స్నేహితుల దినోత్సవం - గున్న మామిడీ, స్నేహబంధము, ఎన్నాళ్ళో వేచిన, నేస్తం చూడరా - శ్రీక్రుష్ణ, కుచేల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,085,391; 104 తత్వాలు (Tatvaalu) and views 237,307.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*స్నేహితుల దినోత్సవం - గున్న మామిడీ, స్నేహబంధము ఎంతమధురం, ఎన్నాళ్ళో వేచిన, నేస్తం చూడరా - శ్రీక్రుష్ణ కుచేల, శ్రీక్రుష్ణ అర్జున, శ్రీరామ హనుమ*

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

స్నేహం అంటే, స్థాయి హోదా అవసరం అవకాశం చూసి చేసేది కాదు, కేవలం మంచి గుణం చూసి మాత్రమే చేసేది.

ఎందుకంటే చెడ్డ వారికి కూడా, చెడు అలవాట్లతో ఎంత బాగా స్నేహం కుదిరినా, ఏదో ఒక రోజు తేడా వస్తుంది. వారి చెడ్డ బుద్ది, వారి మీద కూడా, ఇద్దరు చూపించుకుంటారు, తర తమ బేధాలు ఉండవు పతనములో.

రావణుడు మరియు దుర్యోధనుడు, ముందు తమ పిల్లలను, బంధువులను, అనుచరులను, కాల రాశారు. 80 శాతం ఇలాగే అవసరానికే స్నేహితులు గా నటిస్తారు.

అన్ని ఉన్నప్పుడు మంది మార్భలము ఆర్భాటాలు ఎక్కువ, అన్ని పోయాక లేదా అవసరం తీరాక, ఒంటరి, కనీసం గోడు బాధ వినేవాడు ఉండడు వీరికి.

కాబట్టి చెడ్డ వారికి కూడా, స్నేహితుడు, మంచి వాడే ఒకడు కావాలి, నమ్మకము జాగ్రత్తకు నిస్వార్ధ మంచి సలహాకు.

దేవుళ్ళ పూజలు చేస్తాము, యాత్రలు చేస్తాము, 50 ఏళ్ళ కైనా, ఆ దేవుళ్ళ లక్షణాలు, స్నేహం, సేవ, త్యాగం, సమానత్వం, లోక రక్షణ, తగ్గి ఉండటం, మనకు ఒక్కటైనా వచ్చాయా? ఆచరణలో చూపామా?

కుచేలుని ఉదాహరణ ఎందుకు చెబుతున్నాము అంటే, ఇద్దరి అంతస్తుకు హోదాకు ప్రాపంచిక విషయములో, పేద మరియు రాజు కు ఉన్నంత తేడా. కానీ ఇద్దరి ఆత్మలలో ఎటువంటి బేధం లేదు, ఇద్దరి గుణాలు ఒకటే, ఇతరుల క్షేమం, నిస్వార్ధం నీతి నియమాలు తో ఎల్లప్పుడూ ఉండటం. క్రిష్ణ అర్జునుల ది కూడా, ఉత్తమ స్నేహ బంధమే, బంధుత్వం ఉన్నా కూడా.

రాముడు మరియు హనుమంతులను కూడా అలాగే మంచి ప్రాణ స్నేహితులు అనాలి, పైకి సేవకుడు లా కనపడినా. ఆయనది ఏ రాజ్యము, ఏ జాతి? అసలు అవసరము ఎవరిది? సుగ్రీవునిది. మరి ఎందుకు హనుమంతుడు, ఇంత సాహసాలు చేయాలి?

పోనీ నరుల రాజైన రాముడు దగ్గర నుంచి, వానర హనుమాన్ తీసుకున్నది ఏమైనా ఉన్నదా? లేదు. అసలు వానరడు, నరుల రాజుకు సేవకులుగా ఉంటారా? మిగతా వానరులకు, ఇంత బంధం కుదిరిందా? అదే చిత్రమైన స్నేహ బంధం.

ఇంకా ఆయనే, తమ్ముడు లక్ష్మణుని, సంజీవిని పర్వతం తెచ్చి బతికించారు. సీతను కనుక్కుని లంకను తగలబెట్టి వచ్చారు. కావాలంటే భుజాల పై కూర్చుంటే, ఇప్పుడే తీసుకుని వెళతాను అన్నారు. అది నిస్వార్ధ స్నేహితం, ప్రేమ, అందరూ దేవుని బిడ్డలు అని నమ్మితే, తమ ప్రాణాలనే పణము గా పెడతారు.

ఆధ్యాత్మికముగా ఎదిగితే, మానవత్వ విలువలు పెరగాలి, అందరిని సమముగా చూడాలి. మరి మనము మానవ సేవ లో ఎలా ముందుకు వెళుతున్నామో, అందరి ఎదురు ఎందుకు ధైర్యము గా చెప్పలేకపోతున్నాము?

ఎందుకంటే, మన ధ్యానం, పుజ, దైవ స్మరణ అంతా ఉత్తుత్తి దే. చిత్తశుద్ది లేని బూటకము, అంతా పై పై నటన. మనది సాత్వక ఆచరణ అయితే, ముదుసలి వయసులో, సంస్కార పిల్లల దగ్గర ఎందుకు లేము?

ప్రాక్టికల్ లేని థెయరీ తో ఉపయోగమేమో మీ పిల్లలను, విధ్యార్ధులను, అలాగే శాస్త్రవేత్తలను, అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళను, అడగండి. పొలములో దున్నే రైతుని అడగండి, గట్టున కూర్చుని చెప్పిన ఉత్త మాటలతో, పొలములో పంట పండుతుందా అని? పొయ్యి వెలిగించకుండా, బియ్యం కడగకుండా, ఓ ఇల్లాలు, అన్నమా రా అన్నమా రా, అంటే అన్నము వస్తుందా? పిల్లల కడుపు నిండుతుందా?

ఈ రోజులలో ఎవరు ఉన్నారు అలా? సొంత ముదుసలి అమ్మా నాన్న కే తమ భాగస్వామి పిల్లల సౌకర్యాలు ఇవ్వడానికి మనస్కరించడం లేదు. ఇంక పక్క వారికి లాభాపేక్ష లేకుండా సహాయం చేస్తారా? కనీసం మంచి మాటకు, పాటకు, రాతకు కూడా ఉచితము గా శభాష్ అనడానికి, నేను చేయలేనిది నువ్వు చేస్తున్నావు అని అనడానికి, చేతులు లెగవవే? ఇంక ఇతరులకు సహాయం చేస్తారా?

అలాగే రంగు రూపు వేరైనా, జాతీ రీతీ ఏదైనా, చిలుకా కోయిల చేసిన చెలిమీ, ముందు తరాలకు తరగని కలిమీ అని ఓ పాత పాటలో, ఇద్దరు చిన్ననాటి స్నేహితుల బంధాన్ని చూపారు.

అలాగే పువ్వు బట్ట్తి, తేనె రుచి, మారవచ్చును ఏమో గానీ, చెక్కు చెదరనిది, నిజమైన స్నేహమని, నమ్మవచ్చును అన్నారు ఇంకో పాటలో. మరి అలాంటి వారు మనకు దొరికారా? మనము మన పరిస్తితి, మన తల్లి దండ్రుల పరిస్తితి, మన పిల్లల పరిస్తితి, నెలకి ఒక్కసారైనా, వారితో పంచుకున్నామా?

మంచిని పెంచిన మనిషిని, ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడు వానికి, ఏ నాటికి ఓటమి లేదనీ, నే చదివిన జీవిత పాఠం, నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి మిత్రమా, అంటూ ఇద్దరు మిత్రులు పాడుకున్న పాట గుర్తు ఉందా.

గడ్డిని ఆవు మేసి, పాలను మన కిస్తే, కడుపుబ్బ తాగేము రా, మనము, గరళాన్ని కక్కేము రా, అంటూ స్నేహితులు తప్పు అయినా, ఒప్పు అయినా, మనసు విప్పి నిజాలే మాట్లాడాలి సుమా, తమ గురించి, లోకం తీరు గురించి.

లేదంటే, అంతా మాయే, అసలే అరిషడ్వర్గాల బానిసలం, పంచభూతాలు శిక్షలు శిక్షణ ఇవ్వడానికి, సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. వాటికి దొరుకుతావా, లేదా దేవ్ని వెంట నీతి నియమాలతో ఉంటూ, శిక్షకు దూరము అవుతావా, శిక్ష పడినా ఆనందముగా ఎదుర్కొంటావా, మన ఇష్టము. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు.

1) గున్న మామిడీ కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయి 2
ఒక గూటిలోనా రామచిలకుంది
ఒక గూటిలోనా కోయలుంది ||గున్న మామిడీ||
గున్న మామిడీ కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయి

చిలుకేమో పచ్చనిది, కోయిలేమొ నల్లనిదీ,
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది - 2 లైన్లు మొత్తము 2
పొద్దున చిలకను చూడందే, ముద్దుగ ముచ్చటలాడందే 2
చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల ||గున్న మామిడీ||

ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి - 2 లైన్లు మొత్తము 2
రంగు రూపు వేరైనా, జాతీ రీతీ ఏదైనా 2
చిలుకా కోయిల చేసిన చెలిమీ
ముందు తరాలకు తరగని కలిమీ||గున్న మామిడీ||

బాల మిత్రుల కథ, జగ్గయ్య, గుమ్మడి Bala Mitrula Katha, Gunna Mamidi Komma, Directed: K.VaraPrasadaRao, Produced: S.V.NarasimhaRao, Music: Chellapilla Satyam, Starring: Jaggayya,Gummadi; Lyrics : C. Narayana Reddy, Singar: S.janaki

2) స్నేహబంధము.. ఎంత మధురము.., చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము .. 2
ఆ హా హా అహహా ఆ ఆ లా లలా లలలా లలలలా

ఒకే ఆత్మ ఉంటుంది, రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది, వేరు వేరు గుండెల్లో - 2 లైన్లు మొత్తము 2
ఒకటే దొరుకుతుంది, జీవితంలో . . 2
అది ఓడిపోదు, వాడిపోదు, కష్టసుఖాల్లో ||స్నేహబంధము||

మల్లెపూవు నల్లగా., మాయవచ్చును
మంచు కూడ, వేడి సెగలు, ఎగయవచ్చును - 2 లైన్లు మొత్తము 2
పువ్వు బట్ట్తి, తేనె రుచి, మారవచ్చును . 2
చెక్కు చెదరనిది, స్నేహమని, నమ్మవచ్చును ||స్నేహబంధము||

ఆ హా హా అహహా ఆ ఆ, లా లలా లలలా లలలలా
Sneha Bandhamu - V Ramakrishna · S P Balasubramaniam · P Susheela · G Anand
చిత్రం : స్నేహ బంధం (1973), సంగీతం : సత్యం, గీతరచయిత : ఆచార్య ఆత్రేయ, నేపధ్య గానం : జి. ఆనంద్, బాలు, సుశీల

3) ఎన్నాళ్ళో.. వేచిన ఉదయం, ఈనాడే.. ఎదురౌతుంటే. 2
ఇన్ని నాళ్ళు, దాచిన హృదయం, ఎగిసి ఎగిసి పోతుంటే . .
ఇంకా.. తెలవా.రదే.మి , ఈ చీకటి విడిపోదేమి. 2

