Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు,
దయచేసి తెలుగు లో రెండు మాటలు రాస్తూ,
60 దాటిన ముదుసలి లేదా శక్తి హీనమైన తల్లి దండ్రుల ను దగ్గర ఉంచుకుని, సొంత కుటుంబ సమాన సౌకర్యాలు కల్పించి,
కనీసం కరోనా సమయంలో అయినా దగ్గర నుంచి రక్షణ కల్పిస్తూ,
పిల్లల కు కూడా సంస్కారం సాంప్రదాయం పెద్దల యందు గౌరవం అభిమానం ఆప్యాయత నేర్పుతూ,
ఉత్తమ ఉజ్వల భవిష్యత్తు సమాజం కోసం,
జాలి దయ మానవత్వం ఉన్న సాత్విక మనుష్య కృతజ్ఞులు గా, దేవుని ముందు తల ఎత్తి నిలుద్దాం.
ముదుసలి తల్లి దండ్రులు కు విలువ గౌరవం కృతజ్ఞతలు సమాన సౌకర్యాలు, ఇవ్వలేని వారు, స్నేహితులు ను కూడా గౌరవించ లేరు.
స్నేహితులు ను గౌరవించినా, అది నటన అవసరం అవకాశవాదం లేదా సమాజం కోసం మాత్రమే అవుతుంది సుమా
అందరూ ఎలా స్నేహితుల పండుగ సంతోషం పంచుకుంటారో తెలీదు కానీ, మాది అయితే వింతగా విడ్డూరంగా ఉంటుంది చాలా మందికి. చూడండి, మా స్నేహితుల ముచ్చట్లు.
15 ఏళ్ళు దాటిన తర్వాత లేదా కొంతమందికి 1 వ సంవత్సరం నుంచే, దేవుడు ఇచ్చిన మొదటి జీవితాంత ప్రాణ స్నేహితులు, మన తల్లి దండ్రులు లే. చాలా మంది ఈ విషయం, 50 తర్వాత మరచిపోతారు.
బయట ఎవరి నెవరినో, ప్రాణ స్నేహితులు అంటూ నటిస్తూ, పేరెంట్స్ ని ఒంటరి గా లేదా అనాధాశ్రమం లో లేదా ఇష్టం లేని బిడ్డల దగ్గర పడేస్తారు, తమ ప్రపంచ ఆటలు సాగినంత కాలం.
దేవుని దయవలన, అలాగే మీలాంటి శ్రేయోభిలాషుల సహాయం అండవలన, దేవుడు ఇచ్చిన ఉత్తమ స్నేహితురాలు 76 ఏళ్ల కన్న తల్లి, 7 ఏళ్లుగా నాతో ఆరోగ్యం గా సంతోషంగా ఉంది, ఈ కరోనా కష్ట సమయంలో కూడా.
ఇప్పుడు కూడా ఈ వయస్సు లో, ఉదయం 4 నుంచి 5 కి మధ్యలో లేకపోతే, నాలుగు తిట్టి కొట్టి అయినా లేపుతుంది. స్నేహితులు ను వారి మంచికోసం కఠినముగా ఏమన్నా అంటున్నా కూడా, వాళ్ళ ను అలా అనకు అంటుంది.
ఒక్కోసారి బిళ్ళ లు వేసుకోవడం లేదనో, షుగర్ బీపీ కోసం నడక కు రావడం లేదనో, సమయానికి తిండి తినలేదనో, వద్దు అన్నా బయట చిమ్ముతూ ముగ్గు వేయడం వలన, కోపంతో కసురుకున్నా, బేలగా నావైపు చూస్తే, పెల్లుబికే కన్నీళ్ళు కళ్ల చాటున దాచి, నీ క్షేమం కోసమే కదమ్మా, నీరసం తో లేక తూలి కిందపడి మంచం ఎక్కితే మనల్ని ఎవరు చూస్తారు, అని లాలిస్తే, నవ్వుతూ సరే అంటుంది ఆ రోజుకి. మరలా మామూలే రేపు.
