బాబాయి గుండె పోటు, నక్క పాము పులికి ఓటు అమ్ముకోవడం, మత్తు మందు చిందు పొందు, తప్పు కాదు అనే 2 నాల్కల ఉత్తమ జాతి ఉంది.

వారికి ఏది మంచో ఏది చెడో తెలిసినా, ఉలకరు పలకరు, తమ బిడ్డలు/ భాగస్వామి బుద్ది చెప్పినదాకా. చరిత్రలో వెన్నుపోటు పొడిచింది, గుండెపోటు తెప్పించ్చింది, సగం లేదా మొత్తం ఆస్తి తో బయటకు వెళుతుంది, చివరకు అనాధాశ్రమాలలో వేసింది, సొంత కుటుంబ సభ్యులే మరువద్దు.

ఆ పాపం మన నెత్తిన వేసుకోకూడదు. ఉదహరణకు మన పిల్ల/ పిల్లాడు/ భాగస్వామి తాగుబోతు తిరుగుబోతు మనల్నే తంతారు తిడతారు అబద్దాలు చెపుతారు, మనము ఎందుకు దాచిపెట్టాలి, దాని ఫలితము మనము, అలాగే ఇతర కుటుంబాలు ఎందుకు భరించాలి?

ప్రహ్లాదుడు స్పష్టముగా, మా తండ్రి దానవుడు, తప్పుడు పనులు చేస్తున్నారు, ఇతరులను హింసిస్తున్నారు, నేను ఆయన దోవ లో నడవను అని చెప్పారు కదా? క్రిష్ణయ్య స్పష్టముగా చెప్పారు, బిడ్డ సాంబుడు తప్పుడు మనిషి కరెక్ట్ కాదు, నేను కాపాడను అని. విభీషణుడు స్పష్టముగా చెప్పాడు, మా అన్న మహిళలను ఎత్తుకు వచ్చే దొంగ, కరెక్ట్ కాదు అని. మండోదరి స్పష్టముగా చెప్పింది, భర్త చేస్తున్నది తప్పు అని - మహిళలను ఎత్తుకు వచ్చే దొంగ అని. మరి మనం రాక్షసులకన్నా నీచులమా, తప్పులు దాయడానికి? భరతుడు స్పష్టముగా చెప్పారు, తల్లి తప్పుడు ది అని.

ఏదీ దాచకూడదు. మొన్న హైదరాబాద్ లో షుమారు 20 ఏళ్ళ పిల్ల తాగి, పరాయి మత ప్రియునితో, మత్తులో, అదే వయసు సొంత అక్కనే పై లోకాలకు పంపింది. వారిని అడిగితే ఏమి చెపుతారు, మాకు మా పిల్లలకు సంస్కారం ఉన్నది అని చెపుతారు. ఇప్పుడు నష్ట జరిగింది ఎవరికి? వారికా, బయట వారికా?

ఇంకా మన స్టేటస్ లో ఎన్నో ఘోరాలు రోజూ చూస్తున్నాము, ఈ దాపరికం వలన. వీటిలో సగ్గనికి సగమైనా నిజాలు ఉండవా? మనకు వెన్నుపోటు, గుండెపోటు వస్తే కాని నమ్మమా? అది వచ్చిన తర్వాత చేసేది ఏముంది?

మన ప్రతి మంచి మాట, మన పిల్లల బంగారు భవిష్యత్తు కు ఉపయోగం ఉండాలి, మనం భూమి పై ఉన్నా, లేకపోయినా. రోగాలతో టెన్షన్ తో ఎప్పుడు పోతామొ తెలీదు. అప్పు ఇస్తాం అంటే దేవుడు అన కూడదు, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేదు లోటు పూడదు ఇవ్వలేము మన్నించాలి అని మర్యాదగా చెప్పినా, వాస్తవ పరిస్తితిని 5 ఏళ్ళు పైగా చెప్పినా, దెయ్యం అహంకారం అంటే నష్టం మనకే. కపట, నటన, 2 నాల్కల బుద్ధి తో, మనకే గొయ్య.

మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ మానసిక బలహీనతకు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు కు ఇతరుల ను నిందిస్తూ, ఆడి పోసుకుంటూ కాలం గడపకూడదు, సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత గల వారు.

కౌరవులు పాండవుల ను నిందిస్తూ, తమ పతనం తాము చేసుకున్నారు, మానసిక బలహీనత, కపటం, నటనం, రెండు నాల్కల ధోరణి తో.

పిల్లలు మరియు భాగస్వామి, ఆదే కుసంస్కారం నేర్చుకుంటారు, చరిత్ర ఉన్నది. మన మీదే ప్రయోగం చేసిన, మనకే నష్టం. మన ఆలోచనలు, మన వైబ్రేషన్స్ గా, మన ఇంట్లో ప్రతిబింబం చూపుతాయి. వృధా కాలక్షేపం వద్దు.

కష్టం అందరికీ వస్తుంది, మనము చేబదులు తీసుకున్నాము, మాట మీద ఉండి గౌరవముగా ఇచ్చేసాము, మన అన్ని విషయాలు, అందరికీ తెలుసు.

కానీ మనం అప్పు అడుగుతూ కూడా, మన విషయాలు, ఏళ్ళు గా గోడ మీద పిల్లి లా దాచకూడదు, స్నేహం, నమ్మకం ఉంటే.