మంచిని పెంచిన మనిషిని, ఏ వంచన ఏమీ చేయదని 2
నీతికి నిలబడు వానికి, ఏ నాటికి ఓటమి లేదనీ.. 2
నే చదివిన జీవిత పాఠం, నీ..కే నేర్పాలని వస్తే
ఇంకా.. తెలవా.రదే.మి, ఈ చీకటి విడిపోదేమి 2

నాగులు తిరిగే కోనలో, ఏ న్యాయం పనికిరాదని 2
కత్తిని విసిరే వానిని, ఆ కత్తి తోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం, నీతో చెప్పాలని వస్తే
ఇంకా.. తెలవా.రదే.మి, ఈ చీకటి విడిపోదేమి 2

ఎన్నాళ్ళో.. వేచిన ఉదయం, ఈనాడే.. ఎదురౌతుంటే. 2
ఇన్ని నాళ్ళు, దాచిన హృదయం, ఎగిసి ఎగిసి పోతుంటే . .
ఇంకా.. తెలవా.రదే.మి, ఈ చీకటి విడిపోదేమి. 2

సినారె గారి అద్భుత సాహిత్యం, ఘంటసాల మాస్టారు, బాలు యుగళద్వయం, కోదండపాణి గారి సంగీతం సృష్టి ! మంచి మిత్రులు - కృష్ణ, శోబన్ బాబు, గీతాంజలి
Ennaallo Vechina Full Video Song, Manchi Mitrulu, Krishna, Shoban Babu, Geethanjali

4) తోట రాముడు - నేస్తం చూడరా చలం కన్నడ మంజుల

నేస్తం.. చూడర ఈ కుళ్ళు లోకము
చూస్తే.. కోరవు ఈ నర జన్మము
తీపి మాటలు గొంతు కోతలు, నరులకు మా.కే సొంతము
అరె వొయ్ వొయ్ వొయ్ త్రూ . . ||నేస్తం చూడర||

నోట్ల ను వెదజల్లి, ఓట్ల ను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారు రా .. , మావోళ్ళు, గద్దెక్కి ఏలేరు రా - 2 లైన్లు 2 సార్లు
తలలు మార్చడం, కొంప కూల్చడం, నరులకు మాకే సొంతము
అరె వొయ్ వొయ్ వొయ్ త్రూ . . ||నేస్తం చూడర||

గడ్డిని నువు మేసి, పాలను మాకిస్తే
కడుపుబ్బ తాగేము రా.., మేము, గరళాన్ని కక్కేము రా.. - 2 లైన్లు 2 సార్లు
కాళ్ళు పట్టడం, కాటు వేయడం, నరులకు మాకే సొంతము
అరె వొయ్ వొయ్ వొయ్ త్రూ . . ||నేస్తం చూడర||

దేశం అంటాము తిండిని దాస్తాము
కల్తీలు చేస్తాము రా, మేము, ప్రాణాలు తీస్తాము రా- 2 లైన్లు 2 సార్లు
నీతి చెప్పడం, నిప్పు పెట్టడం, నరులకు మాకే సొంతము
అరె వొయ్ వొయ్ వొయ్ త్రూ . . ||నేస్తం చూడర||

Music : Sathyam, Lyrics : Aathreya, Thota Ramudu Songs - Nestham Choodara, Chalam - Kannada Manjula
తోట రాముడు పాటలు - నేస్తం చూడరా, చలం - కన్నడ మంజుల

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.
Friendship day Gunna Mamidi Komma Sneha Bandhamu Ennaallo Vechina Nestham Choodara Srikrishna kuchela  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,085,391; 104 తత్వాలు (Tatvaalu) and views 237,307
Dt : 08-Aug-2022, Upd Dt : 08-Aug-2022, Category : Songs
Views : 713 ( + More Social Media views ), Id : 1488 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : friendship , day , gunna , mamidi , sneha , bandhamu , ennaallo , vechina , nestham , choodara , srikrishna , kuchela
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content