స్నేహితుల దినోత్సవం - స్నేహితుడికి మంచి చెడులో సత్యం చెప్పాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,114; 104 తత్వాలు (Tatvaalu) and views 224,463.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు! వారికి కూడా ఒక రోజు ఇచ్చారు, గుర్తు చేసుకోమని, మరచి పోయిన గతాన్ని. మంచి వారిమైతే వారానికి ఒకసారి అయినా మాట్లాడతాము. మనము అవసర అవకాశవాదులము కాబట్టి, సంవత్సరానికి ఒక్క రోజన్నా అందరినీ పలకరిద్దాము.

ఎందుకంటే భ్రమ ల లో, సొంత గొయ్యి తీసుకునే బిజీలో, స్నేహం విలువలు మరచాము కాబట్టి. ఇప్పుడు స్నేహం అంటే, అవసరం, అవకాశం, హోదా, వ్యాపారం, పతనం.

ఈ రోజు ల లో 80 శాతం మంచి ప్రాణ స్నేహితులు ను చూడండి. ఖచ్చితంగా వీరే అయి ఉంటారు. వీరిని ఎవరూ విడదీయలేరు, కళ్ళు మనసు తెరచినప్పుడు వారికి వారు తప్ప.

1. గ్లాసు మజ్జిగ, ముక్క, పొగ పీల్చేవారు, అష్టవ్యసన దాసులు
2. అమ్మ/ అత్త ని, భర్త/ భార్యను ని రాచి రంపాన పెడటం లేదా వదిలేయడం లేదా లెక్క చేయకపోవడం.
3. బ్రమలలో అబద్దాలలో బతికే పరాయి భాష బాబాయి అనుచరులు
4. అహంకారం, అధికారం , వ్యాపారం, . . .అరిషడ్వర్గాల బానిసలు

అంటే చెడు గుణాలు కలిసేవారే, అవసరానికి ఉత్తమ స్నేహితులు అవుతున్నారు.

అది కాదు స్నేహం అంటే. స్నేహితుడికి మంచి చెడులో, సత్యం చెప్పాలి. వారు కింద పడిపోకుండా మంచి నిజాయితీగా చెప్పాలి, తప్పును ఆపాలి, శిక్షకు పోకుండా ఆదుకోవాలి. ఉన్న వారు, లేని వారు అన్న భేదం ఏనాటికి లేకుండా ఉండాలి. వయసు, కుల , మత, లింగ భేదం కూడదు. ప్రోత్సాహించాలి, కానీ బట్రాజు లా చెంచాలా పొగడ్తలు కూడదు.

స్నేహితుల బంధువుల నాయకుల అధికారుల ఆత్మబంధువుల గురువు ల, మంచి హృదయ పూర్వకంగా కోరేవారు, ఎప్పుడూ నీతి నిజాయితీగా, ఉన్న ది ఉన్నట్టు గా మిత్రుల లోపాలు చెప్పి, వారు సరిచేసుకుంటూ బాగుపడే దోవ చూపి, వారి పతనం ను ఆపాలి. కష్టాలు లో కనీసం మాట తోడుగా ఉండాలి, మానసిక బలహీనత నుండి కాపాడాలి. నిజం ముందు నిష్టూరం అయినా, చేదు అయినా, ఆ తర్వాత మనశ్శాంతి ఆరోగ్యం సుమీ.

లేదంటే వారు నిజమైన స్నేహితులు కాదు. పచ్చి అవకాశవాదులు. వారి తల్లిదండ్రులు కు ఎటూ ఉపయోగపడలేరు, పైగా తమ జీవిత భాగస్వామి మరియు పిల్లల కు కూడా మంచి చేయలేరు. ఇది అక్షర సత్యం.

ఎందుకంటే మల్లెపువ్వు ఎక్కడ అయినా ఒకటే సువాసన కదా. మనుషులు ను పరిస్థితి ని బట్టి, నటించదు. కపటం, దాపరికం, నటన, 2 నాల్కల చీకటి స్నేహితులు తో, తస్మాత్ జాగ్రత్త.

నిజమైన స్నేహితులు ని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఎందుకంటే మన తప్పులు నిర్మొహమాటంగా ఎత్తి చూపేది, మనల్ని ధైర్యముగా మందలించేది మన స్నేహితులే, మన తల్లి దండ్రులు తర్వాత.

స్నేహనికి మారు పేరు నువ్వు/ మనం ఎప్పుడు అవుతావు/ అవుతాము అని ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యాలి.

ఎప్పుడూ దేవుళ్ళు లేదా తాతలు లేదా ఇంకోళ్ళ గురించి వేరే వాళ్ళ ఫోటోలు వాట్సాప్ పంపుకోవడం, ఇంతేనా ఇక మన బతుకు.

సొంతముగా రెండు లైన్లను, బండ బారిన, మన గుండె లు రాయలేవా, ఆ తడి ఎండి పోయిందా. రాయలేకపోతే, ఇంక మన దగ్గర స్నేహానికి విలువ ఉందా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,114; 104 తత్వాలు (Tatvaalu) and views 224,463
Dt : 04-Aug-2019, Upd Dt : 04-Aug-2019, Category : General
Views : 2674 ( + More Social Media views ), Id : 145 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : friendship , day , true , Necessity , opportunity , status , business , fall
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content