మన గురించి మరియు మన పిల్లల మంచి గుణాలు గురించి, 5 ఏళ్ళుగా ఎందుకు గర్వంగా చెప్పలేదు? పోనీ వద్దు చెప్పను అంటే, ఇంక అప్పు అడిగే సమస్య లేదు కదా.

కడుపు న బుట్టిన కన్నబిడ్డల చదువుకు, మనం చేయిచాచాలా హఠాత్తుగా ఇతరుల ను, కారణం చెప్పకుండా? అప్పు ఇచ్చిన తర్వాత చెబుతాను, అనడం సబబేనా? ఇన్నాళ్ళ సంపాదన, ఆస్తులు, అంతస్తులు, పలుకుబడి, మామ అండ ఏమైంది? మనం అడిగింది మంచి పనికే అని నమ్మకం ఏమిటి? భాగస్వామి కి ఈ విషయం తెలుసా?

మన సొంత అన్న/ చెల్లి బుద్ధి ఎలా ఉంటే మనకెందుకు? ఎవరో, మన మామ గారి మోచేతి నీళ్లు తాగుతూ నిలబడ్డావు ఆత్మాభిమానం లేకుండా అంటే, ఇంట్లో వారి చేతిలో కీలుబొమ్మ అంటే, మనకెందుకు. ఆ తప్పుడు మాటలు, గుణాలు అనవసరం కదా. మనకెందుకు ఇతరుల గురించి - అన్న/ చెల్లి/ అక్క, బాబాయి/ మామయ్య మాటలు. మీ గుణం, మన గుణం చెప్పు, 5 ఏళ్ళుగా.

మనకున్న దోవలో మనం వెళ్తాము, నిజం మాత్రమే చెప్పాలి. మనం నోటితో ఏం చెప్పితే అదే నిజం, అందులో లోతు మనం తెలుసుకో గలం, ప్రశ్నల పరంపర ద్వారా, గతం లో అయినా ఇప్పుడు అయినా.

ఎందుకు దాచారు 5 ఏళ్ళుగా, ఏం వ్యాపారం చేస్తున్నారు సొంతం గా, ఆత్మాభిమానం తో? ఎందుకు నష్టం ఇబ్బంది వచ్చింది, ఎవరు మోసం చేశారు, ఎందుకు మోస పోయాం, ఎందుకు మోహం లో ఉన్నాం? భాగస్వామి ఎందుకు అడగలేరు? ఎందుకు తప్పుడు దోవలో మనం వెళుతున్నామని ఎవరూ చెప్పలేదు?

బాంక్/ ఫైనాన్స్ వారికి, దండం పెట్టి, అన్ని సాక్ష్యాలుతో ఆధార్ కార్డుతో, వివరముగా చెపుతామే, అప్పు అడగబోయే మిత్రులకు చెప్పలేమా?

పిల్లలు ఏం చదువుతున్నారు, భవిష్యత్ లో ఏం కావాలనుకుంటున్నారు, డాక్టర్ ఇంజనీరింగ్ లాగా? ఎంత ఆదాయం, ఖర్చులు, అప్పులు అని ఎప్పుడైనా చెప్పావా? మరి నమ్మకం ఎలా?

10 రోజుల తర్వాత చెబుతాను, ముందు అప్పు ఇవ్వు అన్నావు, ఇంకా ఎప్పుడు చెబుతావు? ధనం ఇచ్చాక, ఫోన్ ఆపుకుంటే, ఎవరిని అడగాలి?

పోనీ అప్పు దొరికింది, పని అయిపోయింది, అని చల్లని వార్తలు చెప్పు, మరలా అదీ చెప్పవు. పిల్లల భవిష్యత్తు కు మంచి చేయి, అవసరాలు ముందు ముందు ఎన్నో వస్తాయి. పెద్ద చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, రోగాలు, తగవులు, మోసాలు, కుట్రలు, వెన్నుపోటులు, గుండెపోటులు, ఆశ్రమాలు, అవసరాలు.

మనం ఉన్నా, లేకపోయినా మన నీతి నియమాలు చూసి, పదిమంది మన పిల్లలు కు మనుమలు కు సహాయం చేయాలి, మాయ నుండి బయటకు వెయ్యాలి. నమ్మకస్తులు ఎవరూ లేరు. మరి మనము నీతి మంతులమా, అయితే ఎలుగెత్తి చెప్పు. పోనీ తప్పుడు వారమా, అదీ ఎలుగెత్తి చెప్పు. రాక్షసుడు విభీషణుడు కు, వానరం సుగ్రీవునకు సహాయం అందింది, ఎందుకు? వారి నీతి నియమాలు నిజాయితీ. మరి మనము మానవత్వం తో నీతి గా ఉండలేమా, చాటు దాపరికం లేకుండా?

పోనీ మంచి చెడు చెప్పకపోతే మనశ్శాంతి గా ఉండు, మరలా అప్పు ఇవ్వలేదు సహాయం చెయ్యలేదు అని నిష్టూరాలు ఎందుకు? మీరు మీ కుటుంబం దేవుని దయతో, నీతి నియమాలు మనశ్శాంతి తో, చల్లగా ఉండాలని ప్రార్ధన.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,994; 104 తత్వాలు (Tatvaalu) and views 226,377
Dt : 18-Feb-2024, Upd Dt : 18-Feb-2024, Category : General
Views : 136 ( + More Social Media views ), Id : 2024 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : education , children , beg , others , suddenly , without , proper , reason
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content