93 వారాలు 108 ప్రదక్షిణలు కు కూడా, చలిలో పక్కన కూర్చుని, జప మాలతో 108 లెక్క వేస్తుంది. నేను లెక్క తప్పితే దేవుని కి కోపం వస్తుంది అని.
నడుము ఒళ్ళు నెప్పులు ఎన్ని ఉన్నా, మైలు నడకలో, లవకుశ పద్యాలు వింటూ, తన 60 ఏళ్ళ పాత జ్ఞాపకాలు బాధలు నెమరు వేసుకుంటూ చెపుతుంది.
ఆదాయం లేకపోయినా, కడుపు నిండా అన్నం పెడుతుంది, ఆదరించి గౌరవిస్తుంది. ఇంకా నన్ను పసిబిడ్డ లాగా కళ్ళలో పెట్టుకుని చూస్తుంది.
అందుకే అందరికీ చెబుతా, నా కన్న కూతురు నన్నే చూస్తుంది, నేను తనను చూడటం అని అనవద్దు దయచేసి, తను మాత్రమే నాకు అండ అని.
అందుకే, 60 దాటిన తల్లి దండ్రులు మన సొంత బిడ్డలు, మన కోసం జీవితం ఖర్చు చేసిన ప్రాణ స్నేహితులు. మనం లాలించినట్లు గా, ధనం తో లేదా ఇతర బంధాలు, బంధువులు చూడలేరు. విసుక్కుని ఈసడించుకుంటు ఉండలేరు వారు. తర్వాత మన బతుకు అదే సుమా.
సరే ఇక బయట స్నేహితులు గురించి అనుకుందాం.
ఈరోజు కు కూడా, ఒకటో తరగతి నుంచి మాస్టర్ డిగ్రీ దాకా, ఉద్యోగం దాక, ఉత్తమ స్నేహితులు,
అలాగే ఊరు మండలం జిల్లా రాష్ట్రం దేశం నుంచి, కనీసం ఉత్తమ అధికారి, ఒక జిల్లా శాఖ అధికారి, ఒక కలెక్టర్, ఒక శాసన సభ్యుడు, ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక మంత్రి, ఒక ప్రవాసుడు, ఇతరులు
కనీసం ఒకరు లేదా ఎక్కువ మంది, వారానికి ఈ మెసేజ్ లు, శనివారం దేవుని సందేశం, ఇంకా ఎన్నో అందుకుని, ఆశీర్వదించే ఆ పుణ్యాత్ములకు ఏమివ్వగలము. తలవంచి వినయ పూర్వక నమస్సుమాంజలి తప్ప.
వారి మంచి కోసం ఎంత తిట్టిన గుర్తు చేసిన కూడా, నీ తిట్లు మాకు ఆశీర్వాదం బలం అని చెప్పి, దూరంగా వెళ్ళని వారు ఎంతోమంది ఉన్నారు.
నిజం నిర్భయంగా చెబుతామని ఎత్తి చూపుతున్నాము అని, అలిగి దూరం వెళ్లిన వారూ ఉన్నారు.
గురువు లు అనుభవజ్ఞులై న మీరంతా బాగుండాలి. మీ అందరి ఆశీస్సులు తో మేమూ బాగుండాలి.
జగమంత కుటుంబం మనది.
మన మాటలు చేతలు మనసు, మూడు ఒకేలా ఉండాలి అదే త్రికరణ శుద్ధి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు.
తల్లి దండ్రులు ను ప్రాణ స్నేహితులు గా కళ్ల లో పెట్టి చూడలేని వారు, బయట స్నేహితులు ను కూడా చూడలేరు.
అలాంటి వారితో, ధన అవసర అవకాశ వాదములో నటిస్తే దగ్గరగా మసలితే ఆ పాపం లో భాగం పంచుకుని, చివరకు కర్ణునిలా పతనము అవుతాము, మనం మంచి వారం అయినా కూడా.
ముందు అమ్మ నాన్న పాద దాసుడు, తర్వాత హరిహర దాసుడు, ఈ నిత్య అజ్ఞాన శ్రీనివాసుడు
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,572,845; 97 తత్వాలు (Tatvaalu) and views 198,497 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments